ఉంటే ఉంటా పోతే పోతా
హైదరాబాద్, మేజర్‌న్యూస్: తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా పోరాటం కొనసాగిస్తామని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. కమిటీ సిఫారసులతో సంబంధం లేకుం డా 2009 డిసెంబర్9 ప్రకటణకు కట్టుబడి ఉండి పార్ల మెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణా కేంద్ర ప్రభుత్వ కాల యాపనను నిరసిస్తూ గురువారం జేఏసీ ఇందిరా పార్కు వద్ద మహాధర్నా కార్యక్రమం చేపట్టింది. టీఆర్‌ఎస్ అధి నేత కేసీఆర్, బిజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, జేఏసీ నాయకులు ఈ ధర్నా కార్య క్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లా డుతూ ‘‘ ఉంటే ఉంటా..పోతే పోతా’’ తెలంగాణ వచ్చే వరకు పోరాటం చేస్తా.. అవసరమైతే మళ్లీ దీక్ష చేస్తా... ‘‘తెలంగాణ బిడ్డలారా..మీ కడుపులో తలపెట్టి చెబు తున్నా, ఎవరూ కాల్చుకోవద్దు, మీరు సచ్చపోయి మమ్మ ల్ని సగం చంపవద్దు...తెలంగాణ వచ్చే వరకు మెండిగా పోరాటం చేస్తా’’ అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక రెండు ప్రాంతాలకు అనుకూలమని ఎరికి వారే చెప్పుకునే విధం గా ఉంది. 1956 ముందున్న ఆంధ్ర తెలంగాణ ప్రాతా లను ఏర్పాటు చేయాలన్నది ఒకటే కమిటీ నివేదికలో బా గుంది. మేం కోరుకునేది కూడా ఆదే. మిగతాకమిటీ నివేదిక అంతా చెత్తబుట్టలో పడేయాల్సిందే. అసలు శ్రీకృస్ణ కమిటీకి దమాక్ ఉందా? హైదరా బాద్ ఎవడబ్బ సొత్తు, హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికేనా మీరు ఇన్ని రోజులు వని చేసింది.
రాష్ట్రం సమైక్యంగానే ఉంచుతూ మూడు బోర్డులు వేయాలట.. మేం ఎన్ని బోర్డులు చూడ లేదు...సమైక్యరాష్ట్రంలో మీరిచ్చిన హామీలు ఎన్ని నెరవేరాయి? ఇంకా మిమ్మల్ని మేం నమ్మే పరిస్థితిలో లేం.. ఇప్పటికయినా మొదటి మూడు సూచనలు అమలు సాధ్యం కాదని వారే చెప్పారు. ఆంధ్రాలో కలిసి ఉండటం అసాధ్యం అని గమనిం చింది. తెలంగాణ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. లేదంటే అటు ఆంధ్రా, ఇటు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా బతగదు. ఇకపై తెలంగాణ పొలిటికల్ జేఏసీ పిలుపు మేరకు ఐక్యంగా పోరాటాలు చేస్తామన్నారు. తెలంగాణ ప్రాంత ప్రతినిధులంతా రాజీనామాలు చేసి కేంద్రం మెడలు వంచుదామని, రాజకీయ సంక్షోభం సృష్టించడం ద్వారానే తెలంగాణ సాధ్యమవుతుందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయటం ఒక్కటే కేంద్ర ప్రభుత్వం ముందున్న కర్తవ్యమని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కింద ప్రత్యామ్నా యాలు పనికిరావన్నారు.
పీఆర్పీ ఎమ్మెల్యే అనిల్‌ని తరిమికొట్టిన తెలంగాణ వాదులు
శ్రీకృష్ణ నివేదిక నివేదిక వెలువడగానే పీఆర్పీ ఎమ్మెల్యే అనిల్ (బాల్కొండ నియోజకవర్గం) ఇందిరా పార్కు వద్ద తెలంగాణ జేఏసీ చేస్తున్న ధర్నా వద్దకు వచ్చారు. దీక్ష వద్దకు ఎందుకు వచ్చావు.. నీవు తెలంగాణ ద్రోహివి అంటూ తెలంగాణ వాదులు తిట్ల వర్షం కురిపించారు. అంతటితో ఆగని టీఆర్‌ఎస్ కార్యకర్తలు, విద్యార్ధులు అతన్ని చెప్పులతో లతో కొడుతూ తరిమి కొట్టారు. కేసీఆర్, జేఏసీ నేతలు విద్యార్థులను వారించినా లాభం లేకపోయింది. ధర్నా వద్ద ఉన్న పోలీసు అధికారులు వారి వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు.
Take By: Suryaa.com
Tag: Telangana, Telangana Report, RajNews, eenadu, Sakshi, KCR, AP, NEWS, Images, Hot Images, Srikrishna Committee,
1 comments:
ఉప్పు కప్పురంబు కే.సి.ఆర్. బక్కగనుండు
చూడ చూడ ఫేసు చెత్తగనుండు
ముక్కులందు కే.సి.ఆర్. ముక్కే వేరయా.
విశ్వదాభిరామ తెలంగాణా రాదురా మామ.
Post a Comment