సింధ్‌లో ఒక తెలంగాణ కల ---- తెలంగాణ ముద్దుబిడ్డల పోరాటం
తెలంగాణ ముద్దుబిడ్డల పోరాటం, ఆరాటం మాతృభూమి విముక్తి కోసమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సకల జాతుల విముక్తి కోసం. ఈ వీర పుత్రులలో అగ్రక్షిశేణి ఉ ద్యమకారుడు, చే గువేరా, భగత్ సింగ్‌ల సరసన చేర్చదగిన వాడు, తెలంగాణ సాయుధ పోరాట జ్వాలను ‘సింధూ లోయ’కు కొంచబోయిన రైతాంగ పోరాట యోధుడు హసన్ నాసిర్ ఒకరు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, మఖ్దూం సహచరుడు రాజ్ బహదూర్ గౌర్ తన ‘రాండమ్ రైటింగ్స్’ పుస్తకంలో- హసన్ నాసిర్ గురించి రాసిన వ్యాసమిది. ఉమ్మడి రాష్ట్రంలో విస్మృతికి గురైన తమ చరిత్ర పుటలను తెలంగాణ జనం తెరిచి చదువుకుంటున్న సందర్భంలో నాసిర్ జీవిత విశేషాలను
అందిస్తున్నాం. - ఎడిటర్
సన్ నాసిర్ హైదరాబాద్‌లోని జాతీయ భావాలు గల కుటుంబంలో 1928 ఆగస్టు 2వ తేదీన జన్మించాడు. సెయింట్‌జ్జాస్ గ్రామర్ స్కూళ్లో చదువుకున్నాడు. ఆ తరువాత కేంబ్రిడ్జిలో, హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో, అలీగఢ్‌లో ఆయన ఉన్నత విద్యాభ్యాసం సాగింది.
1940 దశకంలోని హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్‌లో కార్యకర్తగా ఉన్నా రు. 1946 మార్చిలో ఐఎన్‌ఎ యోధులను విడుదల చేయాలంటూ సాగిన విద్యా ర్థి ఉద్యమంలో ముందు భాగాన నిల్చాడు. అదే సంవత్సరం సెప్టెంబర్‌లో సూర్యాపేట పిల్లలపై అణచివేతకు నిరసనగా విద్యార్థుల సమ్మెలో పాల్గొన్నాడు.
1946 కల్లా తెలంగాణలో రైతు ఉద్యమం తీవ్రమవుతున్నది. జూలై 4న కడ మొదటి కమ్యూనిస్టు అమరుడు కొమురయ్య నేలకొరిగాడు.
ప్రజాస్వామ్యం కోసం, భూమి కోసం, స్వాతంత్య్రం కోసం పెల్లుబుకుతున్న ఈ ఉద్య మం సున్నితమైన స్పృహ గల యువ నాసిర్‌పై గట్టి ముద్ర వేసింది. తిరుగుబాటుతత్వం, దేశభక్తి ఆయన కుటుంబ సంప్రదాయంగా ఉండేది. ఆయన పెంపకం కూడా అటువంటిదే. పాలక వర్గంలోని కుటుంబాలతో ఉన్న సాన్నిహిత్యం వల్ల పతనమవుతున్న ఫ్యూడల్ వ్యవస్థపట్ల ఆయనకు మంచి అవగాహన ఉంది. దీనివల్ల సామ్యవాద
భావాలు నాటుకొని విప్లవోద్యమంలోకి వెళ్లడానికి ఆస్కారం ఏర్పడింది.
1947లో హైదరాబాద్‌లో జాతీయ ప్రజాస్వామిక ఉద్యమం భారీ ఎత్తున పెల్లుబుకింది. అప్పుడు భారత్ పాక్షిక స్వతంత్ర, పాక్షిక బానిస
దేశం. ఇక హైదరాబాద్ స్వేచ్ఛా భారతంలోని వ్యూహాత్మక బానిస ప్రదేశం. స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంటనే పోరాటం ప్రారంభించాలని కోరుతూ 1947 జూలై 31న 25,000 మంది విద్యార్థులు భారీ ప్రదర్శన జరిపారు. దీనికి నాయకత్వం వహించినవారిలో నాసిర్ ఒకరు. 1947 ఆగస్టు సెప్టెంబర్‌లలో భారీ ఎత్తున విద్యార్థి ప్రదర్శనలు, సమ్మెలు సాగాయి. 1947 సెప్టెంబర్ 29న భారత, హైదరాబాద్
ప్రభుత్వాల మధ్య సిగ్గులేకుండా యథాతథ ఒప్పందం జరిగింది. అప్పటికే తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైంది. భూమికోసం, స్వాతంత్య్రం కోసం, ప్రజాస్వామ్యం కోసం విప్లవోద్యమం ఉవ్వెత్తున సాగుతున్నది. ఈ పరిస్థితులతో ప్రభావితమైన నాసిర్ 1947 డిసెంబర్‌లో పాకిస్థాన్ వెళ్లిపోయాడు.
1947 డిసెంబర్ 19న బొంబాయి నుంచి వెళ్లే ముందు తల్లికి రాసిన ఉత్తరంలో నేను తీసుకున్న నిర్ణయం (పాకిస్థాన్ వెళ్లడం) పరిణామం ఎట్లుందో తెలిసే వయసే నాది అని పేర్కొన్నాడు.సామ్రాజ్యవాదులు, తిరోగమనవాదులు భారత పాకిస్థాన్‌ల మధ్య వైషమ్యా న్ని, శత్రుభావాన్ని పాదుకొల్పారు. సామాన్య ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, సామ్యవాదులు మాత్రమే ఈ అగాథాన్ని పూడ్చి స్నేహం పెంచగలరని ఆయన రాశారు. అదీ ఆయన నిబద్ధత. ఆ విధంగా ఒక కార్యసాధన కోసం ఆయన పాకిస్థాన్ వెళ్లాడు. విప్లవోద్యమాన్ని, సామ్యవాద పార్టీని నిర్మించడానికి వెళ్లాడు. పోవడంతోనే సింధ్‌లోని భూమి కోసం పోరాడుతున్న నిరుపేద రైతులతో మమేకమయ్యారు. వీరోచిత తెలంగాణ బిడ్డనని, మఖ్దుం శిష్యుడినని, సింధ్‌లో ఒక‘తెలంగాణ’ను నిర్మించడమే తన కోరిక అని చెప్పుకునేవాడు. అదీ ఆయన స్ఫూర్తి. ఆయన దృక్పథం.
నాసిర్ సింధ్‌లోని భూమిలేని రైతులకు నాయకుడయ్యాడు... కార్మికులకు నాయకుడయ్యాడు... కరాచీలోని-షిప్‌యార్డ్ కార్మికులకు, చమురు గని కార్మికులకు, జౌళి కార్మికులకు నాయకుడయ్యాడు. నాసిర్ కరాచీలోని కమ్యూనిస్టు పార్టీ కి నాయకుడయ్యాడు. క్రమంగా
పాకిస్థాన్ కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీకి ఎన్నికయ్యాడు. పాకిస్థాన్‌లోని పాలకవర్గాలు- సామ్రాజ్యవాదులు మిలాఖత్ అయిన బూర్జువాలు, ఫ్యూడల్ వర్గాలు, సైన్యం బ్యూరోక్షికాట్లు ఈ కమ్యూనిస్టు ఉద్యమా న్ని సహించలేకపోయాయి. కమ్యూనిస్టులపై అణచివేత సాగింది. నాసిర్ నాలుగేళ్లు జైలు జీవితం అనుభవించాడు. లాహోర్ ఫోర్టు జైలు నుంచి హైదరాబాద్‌లోని తన తమ్ముడు ముంతాజ్‌కు రాసిన లేఖలో-‘ ముంతాజ్, నా జీవితంలో నెరవేర్చవలసిన కర్తవ్యం ఒకటి ఉన్నది. ప్రయాణం ఆ వైపుగనే సాగుతున్నది’. అని పేర్కొన్నాడు. మళ్లీ 1953 జూన్ 6న కరాచీ జైలు నుంచి తన తల్లికి రాసిన లేఖలో -‘ నా జీవితంలో నేనో మార్గాన్ని ఎంచుకున్నాను. నా యిష్టంగానే ఈ మార్గం చేపట్టాను. ఒక ఐదేళ్లు వెనక్కి అవకాశం లభించినా మళ్లీ ఇదేమార్గంలో జీవిస్తాను.’ అని తన దృఢకాంక్షను వెల్లడించాడు. ఇదీ హసన్ నాసిర్
అంటే...1958 నాటికి నాసిర్ మళ్లీ కార్మికవర్గంతో, అభ్యుదయవాదులతో చేరిపోయాడు. 1960లో, అయూబ్‌ఖాన్ హయాంలో, ఆయనను మళ్లీ అరెస్టు చేశారు.
జైళ్లో చిత్రహింసలు పెట్టారు. దీంతో 1960 నవంబర్ 13న నాసిర్ జైళ్లోనే కన్నుమూశాడు. నాసిర్ మరణానంతరం వ్యవహరించిన తీరుతోఅయూబ్‌ఖాన్ ప్రభు త్వ పాశవికత మరోసారి వెల్లడైంది. నాసిర్ మరణానికి కారణం తెలుసుకోవడం కోసం ఆయన తల్లి సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పరిశీలించాలని కోర్టు ఆదేశించింది. దీంతో పాలక ముఠా రాత్రికి రాత్రే సమాధి నుంచి ఆయన మృతదేహాన్ని బయటికి తీసి ఆ స్థానంలో మరో మృతదేహాన్ని పెట్టింది. ఆ మృతదేహం పొడుగు వెంట్రుకలు, గోళ్లు తదితర లక్షణాలను పరిశీలించిన తల్లి మేడమ్ జహ్రాఅలం బర్దార్ అది తన కుమారుడి మృతదేహం కాదని తేల్చి చెప్పింది. ఆ తరువాత భారత దేశం తిరిగివచ్చింది.
మహత్తర తెలంగాణ నుంచి విప్లవ సందేశాన్ని తీసుకుపోయిన ఆ వీరుడి జీవితం ఈ విధంగా ముగిసింది. కానీ-నాసిర్ బతికే ఉన్నాడు. అణగారిన ప్రజల కోసం బలిదానం చేసిన మహానుభావుల పరంపరలో, ఒడిదొడుకులను అధిగమిస్తూ స్థిరంగా పురోగమిస్తున్న పాకిస్థాన్ సామ్యవాద ఉద్యమ చరివూతలో ఆయన సజీవంగా ఉన్నాడు. విప్లవ సందేశంలో నాసిర్ జీవిస్తూనే ఉంటాడు.

-డాక్టర్ రాజ్‌బహదూర్ గౌర్
Take By: Namaste Telangana(NT)
0 comments:
Post a Comment