విశ్వంలో మరో ధరిత్రి!
- సౌర వ్యవస్థ ఆవల గుర్తించిన‘ కెప్లర్’
- కెప్లర్-22బీ గా నామకరణం
- భూమి కంటే 2.4 రెట్ల పరిమాణం
- 290 రోజుల పరివూభమణకాలం
- ప్రాణులకు నివాస యోగ్యమైన వాతావరణం
- పర్వతాలు, ద్రవంతో కూడిన ఉపరితలం
- నాసా ధ్రువీకరణ
వాషింగ్టన్, డిసెంబర్ 6: అంతరిక్షంలో భూమి లాంటి నివాసయోగ్యమైన గ్రహ శోధనలో పరిశోధకులు మరో ముందడుగు వేశారు. గత కొన్ని సంవత్సరాలుగా మరో ధరిత్రి కోసం అంతరిక్షాన్ని టెలిస్కోప్‌లతో జల్లెడ పడుతున్న నాసా పరిశోధకులు విజయం సాధించారు. మన సౌరవ్యవస్థకు ఆవల ‘గోల్డిలాక్స్ జోన్’లో నివాసయోగ్యమైన భూమిలాంటి గ్రహాన్ని (సూపర్ ఎర్త్) అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ గుర్తించింది. దీంతో భవిష్యత్తులో సౌర వ్యవస్థ ఆవల మనుషులు నివసించొచ్చని పరిశోధకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మన గెలాక్సీలో సూర్యుని లాంటి నక్షత్రం ‘జీ5’ నుంచి 600 కాంతి సంవత్సరాల దూరంలో చక్కర్లు కొడుతున్న సూపర్ ఎర్త్ నాసాకు చెందిన కెప్లర్ అంతరిక్ష టెలిస్కోప్‌కు చిక్కింది. ఈ టెలిస్కోప్ పంపిన చిత్రాల ఆధారంగా గుర్తించిన సూపర్ ఎర్త్‌కు పరిశోధకులు ‘కెప్లర్ 22 బీ’గా నామకరణం చేశారు. ఈ విషయాన్ని నాసా సోమవారం అధికారికంగా ధ్రువీకరించింది.
నివాసానికి అత్యంత అనుకూలం
ఈ కెప్లర్ 22 బీపై భూమిపై లాగా పర్వతవూపాంతం ఆవరించి ఉంది. దీనిపై ఉష్ణోక్షిగత అత్యంత చల్లగా, అత్యంత వేడిగా కాకుండా 22 డిగ్రీల సెంటిక్షిగేడ్ (72 డిగ్రీల ఫారన్‌హీట్)లు ఉన్నట్లు పరిశోధకులు అంచనా వేశారు. మన భూమి కంటే ఇది 2.4 రెట్ల పరిమాణం (సైజు) కలిగి ఉండి.. తన నక్షవూతాన్ని 290 రోజులకు ఒకసారి చుట్టివస్తోంది. కెప్లర్ 22బీ ఎక్కువగా పర్వతాలు, వాయువులు లేదా ద్రవపదార్థాలను కలిగి ఉంది. దీంతోపాటు దీనిపై ఉన్న నీరు గడ్డకట్టకుండా, అత్యంత వేడిగా ఉండకుండా ఉండటంతో ప్రాణులు మనుగడ సాగించేందుకు వీలుంది.
గతంలో గుర్తించినవి..
సౌరవ్యవస్థ ఆవల నక్షత్రం చుట్టూ చక్కర్లు కొడుతుండగా.. ఈ సూపర్ ఎర్త్‌ను నాసా పరిశోధకులు 2009లోనే గుర్తించారు. అయితే ఇది నివాసయోగ్యమైన వాతావరణం కలిగి ఉంటుందని అప్పుడు పరిశోధకులు ఊహించలేదు. తాజాగా కెప్లర్ టెలిస్కోప్ పంపిన చిత్రాల ఆధారంగా సంబంధిత నక్షత్రం నుంచి సూపర్ ఎర్త్ దూరాన్ని గణించి దానిని నివాసయోగ్యమైనదిగా తేల్చారు. సూర్యుని నుంచి గ్రహాలు పరివూభమించే దూరాన్ని బట్టి అవి నివాసానికి అనుకూల వాతావరణాన్ని కలిగి ఉన్నాయా లేదా అనేది నిర్ధారిస్తారు. కెప్లర్ 22బీ ఆవిష్కరణ కంటే ముందు ‘గ్లీస్ 581డీ’ అనే గ్రహం తన నక్షత్రం చుట్టూ నివాసయోగ్యవూపాంతంలో పరివూభమిస్తోందని ఫ్రెంచ్ ఖగోళ పరిశోధకులు ఈ ఏడాది మేలో గుర్తించారు.
అదేవిధంగా ‘హెచ్‌డీ 85512బీ’ అనే గ్రహాన్ని స్విట్జర్లాండ్ పరిశోధకులు ఈ ఏడాది ఆగస్ట్‌లో గుర్తించారు. కానీ ఈ రెండు గ్రహాలు పరివూభమించే నక్షవూతాలు మన సూర్యుని కంటే తక్కువ ఉష్ణోక్షిగతను కలిగి ఉన్నాయని నాసా పేర్కొంది. కెప్లర్ 22 బీ అనేది ఈ రెండు గ్రహాల కంటే పరిమాణంలో చిన్నదైనప్పటికీ నివాసయోగ్య జోన్ మధ్యలో ఉండటం వల్ల ప్రాణులు నివసించేందుకు అనుకూల వాతావరణం కలిగి ఉంటుందని వెల్లడించింది. మన సౌరవ్యవస్థకు వెలుపల కెప్లర్ టెలిస్కోప్ ద్వారా భూమి లాంటి వ్యవస్థ ఉందని గుర్తించినపుడు ఆశ్చర్యానికి గురయ్యామని కెప్లర్ డిప్యూటీ సైన్స్ బృంద నాయకుడు నటాలీ బటాలా పేర్కొన్నారు. మరిన్ని టెలిస్కోప్‌లు ఉపయోగించి కెప్లర్ 22బీ గ్రహానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని త్వరలోనే సేకరిస్తామని తెలిపారు.
మన గెలాక్సీలో... డైమండ్ గ్రహాలు
మన గెలాక్సీలో సౌర కుటుంబం ఆవల ఉన్న కొన్ని గ్రహాలు వజ్రాలతో రూపుదిద్దుకున్నట్లుగా తాజా అధ్యయనంలో తేలింది. టెలిస్కోప్‌లకు చిక్కుతున్న కొన్ని గ్రహాలు 50 శాతం డైమండ్‌ను కలిగి ఉంటున్నాయని పరిశోధకులు తేల్చారు. ఈ గ్రహాలలో భూమిపై కంటే ఎక్కువ మొత్తంలో కార్బన్ పదార్థం ఉండటం వల్ల ఇది సాధ్యపడుతుందని పరిశోధకులు నిర్ధారించారు. సాధారణంగా వజ్రాలు ఉష్ణాన్ని త్వరగా పరివర్తనం చెందించడం వల్ల ఇవి త్వరగా వేడిని కోల్పోయి అత్యంత చల్లగా ఉంటున్నాయని నిర్ధారించారు. అందువల్ల ఇవి భౌగోళిక ఉష్ణోక్షిగతను కలిగి ఉండకపోవడంతో భూమిలాగా నివాసానికి అనుకూలం కాదని కనుగొన్నారు.
కెప్లర్ అంతరిక్ష టెలిస్కోప్ విశేషాలు
కెప్లర్ 22బీ అనే మరో ధరివూతిని గుర్తించిన కెప్లర్ అంతరిక్ష టెలిస్కోప్‌ను నాసా 2009లో ప్రయోగించింది. ఇది మన సూర్యుని లాంటి నక్షవూతాల చుట్టూ నివాసానికి అనుకూలమైన గ్రహాలకు సంబంధించిన సమచారాన్ని సేకరింస్తుంది. కెప్లర్ ప్రాజెక్లు కోసం నాసా 600 మిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది. ఈ టెలిస్కోప్ ఇప్పటి వరకూ సౌరవ్యవస్థల వెలుపల 2,326 గ్రహాలను గుర్తించినట్లుగా నాసా పేర్కొంది. ఇందులో 48 గ్రహాలు నివాసయోగ్య ప్రాంతంలో ఉన్నట్లుగా పేర్కొంది. కెప్లర్ టెలిస్కోప్ అంతరిక్షంలో పరివూభమిస్తూ 2012 నవంబర్ వరకు ఇలాంటి గ్రహాల సమచారం పంపించనుంది.
ఇవీ ప్రత్యేకతలు..
- 95 మెగాపిక్సెల్ సామర్థ్యంగల చిత్రాలను తీయగలిగే కెమెరా, రెండు చార్జింగ్ పరికరాలు కలిగి ఉంది.
- ఆకాశంలో నాలుగింట ఒకవంతును ఒకేసారి చిత్రిస్తుంది.
- ఒకేసారి 1,50,000 నక్షవూతాలను వీక్షించవచ్చు.
- 4 నెలల్లోనే 1,235 కొత్త గ్రహాలను గుర్తింపు
- పర్వతాలతో కూడిన గ్రహాలనే అధికంగా
- ఇప్పటికి 68 భూమి సైజు గ్రహాలను గుర్తించింది.
- అందులో నివాసయోగ్యమైన ప్రాతంలో ఉన్నవి ఐదు

0 comments:
Post a Comment