కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సోయి ఉంటే ప్రభుత్వాన్ని కూల్చేయాలి
- నల్లచట్టాల నల్లారిని దించండి
- నిజమైన తెలంగాణ బిడ్డలుగా నిలవండి
- జై తెలంగాణ అన్నందుకే ‘చెరుకు’పై కేసులు
- నాలుగు కోట్ల మందిని జైల్లో పెడతారా?
- తెలంగాణలోనే ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం
- శ్రీకాంతాచారి విగ్రహావిష్కరణ సభలో కేసీఆర్
- కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ప్రజలు ఒత్తిడి తేవాలి
- అన్ని సంఘాలూ నిరసన తెలపాలి: కోదండరాం
నల్లగొండ, :తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఏ మాత్రం సోయి ఉన్నా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి కిరణ్ సర్కార్‌ను కూల్చేయాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ పట్టణంలోని క్లాక్‌టవర్ సెంటర్‌లో మలివిడత ఉద్యమంలో తొలి అమరుడు కాసో జు శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘తెలంగాణ ప్రజల మనోభావాలను అర్ధం చేసుకుంటే ఈ ప్రాంత ఎమ్మెల్యేలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి నిజమైన తెలంగాణ బిడ్డలుగా నిలబడాలి. ఇప్పుడు మనం పులి మీద స్వారీ చేస్తున్నాం, దిగితే పులి మింగివేస్తుంది. ఉద్యమంపై ఏ మాత్రం వెనకడుగు వేసినా సీమాంధ్ర ప్రభుత్వం మనల్ని దోచుకుంటుంది. ప్రజా వైద్యుడు డాక్టర్ చెరుకు సుధాకర్ జై తెలంగాణ అన్నందుకు పీడీ యాక్టు, నాసా కింద కేసులు నమోదు చేశారు. నల్లచట్టాలు అమలుచేస్తున్న నల్లారి కిరణ్‌కుమార్ సర్కార్‌ను కూల్చేయాల్సిందే. ఓ డాక్టర్‌పై కేసులు పెట్టి జైలుకు పంపిస్తే కాంగ్రెస్ జిల్లా నాయకులు సిగ్గుపడాలి. నాలుగున్నర కోట్ల ప్రజలు జై తెలంగాణ అంటున్నారు, ఎంత మందిని జైల్లో పెడతారో పెట్టండి. 11 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమం ఎప్పుడూ హింసా మార్గంలోకి వెళ్లలేదు. ఇచ్చిన తెలంగాణను అడ్డుకున్న బాధతో కడుపు మండి బస్సులపై రాళ్లు విసిరితే నల్లచట్టాలతో కేసులు పెట్టి సర్కారు వేధిస్తోంది. రాష్ట్రానికి ఎంతమంది ముఖ్యమంవూతులు మారినా జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తీరలేదు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఈ సమస్యకు పరిష్కారం. తెలంగాణ కోసమే జీవితాన్ని ధారపోసిన ప్రొఫెసర్ జయశంకర్ పేరును తెలంగాణలో ఏదో ప్రాజెక్టుకు, రహదారికి పెట్టాలన్న సోయి మన ఎమ్మెల్యేలకు లేదు. సీఎంను చూస్త్తేనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లాగులు తడుస్తున్నాయి. తెలంగాణలో ఏ ప్రాజెక్టుకైనా పేరు పెట్టేందుకు ప్రొఫెసర్ జయశంకర్, శ్రీకాంతాచారి అర్హులు. ప్రజలు సంఘటితమై పోరాడి తెలంగాణ సాధించుకుందాం.’అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సువర్ణ అవకాశం: కోదండరాం
సోమవారం అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేయాలి. ఇది తెగదెంపుల సమరం, చరివూతలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇది సువర్ణావకాశం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతారో, లేక ఆంధ్ర సర్కాకు అండగా నిలుస్తారో తేల్చుకోవాల్సిన సమయమిది. తెలంగాణ తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే అని చెప్పుకున్న నేతలంతా అవిశ్వాసంలో తెలంగాణ పక్షాన నిలబడాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఓటు వేసేలా ఒత్తిడి తెచ్చేందుకు విద్యార్థులు ర్యాలీలు నిర్వహించాలి. జేఏసీ, కులసంఘాలు, తెలంగాణవాదులు ఎవరికి వారే పెద్ద ఎత్తున నిరసన కార్యక్షికమాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలలపై ఒత్తిడి తేవాలి. చరివూతలో కీలకమైన సందర్భంలో మనమంతా ఉద్యమించాలి. శ్రీకాంత్‌చారిలా ఆత్మబలిదానాలు అవసరం లేదు, కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తేచాలు. జీవితంలో తిరిగి రానిది ఒక్క ప్రాణమే, దాన్నే పణంగా పెట్టి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన శ్రీకాంతాచారి ఈ తరానికి ఆదర్శనీయుడు.
బృహన్నల వేషాలు మాని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన ఉండాలని కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ సూచించారు. అవిశ్వాసంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విశ్వవూబాహ్మణ మనుమయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంటోజు వెంకటాచారి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్షికమంలో శ్రీకాంత్‌చారి తల్లిదంవూడులు కాసోజు వెంకటాచారి, శంకరమ్మ, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు నాయిని నర్సింహాడ్డి గుంతకండ్ల జగదీశ్వర్‌డ్డి, కర్నె ప్రభాకర్, నిరంజన్‌డ్డి, రామలక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌డ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి చకిలం అనిల్‌కుమార్‌లు కూసుకుంట్ల ప్రభాకర్‌డ్డి, అనురాధ, గురుచరణం, గొంగిడి సునీత, ఎలిమినేటి కృష్ణాడ్డి, వేముల వీరేషం, గాదరి కిషోర్‌కుమార్, పల్లా ప్రవీణ్‌కుమార్‌డ్డి, మాలె శరణ్యాడ్డి, రేకల భద్రాద్రి, ఫరీదుద్దీన్, బక్క పిచ్చయ్య, అభిమన్యు శ్రీనివాస్, పాకాల వెంక గుంటోజు వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.
Take By: T News
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News, TRS, KCR,
0 comments:
Post a Comment