స్కాలర్ ‘షిప్’ ముంచేశారు!
- అందాల్సిన దరఖాస్తులు 13 లక్షలు
- ఇప్పటివరకు అందినవి 5 లక్షలే!
- బ్యాంక్ అకౌంట్లు రానివారు 4 లక్షలు
- సర్టిఫికెట్లు, అకౌంట్ల అటాచ్‌తోనే తంటా!
- సవాలక్ష ఆప్షన్లు.. సతాయిస్తున్న ఈ-పాస్ సర్వర్
- నేటితో గడువు పూర్తి.. ఆందోళనలో విద్యార్థులు
- గడువు పెంచకుంటే ఏడున్నర లక్షల మందికి నష్టం
- ఇప్పటివరకు అందినవి 5 లక్షలే!
- బ్యాంక్ అకౌంట్లు రానివారు 4 లక్షలు
- సర్టిఫికెట్లు, అకౌంట్ల అటాచ్‌తోనే తంటా!
- సవాలక్ష ఆప్షన్లు.. సతాయిస్తున్న ఈ-పాస్ సర్వర్
- నేటితో గడువు పూర్తి.. ఆందోళనలో విద్యార్థులు
- గడువు పెంచకుంటే ఏడున్నర లక్షల మందికి నష్టం
స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి చదువుతున్న పేద, మధ్య తరగతి విద్యార్థులు రాష్ట్ర సర్కారు పన్నిన ‘ఆన్‌లైన్ దిగ్బంధం’లో చిక్కుకొని గిలగిల కొట్టుకుంటున్నారు. సవాలక్ష నిబంధనలు, షరతులు విధించి.. ఎన్నో ఆంక్షలు పెట్టడంతో ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవడంలో విద్యార్థులు నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. బ్యాంకు అకౌంట్లు తీసి, అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు సాధించి.. ఇంట్నట్‌లో దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. గ్రామీణ విద్యార్థుల సంగతి సరేసరి. ఏ సదుపాయం అందుబాటులో లేని వారు స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఏటికి ఎదురీదటాన్ని తలపిస్తోంది. దీంతో గడువు ముగుస్తున్నా ఇప్పటివరకు అర్హులైన విద్యార్థుల్లో సగం కూడా స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోలేకపోయారు. మొత్తం 13 లక్షల మంది విద్యార్థులలో 5లక్షల మంది స్కాలర్‌షిప్ దరఖాస్తులు అందాయి.
బుధవారం దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు. దీంతో దరఖాస్తు చేసుకోలేకపోయిన గ్రామీణ, పేద విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులు జీరో బ్యాలెన్స్ ఖాతాలు ఇవ్వడంలో జాప్యం చేయడం వల్లే, తాము దరఖాస్తు చేసుకోలేకపోయామని, గడువును మరో 15 రోజులు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. అలా జరగకపోతే.. ఏడున్నర లక్షల మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌లకు దూరమయ్యే ప్రమాదం పొంచివుంది.
హైదరాబాద్ నవంబర్ 29 ():రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకునే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తీరు నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. కొత్త దరఖాస్తులు స్వీకరించే విషయంలో ఈ పాస్ వెబ్‌సైట్‌లో పెట్టిన విపరీతమై అప్షన్లు బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం 865 కరువు మండలాలను ప్రకటించి రైతులపై సానుభూతి ప్రదర్శిస్తున్నట్లు చెప్పుకుంటూనే.. మరోవైపు అన్నదాతల పిల్లల చదువులకు చేదోడువాదోడుగా ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కట్టడి చేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి స్కాలర్‌షిప్ మొత్తాలను తగ్గించుకునేందుకు ప్రయత్నంచిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా స్కాలర్‌షిప్ దరఖాస్తులపై ఆంక్షలు విధించి తక్కువ దరఖాస్తులు వచ్చేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది.
సంక్షేమ రంగానికి కేటాయించే నిధుల్లో భారీగా కోతలు విధించి.. పరోక్షంగా చర్యలు తీసుకుంటూ పేద విద్యార్థులను దొంగదెబ్బ తీస్తోంది. ఇప్పటికే ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో అనేక మార్పులు చేసింది. కోర్సుల ఫీజులను తగ్గించడం, సర్టిఫికెట్ల కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తేయడం వంటి చర్యలకు దిగిన సర్కారు బడుగు, బలహీనవర్గాల విద్యార్థులనూ వదిలిపెట్టడం లేదు. వారిని ఉన్నత చదువులకు దూరం చేసేలా అనేక షరతులు విధిస్తోంది. గతేడాది వరకు లేని ఆప్షన్లను ఈ ఏడాది ఈపాస్ వెబ్‌సైట్‌లో ప్రవేశపెట్టి విద్యార్థులను నానా అగచాట్లకు గురిచేస్తోంది. బ్యాంకు అకౌంట్లు రాకపోవడం, బ్యాంకర్లు జీరో బ్యాలెన్సు అకౌంట్లు ఇవ్వడానికి ససేమిరా అనడం, గ్రామీణ ప్రాంతాల్లో ఇంట్నట్ సదుపాయం అందుబాటులో ఉండకపోవడం, కుల, ఆర్థిక ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వడంలో ఎక్కడలేని జాప్యం జరగడంతోపాటు ఇవన్నీ సమకూరినా దరఖాస్తు చేసుకుందామంటే, అన్నీ ఉన్నా అల్లుడి నోట్ల శని అన్న చందంగా సర్వర్ డౌన్ కావడంతో విద్యార్థులు లెక్కలేనన్ని కష్టాలు పడుతున్నారు.
దీంతో 2011-12 విద్యా సంవత్సరానికి గాను 13 లక్షల మంది విద్యార్థులు స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా.. ఇప్పటివరకు కేవలం 5.35 లక్షల మందే దరఖాస్తు చేసుకున్నారు. స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు గడువు బుధవారం ముగుస్తోంది. దీంతో ఇటు విద్యార్థుల్లో, అటు అధికారుల్లో ఆందోళన కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గడువు పొడిగించకుంటే దాదాపు ఏడున్నర లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది.
బ్యాంకు ఖాతాలతోనే తంటా
గతంలో కాలేజీలకే నేరుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు వేళ్లేవి. దీంతో జరుగుతున్న అవకతవకలను అరిక ఈపాస్ వెబ్‌సైట్‌లో మార్పులు చేశారు. ఇవి విద్యార్థులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. మరోవైపు దరఖాస్తులు రావాల్సిన దానికంటే చాలా తక్కువ రావడంతో అధికారులూ ఆందోళన చెందుతున్నారు. లోపం ఎక్కడుందనేదానిపై ఆరా తీస్తున్నారు. గతంలో ‘నమస్తే తెలంగాణ’లో స్కాలర్‌షిప్‌లకు అకౌంట్ దెబ్బ పేరుతో ప్రచురితమైన వార్తకు ఇటీవల సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రేమాండ్ పీటర్ స్పందిస్తూ జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఇప్పించాలని కలెక్టర్లకు లేఖ కూడా రాశారు. జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఇప్పించాలని ఇటీవల కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లినా జిల్లాల్లో బ్యాంకర్ల నుంచి సరైన స్పందన కరువైందని అధికారులే చెబుతున్నారు.
కనీసం రూ. 500 నుంచి వెయ్యి రూపాయల డిపాజిట్ చేస్తేనే బ్యాంకులు ఖాతాలు తెరిచేందుకు బ్యాంకులు ఒప్పుకుంటున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని షెడ్యూల్డ్ బ్యాంకుల్లో ఒక్కసారిగా 13 లక్షల అకౌంట్లు కొత్తగా తెరవాల్సి రావడంతో ఇది బ్యాంకు అధికారులకు కత్తిమీద సాములా తయారైంది. కట్టలుకట్టలుగా అకౌంట్ల కోసం దరఖాస్తులు వస్తుండటంతో చేసేదేం లేక వారం నుంచి పది రోజుల వరకు షెడ్యూల్ బ్యాంక్‌లు సమయం తీసుకుంటున్నాయి. దాదాపు నాలుగు లక్షల దరఖాస్తులు బ్యాంకు అకౌంట్ నెంబర్ లేకపోవడం వల్లే ఆగిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కలెక్టర్లకు లేఖ రాసిన నేపథ్యంలో విద్యార్థులకు జీరో బ్యాలెన్స్ అకౌంట్లు వచ్చేలా చూసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఈ ప్రయత్నం గతంలోనే చేసి ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదని విద్యార్థులంటున్నారు.
జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇప్పించే విషయంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే సమస్య ఇంతవరకు వచ్చిందని తెలుస్తోంది. దరఖాస్తుల స్వీకరణ సమయంలోనే ఈ విషయమై కలెక్టర్లకు లేఖలు రాసి ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదని భావిస్తున్నారు. మరోవైపు రాష్ర్టవ్యాప్తంగా కుల, ఆర్థిక ధ్రువీకరణ సర్టిఫికెట్లతోపాటు, పదో తరగతి వివరాలను కూడా ఆన్‌లైన్‌లోనే నింపాల్సి ఉండటంతో ఏ చిన్న తప్పు దొర్లినా దరఖాస్తును మళ్లీ మొదటి నుంచి నింపాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అదే సమయంలో ధ్రువీకరణ పత్రాలతో పాటు, పదో తరగతి మెమో, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఇతర పత్రాలు కూడా ఆన్‌లైన్‌లోనే అటాచ్ చేయాల్సి ఉండటంతో దరఖాస్తులు ఓకే అవ్వడానికి సమయం పడుతోందని విద్యార్థులంటున్నారు. కొత్తగా ఏర్పాటైన ఇంటర్మీడియట్ కాలేజీల విద్యార్థులకు మరో చిత్రమైన సమస్య ఎదురవుతోంది. కొత్త కాలేజీల పేర్లు ఆన్‌లైన్‌లో కనిపించకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వీరు నేరుగా దరఖాస్తులు కాలేజీల్లో అందజేస్తున్నట్లు సమచారం. అక్కడి నుంచి దరఖాస్తులు పీడీ కార్యాలయానికి వస్తాయని అధికారులంటున్నారు. ఈ సమస్యల నేపథ్యంలో అర్హులైన విద్యార్థులకు న్యాయం చేసేందుకు మరో 15 రోజుల గడువు పెంచాలని విద్యార్థులు, వారి తల్లిదంవూడులు కోరుతున్నారు.
ఒక్క దరఖాస్తుకు గంట సమయం
ఈ సమస్యలకు తోడు గత మూడు రోజుల నుంచి దరఖాస్తులు స్వీకరించే ఈపాస్ వెబ్‌సైట్ సర్వర్ బాగా నెమ్మదించినట్లు సమాచారం. జిల్లాల నుంచి దరఖాస్తులు పంపడానికి గంటల తరబడి సమయం తీసుకుంటోందని విద్యార్థులంటున్నారు. మధ్యాహ్నం సమయంలోనైతే ఒక్క దరఖాస్తును నింపడానికి గంటలకు పైగా సమయం తీసుకుంటున్నట్లు సమాచారం. మూడురోజుల నుంచీ మరీ ఎక్కువ సమయం తీసుకుంటోందని చెబుతున్నారు. గడువు దగ్గరపడుతున్న కొద్దీ జిల్లాల నుంచి ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించే వారి సంఖ్య వేలల్లో పెరుగుతోందని, ఇందువల్లే సర్వర్ డౌన్ అవుతుందని అధికారులంటున్నారు. ఇంట్నట్ గంటల తరబడి కూర్చోవడం వల్ల తమకు డబ్బులు కూడా అదనంగా ఖర్చువుతోందని విద్యార్థులు వాపోతున్నారు.
Take By: T News
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News, Scholarship, AP Scholarship
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News, Scholarship, AP Scholarship
0 comments:
Post a Comment