అవిశ్వాసం అగ్నిపరీక్ష!
- రసకందాయంలో రాజకీయం
- వేగంగా కదులుతున్న పావులు
- జగన్, టీఆర్‌ఎస్ అంచనా ఫలిస్తే కాంగ్రెస్ సర్కారుకు గండమే!
- కలకలం రేపిన చిరు కోపం
- నచ్చజెప్పిన బొత్స, ఆజాద్
- పార్టీల్లో మొదలైన విప్‌ల జారీ
- ఉల్లంఘనకు సిద్ధమన్న జగన్ బ్యాచ్
- నిలబడేది ఎందరో అనుమానమే!
- జగన్ వర్గంపై కాంగ్రెస్ నేతల వల
- ప్లేటు ఫిరాయించిన కుంజా సత్యవతి
- మరికొందరూ అదే బాటలో!
- తిరుగుబాటు ఎమ్మెల్యేలకూ టీడీపీ విప్
- ముగ్గురు వచ్చేస్తున్నారంటూ లీకులు
- కొట్టిపారేసిన వేణుగోపాలచారి
- తెలంగాణవాదంపై టీఆర్‌ఎస్ నమ్మకం
(హైదరాబాద్):ఇంకా స్పష్టత రాని రాజకీయ లెక్కలు కిరణ్ సర్కారును కూల్చేస్తాయా? జగన్ మంతనాలు ఏ మేరకు ఫలిస్తాయి? చిరంజీవి అసంతృప్తి టీ కప్పులో తుఫానేనా? తెలంగాణవాదులందరూ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కేసీఆర్ పిలుపు ప్రభావమేంటి? అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందా? ప్రభుత్వాన్ని కాపాడుకునే యత్నంలో కాంగ్రెస్ సఫలీకృతమవుతుందా?
ఏం జరుగుతుందో అర్థంకాని సంక్లిష్ట రాజకీయ పరిస్థితిని రాష్ట్రం ఎదుర్కొంటోంది! టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ శనివారం పచ్చ జెండా ఊపారు. దీంతో చర్చకు ముందే పార్టీలకు అగ్ని పరీక్ష మొదలైంది! అవిశ్వాసానికి బరి సిద్ధమైనా.. బలగాలు ఇంకా తేలలేదు! దాదాపు అన్ని పార్టీల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులాఉంది. కాంగ్రెస్, టీడీపీ, జగన్ వర్గం తమ వద్ద ఇంత మంది సభ్యులు ఉన్నారని నిర్దిష్టంగా చెప్పుకోలేని పరిస్థితి! పీఆర్పీ ఏ నిర్ణయం తీసుకుంటుందో సస్పెన్సే! దీంతో ఎవరికివారు తమ బలాన్ని కాపాడుకునేందుకు విశ్వవూపయత్నాలు చేస్తున్నారు. విప్‌ల జారీలో తలమునకలై ఉన్నారు!!
అవిశ్వాస తీర్మానంపై చర్చకు టీడీపీ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర శాసనసభ స్వీకరించింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదనకు 76 మంది సభ్యులు మద్దతు పలకడంతో తీర్మానాన్ని చర్చకు స్వీకరిస్తున్నట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ శనివారం ప్రకటించారు. అనంతరం శాసనసభ వ్యవహారాల సంఘం సమావేశం ఏర్పాటు చేసి, ఆది, సోమవారాల్లో ఈ తీర్మానంపై చర్చ జరపాలని తీర్మానించారు. అయితే, కరువుపై చర్చ జరగాల్సి ఉన్నందున ఆ చర్చ ముగిసిన తర్వాతనే అవిశ్వాసంపై చర్చ మొదలవుతుంది. అవిశ్వాసంపై చర్చకు ముందే అసెంబ్లీలో, వెలుపల పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీలో ఆయా పార్టీల బలాబలాలు ఎలా ఉన్నప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు నాయకత్వాల పట్ల నిరసనగా వైఖరి మార్చుకుంటుంటడంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. కిరణ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడే కాపాడుతున్నాడని ఒకవైపు జగన్ విమర్శిస్తుంటే కాంగ్రెస్‌తో జగన్ మిలాఖత్ అయ్యారని టీడీపీ ఆరోపిస్తోంది. మరో వైపు, కాంగ్రెస్, టీడీపీలు కలిసి నాటకం ఆడుతున్నాయని టీఆర్‌ఎస్ ధ్వజమెత్తుతోంది. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం అసెంబ్లీ ముందుకు రానుండటంతో పరిస్థితి ఉత్కం రేకెత్తిస్తోంది.
జగన్ వర్గానికి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు శనివారం తమ పార్టీ అధినేతతో సమావేశమయ్యారు. నిన్నటిదాకా ఫోన్‌లలో వ్యవహారం నడిపిన జగన్.. అది సరిపోక పోవడంతో ఓదార్పు యాత్రను పక్కనపె నేరుగా రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలను పిలిచి ‘నిర్మొహమాటంగా’ మాట్లాడారు. వీరితో పాటు మరో పది మంది ఎమ్మెల్యేలు తమతో కలిసి వస్తారని జగన్ వర్గం ధీమా వ్యక్తం చేస్తున్నది. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన పిల్లి సుభాష్ చంద్రబోస్.. తాము అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయనున్నట్లు ప్రకటించారు. తమ నాయకుడు చెప్పిన మాటను పాటిస్తామని తెలిపారు. ఇప్పుడు తనకు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలకు తోడు కాంగ్రెస్ నుంచి మరోఏడుగురు కలిసి వస్తే ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో పడుతుందని జగన్ వర్గం భావిస్తోంది. జగన్ వర్గంలో పెరుగుతున్న సంఖ్య లేదా, తగ్గిన సంఖ్య అధికార పార్టీపై నేరుగా ప్రభావం చూపనున్నది. కాంగ్రెస్ నేతలు ఈ ప్రమాదాన్ని పసిగట్టి పునరాకర్ష పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేస్తూ జగన్ కూటమిని బలహీన పర్చేందుకు పావులు కదుపుతున్నారు. దఫదఫాలుగా వీరిలో కొందరితో మంతనాలు జరిపారు. ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి తాను కాంగ్రెస్ పక్షమేనన్నారు. వైఎస్ కష్టార్జితమే ఈ ప్రభుత్వమన్న ఆమె.. అది కూలిపోవడం తనకు ఇష్టం లేదన్నారు. సత్యవతి బాటలోనే మరికొందరు ఉంటారని తెలుస్తోంది. జగన్ వర్గం నుంచి కొంత మంది ఎమ్మెల్యేలను ప్రభుత్వానికి రక్షణగా తెచ్చేందుకు సఫలమయ్యామని కాంగ్రెస్ నేతలు కుదుట పడుతున్న తరుణంలో చిరంజీవి రూపంలో కొత్త చిక్కు కాంగ్రెస్‌కు ఎదురైంది. విలీనం సందర్భంగా ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికీ నోరు మెదపని నేపథ్యంలో పీఆర్పీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తమను గడ్డిపోచల్లా చూస్తున్నారని మండిపడ్డారు. అవిశ్వాసంపై పునరాలోచన చేస్తామని బెదిరించారు. తమ నాయకుడు చిరంజీవిని శాసనసభాపక్ష కార్యాలయానికి పిలుచుకొచ్చి తమ ఆవేదనను వెళ్లగక్కారు. సమావేశం తర్వాత చిరంజీవి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ మద్దతుపైనే మనుగడ సాగిస్తోందన్న చిరంజీవి.. తమ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు ధీమాతో ఉన్న కాంగ్రెస్‌కు చిరంజీవి వ్యాఖ్యలు కలవరం కలిగించాయి. హుటాహుటిన పార్టీ పెద్దలు అందరూ రంగంలోకి దిగారు. చిరంజీవితో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కూడా ఆరా తీశారు.
అందరూ కలిసి విలీనం సందర్భంగా ఇచ్చిన హామీలపై మరోసారి భరోసా ఇచ్చారని తెలిసింది. దీంతో చిరంజీవి మెత్తబడినట్లు సమాచారం. అయితే.. ఆదివారం జరిగే సమావేశంలో పీఆర్పీ ఎమ్మెల్యేలు మరోసారి చర్చలు జరపనున్నారు. ఆ సమయంలోనే విప్‌ల జారీపై నిర్ణయం తీసుకోనున్నారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో తమ సభ్యులకు విప్ జారీ చేసిన టీడీపీ.. తమ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు కే హరీశ్వర్‌డ్డి, ఎస్ వేణుగోపాలచారి, బాలనాడ్డిలకు కూడా వాటిని పంపింది. వీరు ముగ్గురూ తమ పార్టీలోకి తిరిగి వస్తున్నారంటూ మీడియాకు లీకులు వదిలింది. కానీ, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలూ తాము ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలోకి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకుతామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నికరంగా పోరాడేది తాను ఒక్క చెప్పుకోవడంతో పాటు జగన్ వర్గానికి చెక్ పెట్టాలన్న వ్యూహంతోనే టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు ప్రతిపాదించిందని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో టీడీపీ పెడుతున్న అవిశ్వాస తీర్మానం అంతిమంగా కాంగ్రెస్ తన అంతర్గత సమస్యలను పరిష్కరించుకునేందుకు దోహదం చేస్తోందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇన్నాళ్లూ కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న ఎమ్మెల్యేలు.. ఇప్పుడు ఈ వంకతో తిరిగి పార్టీ చెంతకు చేరే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా.. నికరమైన తెలంగాణవాదులుగా నిరూపించుకునేందుకు ఈ ప్రాంత ఎమ్మెల్యేలు అందరూ ప్రత్యేక రాష్ట్ర వ్యతిరేకిఅయిన కిరణ్ సర్కారును కూల్చేయాలని టీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్‌లోని దాదాపు 50 మంది మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఎంత మంది టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునకు స్పందిస్తారన్నది ప్రశ్నార్థకమే. టీఆర్‌ఎస్ చేస్తున్న యత్నాలు ఫలించినా ప్రభుత్వానికి నూకలు చెల్లిన విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణపై కేంద్రం ప్రకటన చేయకపోతే సర్కారును కూలుస్తామని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటిస్తే చాలు కేంద్రం వెంటనే దిగి వస్తుందని తెలంగాణవాదులు అంటున్నారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కూడా చర్చలు చేస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా అవిశ్వాసం తీర్మానంపై పట్టుబట్టడం ద్వారా సభలో తెలంగాణ అంశం చర్చకు రాకుండా చేయాలని, సభను మొత్తం హైజాక్ చేయాలని భావించిన టీడీపీకి టీఆర్‌ఎస్ చెక్ పెట్టింది. తెలంగాణ అంశంపై వరుసగా మూడు రోజులు సభను స్తంభింప జేసింది. మూడవ రోజు సర్కారు వైఖరికి నిరసనగా సభనుంచి బయటకు వచ్చిన తరువాత అవిశ్వాస తీర్మానం నోటీస్‌ను సభ ముందుకు తీసుకువచ్చారు. మరోవైపు అవిశ్వాసానికి మద్దతుగా సీపీఐ, సీపీఎం, బీజేపీ నిలవబోతున్నాయి.

Take By: T News
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News.Assembly
0 comments:
Post a Comment