హస్తినలో... మాటలు మస్త్!
- - చిదంబరం, ప్రణబ్‌తో గవర్నర్ భేటీ
- కోర్‌కమిటీ ముందుకు రాష్ట్ర నాయకత్వం
- ఉదయం 11.30 నుంచి సాయంత్రం 5 దాకా
- ‘అవును’.. ‘కాదు’.. పద్ధతిలో ఇంటర్వ్యూ
- సీఎంతో పావుగంట..జైపాల్‌తో ముప్పావుగంట
- ముక్కుసూటిగా ప్రణబ్ ప్రశ్నలు
- హైదరాబాద్‌పైనా పెద్దల వాకబు
- రాష్ట్రం ఇస్తే పార్టీకి లాభమా? నష్టమా?
- ఎవవరు రాజీనామాలు చేస్తారు?
- వ్యక్తిగత అభివూపాయాల సేకరణ
- సత్వర పరిష్కారమే మేలన్న రాష్ట్ర నేతలు
- ప్రస్తావనకు రాని రాష్ట్రపతి పాలన
- ఊసే లేని రాయల్ తెలంగాణ
- ఇప్పుడే నిర్ణయం చెప్పలేం: ఆజాద్
- సోమవారంతో చర్చలకు ఫుల్‌స్టాప్: ప్రణబ్
- రేపటి కోర్ కమిటీలో వైఖరిపై నిర్ణయం?
న్యూఢిల్లీ, అక్టోబర్ 8:తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో సాగుతున్న సకల జనుల సమ్మె అంతకంతకూ కాక పెంచుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం తన చర్చల ప్రక్రియను వేగవంతం చేసింది. తొలి దఫాగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నేతలతో గ్రూపులుగా చర్చించిన కాంగ్రెస్ పెద్దలు.. రెండవ విడతలో భాగంగా శనివారం నాడు గవర్నర్‌తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు, రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్నవారితోనూ వ్యక్తిగతంగా సమావేశాలు జరిపి వారి అభివూపాయాలను తీసుకున్నారు. దీనికి కొనసాగింపుగా సోమవారం నాడు మళ్లీ చర్చల ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఈ సారి చర్చల్లో సీమాంధ్ర నేతలు కావూరి సాంబశివరావు, చిరంజీవి, వివిధ స్థాయీ సంఘాల చైర్మన్లు ఉంటారని సమాచారం.
గత రెండు మూడు రోజులుగా జరుగుతున్నదంతా విస్తృత స్థాయి సంప్రతింపుల్లో భాగమేనని ఆజాద్ అన్నారు. సోమవారంతో చర్చల ప్రక్రియను ముగిస్తామని ప్రణబ్ ముఖర్జీ చెప్పడం విశేషం. చర్చల ప్రక్రియ ముగియగానే కోర్‌కమిటీ సమావేశం జరిపి తెలంగాణపై కాంగ్రెస్ వైఖరిని స్పష్టం చేయాల్సి ఉంటుంది. అయితే.. సోమవారం ఆ విధాన ప్రకటన వెలువడుతుందా? లేక జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నాయకులతో చర్చలు జరిపిన తర్వాత వెలువడుతుందా? అన్నది తేలాల్సి ఉంది. నిర్ణయంలో అందరికీ భాగస్వామ్యం కల్పించే ప్రక్రియలో తదుపరి చర్చలను కాంగ్రెస్ కోర్ కమిటీ ప్రతినిధులు కొనసాగించారు. రెండు దఫాలుగా మూడు గంటలపాటు పాటు ఆర్థిక శాఖ కార్యాలయం నార్త్ బ్లాక్‌లో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రులు ప్రణబ్, చిదంబరం, ఆంటోనీ, అహ్మద్ పటేల్‌తో పాటు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి అజాద్ పాల్గొన్నారు. రాష్ట్ర సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, డీసీఎం దామోదర్ రాజనర్సింహ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, పీసీసీ మాజీ చీఫ్ డీ శ్రీనివాస్, కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, కిషోర్ చంద్రదేవ్, పనబాక లక్ష్మి, పల్లం రాజు, పురందేశ్వరిని కోర్‌కమిటీ సమావేశానికి విడివిడిగా ఆహ్వానించి, వ్యక్తిగత అభివూపాయాలను తీసుకున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులతోపాటు సమస్య పరిష్కారానికి అభివూపాయాలను సేకరించారు. రెండో విడత చర్చల ప్రక్రియను శనివారం ఉదయం 11.40 నిమిషాలకు ప్రారంభించిన కోర్‌కమిటీ.. సాయంత్రం ఐదు గంటలకు ముగించింది. కోర్‌కమిటీ ఎదుట తొలుత రాజనర్సింహ, చిట్టచివరిగా కిశోర్‌చంవూదదేవ్ హాజరయ్యారు.
అన్నీ తానై ప్రణబ్
అభివూపాయ సేకరణ సందర్భంగా ప్రణబ్ మినహా ఇతర కోర్‌కమిటీ సభ్యులకు అధినేత్రి సోనియా గాంధీ నుంచి నిర్దిష్ట ఆదేశాలు లేవని తెలిసింది. ఫలితంగానే నేతలతో మాట్లాడే సమయంలో ఒక్క ప్రణబ్ ముఖర్జీయే అంతా తానై వ్యవహరించారని తెలిసింది. మిగిలిన నేతలు మధ్యలో జోక్యంచేసుకోవడం, వారు చెబుతున్న అంశాలు నోట్ చేసుకోవడానికి పరిమితమయ్యారని సమాచారం.
మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని పరిస్థితులను, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై వారికి ఉన్న అభివూపాయాలను, సమ్మె నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనే కోర్‌కమిటీ సభ్యులు, ప్రధానంగా ప్రణబ్‌ముఖర్జీ ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. పార్టీ తరఫున తెలంగాణ సమస్య పరిష్కారం బాధ్యతను భుజానికెత్తుకున్న ప్రణబ్.. వచ్చిన వారి నుంచి కరాఖండితంగా ‘మీరు తెలంగాణకు వ్యతిరేకమా? అనుకూలమా?’ అని ప్రశ్నించి నిర్దిష్ట జవాబు రాబట్టారని సమాచారం. తెలంగాణ అంశాన్ని ఇక ఏ మాత్రం నాన్చకుండా త్వరగా తేల్చేసే ప్రక్రియలో భాగంగానే డొంక తిరుగుడు వ్యవహారానికి ప్రణబ్ చెల్లుచీటీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆయన వేసిన ప్రశ్నలు ముక్కుసూటిగా ఉన్నాయని ఒక మంత్రి తెలిపారు. ఇక నిర్ణయం వారాల వ్యవధిలోనే ఉంటుందన్న తీరులో ప్రణబ్ వ్యవహరించాని ఆయన చెప్పారు. అదే సమయంలో రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించడమా? లేక తెలంగాణ ఇచ్చే పక్షంలో రాయల్ తెలంగాణ ఏర్పాటు చేయడమా? అన్న అంశాలపై కనీస ప్రస్తావన రాలేదని తెలిసింది. దీంతో ఈ రెండు అంశాలను కేంద్ర నాయకత్వం దాదాపుగా పక్కన పెట్టేసిన ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. భేటీలో అడిగిన ప్రశ్నల వివరాలు ఇలా ఉన్నాయి. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇస్తే సీమాంవూధలో పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయని ఆయన ప్రతి ఒక్కరినీ అడిగారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు రేపు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే సీమాంవూధలో నెలకొనే అవకాశం ఉందా? అని వాకబు చేశారు.
తెలంగాణ ఏర్పాటు చేసే పక్షంలో వారికి ఉన్న అభ్యంతరాలను సైతం అడిగారు. హైదరాబాద్ అంశం కూడా కీలకమైన ప్రశ్నగా ఉంది. రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్ పరిస్థితి ఏంటి? హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా నిర్దిష్టకాలం పాటు కొనసాగించడానికి ఇరు ప్రాంత ప్రజలకు అభ్యంతరాలు లేనందున సమస్య పరిష్కారానికి ఆ దిశగా పావులు కదుపుదామా? హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేస్తే తెలంగాణ ప్రజల్లో భయాందోళనలను ఎంత మేరకు తొలగించగలం? సీమాంధ్ర ప్రజల్లోని వ్యామోహాన్ని ఎంత మేరకు కాపాడగలం? అనే ప్రశ్నలు సంధించారు. తెలంగాణలో ఉధృతంగా కొనసాగుతున్న సమ్మె విరమణకు సూచనలు కోరారు. అదే సమయంలో రాష్ట్ర విభజన వల్ల పార్టీపై పడే ప్రభావం కూడా చర్చకు వచ్చింది. రాష్ట్రాన్ని విభజిస్తే పార్టీ భవిష్యత్తు ఏంటి? రాష్ట్రం ఇచ్చే పక్షంలో ఎవవరు రాజీనామాలు చేస్తారు? ఇవ్వక పోతే తెలంగాణలో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది? వంటి ప్రశ్నలను కురిపించి రాష్ట్ర నాయకత్వం నుంచి నిర్దిష్టమైన సమాచారాన్ని రాబట్టారు. అయితే.. రాష్ట్రంలో సుదీర్ఘంగా కొనసాగుతున్న అనిశ్చితి వల్ల ఇరు ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందని చెప్పిన రాష్ట్ర నాయకులు, కేంద్ర మంత్రులు తెలంగాణ సమస్యను సత్వరమే తేల్చడమే మేలని అభివూపాయపడ్డారు.
సమస్యపై నిర్ణయం కూడా శాశ్వత పరిష్కారం దిశగా ఉండాలని సూచించారు. రాజధానిపై ఒకరిద్దరు అభ్యంతరాలు వ్యక్తపరిచినప్పటికీ రాష్ట్ర విభజనకే అందరూ మొగ్గు చూపారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి కోర్‌కమిటీ సభ్యులతో మాట్లాడుతూ టీ కాంగ్రెస్ నేతల వల్లే సమస్య తీవ్రంగా ఉందని, వారిని కేంద్రమే అదుపు చేయాలని కోరినట్లు తెలిసింది.
ఆ తర్వాతి పరిస్థితులకు తాను ఎదుర్కొగలనని చెప్పినట్లు తెలిసింది. ఉద్యోగుల సమ్మెను మరికొంత కాలం కొనసాగించలేరని, వారితో సంప్రదింపులు జరుపుతానని తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రం కలిసుం మెరుగ్గా ఉంటుందన్నది పురందేశ్వరి, కిషోర్ చంద్రదేవ్ వాదనలుగా చెబుతున్నారు. కాగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాత్రం వాస్తవ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారని, ప్రస్తుత ప్రభుత్వం సమస్యను సరిగ్గా డీల్ చేయలేకపోయిందని వెల్లడించారని సమాచారం. జైపాల్‌డ్డి, డీ శ్రీనివాస్‌లు తెలంగాణ కోసం పట్టుబట్టినట్లు సమాచారం. మొత్తంగా ఇరు ప్రాంతాలకు అమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవడం వల్ల పార్టీని ఇరు ప్రాంతాల్లో బలోపేతం చేసుకోవచ్చని రాష్ట్ర నేతలు అభివూపాయపడ్డారు. దానికి కోర్ కమిటీ సానుకూలంగా స్పందించింది.
అవును... కాదు...
కోర్ కమిటీ సభ్యులు నేతల అభివూపాయాలను నివేదిక రూపంలో కాకుండా వారిచ్చిన జవాబులను బట్టి ‘అవును’, ‘కాదు’ అని టిక్ చేసుకున్నారు. అలాగేతే సులభంగా క్రోడీకరించి సోనియాకు, ప్రధానికి నివేదించవచ్చని వారు ఆ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి చర్చలను కూడా ఇది సులభతరం చేస్తుందని భావించడంవల్లే కోర్‌కమిటీ నేతలు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిసింది. శనివారం రాత్రికే నివేదికను సోనియాకు అందించి, ఆమె అభివూపాయాలు తీసుకున్న తర్వాత వాటికి అనుగుణంగా సోమవారం నాడు చర్చలు కొనసాగించనున్నారు.
శనివారం చర్చలు ముగించిన అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆజాద్... తదుపరి చర్చలు సోమవారం కొనసాగుతాయని వెల్లడించారు. సోమవారం నాడు సీమాంవూధకు చెందిన సీనియర్ ఎంపీ కావూరి సాంబశివరావు, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి, పలువురు స్టాండింగ్ కమిటీ చైర్మన్లతో పాటు పలువురు సీనియర్ నాయకులకు ఢిల్లీ రావాల్సిందిగా ఆదేశాలు వెళ్లాయి. కాగా.. తమ చర్చల ప్రక్రియ సోమవారంతో ముగియనుందని ప్రణబ్ చెప్పడం విశేషం.
సోమవారం వైఖరి
ప్రణబ్ చెప్పిన ప్రకారం సోమవారంతో చర్చల ప్రక్రియ ముగిస్తే.. ఇక మిగిలేది తెలంగాణపై కాంగ్రెస్ వైఖరిని వెల్లడించడమే! అయితే.. వైఖరిని సోమవారం వెల్లడిస్తారా? లేక జాతీయ పార్టీల నేతలతో కూడా చర్చిస్తామని ముందుగా చెప్పినట్లు చర్చల ప్రక్రియను విస్తరిస్తారా? అన్నది తేలాల్సి ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. కోర్‌కమిటీలో అహ్మద్ పటేల్ కాకుండా మిగిలిన వారందరూ కేంద్ర మంత్రులే కావడంతో చర్చలను ఇతర పార్టీలకు కూడా విస్తరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలంటున్నాయి.
రాష్ట్రానికి నేతల తిరుగు పయనం
తమ అభివూపాయాలను వ్యక్తం చేసిన పార్టీ, ప్రభుత్వ పెద్దలను అత్యవసరంగా రాష్ట్రానికి వెళ్లి సమ్మె విరమణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించడంతో వారంతా శనివారమే హైదరాబాద్ బయలుదేరారు. సమ్మె విరమించే దిశగా జేఏసీతో చర్చలు జరపాల్సిందిగా ముఖ్యమంవూతికి సూచించామని ఆజాద్ మీడియాకు తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంవూతితో ప్రణబ్ కాస్తంత ఘాటుగానే వ్యవహరించారని సమాచారం. భేటీ తర్వాత బయటికి వస్తూ రాజనర్సింహ నిరుత్సాహంగా కనిపించారు.
జైపాల్‌తో 45 నిమిషాలు భేటీ
కోర్‌కమిటీ నేతలతో మాట్లాడిన కేంద్ర మంత్రి జైపాల్‌డ్డి తెలంగాణవాదనను గట్టిగానే వినిపించారని సమాచారం. తన సహచరులతో సమావేశమై ఆంధ్రవూపదేశ్‌లో పరిస్థితిపై తన అంచనాను వివరించినట్లు తెలిపారు. ‘‘నేను నిర్దిష్టమైన అంచనాను వారికి చెప్పాను. కానీ ఆ వివరాలు మీడియాకు చెప్పలేను’’ అన్నారు. తమ మాటల మధ్య రాష్ట్రపతి పాలన ప్రసక్తి రాలేదని ఆయన తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి సహా పలువురు నేతలు పది ఇరవై నిమిషాల పాటే కోర్‌కమిటీ ముందు హాజరు కాగా.. జైపాల్ రెడ్డితో మాత్రం కోర్‌కమిటీ సభ్యులు 45 నిమిషాల పాటు చర్చించడం విశేషం.
ఓ దశలో కేంద్రం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు ప్రయత్నిస్తున్నదంటూ చానళ్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. కానీ.. ఆజాద్, ప్రణబ్‌తోపాటు కోర్‌కమిటీ ముందు హాజరైన పలువురు నేతలు సైతం ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. అదే సమయంలో సీఎంను మార్చేందుకు ప్రయత్నం జరుగుతున్నదన్న వాదన కూడా వినిపించింది. కొత్తముఖ్యమంత్రి రేసులో జైపాల్‌డ్డి, రాజనర్సింహ, పురందేశ్వరి ఉన్నారని వదంతులు వచ్చాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన జైపాల్‌డ్డి ఈ రేసులో అగ్రస్థానంలో ఉన్నారని ప్రచారం జరిగింది. జైపాల్‌డ్డి సీఎం అయితే తెలంగాణ ప్రజలు కాస్త మెత్తబడతారని అధిష్ఠానం భావిస్తున్నదని విశ్లేషణలు వెలువడ్డాయి.
Take by: Namaste Telangana (NT)
0 comments:
Post a Comment