టీ ఎంపీల రాజీనామాల తిరస్కరణ
- పెండింగ్‌లో రాజగోపాల్,మేకపాటి రాజీనామాలు
- మనోహర్ దారిలోనే మీరాకుమార్!
- భావోద్వేగాలతోనే నిర్ణయమని నిర్ధారణకు?
- నిర్దేశిత ఫార్మాట్‌లో లేనందునే వెనక్కి
- స్పీకర్ కార్యాలయ వర్గాల వెల్లడి
న్యూఢిల్లీ, నవంబర్ 15 () : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యానికి నిరసనగా తెలంగాణ ఎంపీలు చేసిన రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయ సంయుక్త కార్యదర్శి మంగళవారం ఎంపీలందరికి వ్యక్తిగతంగా ఫోన్లు చేసి ఈ విషయాన్ని తెలిపారు. అయితే భువనగిరి ఎంపీ కోమటిడ్డి రాజగోపాల్‌డ్డి రాజీనామాను మాత్రం పెండింగ్‌లోనే ఉంచారు. రెండ్రోజుల్లో స్పీకర్ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆయనకు సమాచారమందించారు. గురువారం ఆయన స్పీకర్‌ను కలవనున్నారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్ రాజశేఖరడ్డి పేరును చేర్చడాన్ని నిరసిస్తూ రాజీనామా చేసిన నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌డ్డి రాజీనామాను కూడా పెండింగ్‌లో పెట్టారు.
రెండ్రోజుల్లో స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలవాలని ఆయనకు కూడా ఆదేశాలు అందాయి. పార్లమెంట్ నిబంధనల్లోని అధ్యాయం 22, రూలు 240కి అనుగుణంగా రాజీనామాల లేఖలు లేనందున వాటిని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ కార్యాలయవర్గాలు పేర్కొన్నాయి. రూలు 240 ప్రకారం రాజీనామా లేఖలో పలానా కారణంతో రాజీనామా చేస్తున్నామని ప్రస్తావించకూడదు. అయితే కొందరు ఎంపీల రాజీనామా లేఖలు నిర్దేశిత నమూనాలో లేనట్లుగా తెలిసింది. అదే సమయంలో రాజీనామాలు చేసిన కొందరు ఎంపీలు స్థాయిసంఘం సమావేశాలకు హాజరవడం, టీఏ, డీఏ వంటి భత్యాలను తీసుకోవడం, సభకు హాజరవడంతో రాజీనామాలపై వారు నిజాయితీతో లేరని మీరాకుమార్ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో నెలకొన్న భావోద్వేగ పరిస్థితులకు అనుగుణంగా రాజీనామా చేశారనే కారణంతో శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరించిన విషయం తెలిసిందే.
ఎంపీలు కూడా అదే కారణంతో, అదే సమయంలో రాజీనామలు చేసినందున నాదెండ్ల మనోహర్ అభివూపాయాన్ని మీరాకుమార్ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై డిసెంబర్ 9న చేసిన ప్రకటనను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ జూలై 4న 9 మంది కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీలు, ఒక రాజ్యసభ ఎంపీ, ఆ తర్వాత రెండ్రోజులకు ఇద్దరు టీఆర్‌ఎస్, మరో ఇద్దరు టీడీపీ ఎంపీలు తమ రాజీనామా లేఖలను స్పీకర్‌కు సమర్పించారు. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు, ఇద్దరు టీడీపీ ఎంపీలు స్పీకర్‌ను స్వయంగా కలిసి రాజీనామా లేఖలను అందజేయగా.. టీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు, ఒక కాంగ్రెస్ ఎంపీ ఫ్యాక్స్ ద్వారా రాజీనామాలను పంపించారు. ఆ తర్వాత తమ రాజీనామాలను ఆమోదించాలని ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్‌ను మరోసారి కలిసి విజ్ఞప్తి చేశారు. ఒకరిద్దరు మినహా పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ఎంపీలు బహిష్కరించిన విషయం తెలిసింది.
రాజీనామాలపై నాలుగు నెలల పాటు సుదీర్ఘ పరిశీలన తర్వాత పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే వీరితో పాటు రాజీనామా చేసిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు రాజీనామాపై రాజ్యసభ చైర్మన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
పార్లమెంట్‌లో తేల్చుకుంటాం : టీఎంపీలు
తమ రాజీనామాలను తిరస్కరించినందున ఇక పార్లమెంటు వేదికగానే ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలంగాణవూపాంత ఎంపీలు ప్రకటించారు. స్పీకర్ నిర్ణయం ఊహించిందేనని పేర్కొన్నారు. అయినా తమ చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు అవసరమైతే మళ్లీ రాజీనామా చేస్తామని టీఎంపీల అధికార ప్రతినిధి గుత్తాసుఖేందర్ రెడ్డి తెలిపారు.
Take By: T News
Tags: Telangana News, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, Telangana agitation, statehood demand, Venkat Reddy,
0 comments:
Post a Comment