విరమణా.. వాయిదా ?
‘ప్రభుత్వ హామీతో ఉద్యోగ సంఘాల సహాయ నిరాకరణ విరమణ’
‘పార్లమెంటు సమయంలో తిరిగొచ్చిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్’
‘విద్యార్థుల తలిదండ్రులు మిలియన్ మార్చ్ వాయిదా వేయమని అడుగుతున్నారు. జేఏసీలో చర్చించి నిర్ణయిస్తాం’
‘మే వరకూ కాంగ్రెస్ తెలంగాణపై ఆలోచించే అవకాశం లేనందున సహాయ నిరాకరణను విరమించు కోండంటూ ఉద్యోగ సంఘాల జాక్ నేతలకు కేసీఆర్ సూచన’
- ఈ పరిణామాలు పరిశీలిస్తే.. తెలంగాణ ఉద్యమానికి విరామమా? కొంతకాలం విరమణా అన్న ప్రశ్నలు సహజంగానే తెరపై కొస్తున్నాయి. వ్యూహాత్మకంగా జరిగిపోతున్న పరిణామాలపై తెలంగాణ ఉద్యమ సంస్థలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. నిర్ణయాలు, ప్రకటనలు కొందరికే పరిమితం అవుతున్న వైనం వారిని అసంతృప్తికి గురిచేస్తోంది. పార్లమెంటులో తెలంగాణ వాణి వినిపించిన టీఆర్‌ఎస్ అధ్య క్షుడు కేసీఆర్, ఆ ప్రక్రియను కొనసాగించకుండా హఠాత్తుగా హైదరాబాద్ తిరిగి రావడం చర్చనీయాంశ మయింది. దానికి తోడు.. మే వరకూ తెలంగాణపై కాంగ్రెస్‌లో కదలిక వచ్చే అవకా శం లేదని, స్వయంగా కేసీఆర్ ఉద్యోగ సంఘాల జాక్ నేతలతో ఫోన్‌లో చెప్పిన వైనం అనేక అనుమానాలకు తావిస్తోంది. ‘పార్లమెంటు సమయంలో తిరిగొచ్చిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్’
‘విద్యార్థుల తలిదండ్రులు మిలియన్ మార్చ్ వాయిదా వేయమని అడుగుతున్నారు. జేఏసీలో చర్చించి నిర్ణయిస్తాం’
‘మే వరకూ కాంగ్రెస్ తెలంగాణపై ఆలోచించే అవకాశం లేనందున సహాయ నిరాకరణను విరమించు కోండంటూ ఉద్యోగ సంఘాల జాక్ నేతలకు కేసీఆర్ సూచన’
దీన్నిబట్టి.. తెలంగాణ అంశంపై కేసీఆర్‌కు కాంగ్రెస్ నాయకత్వం నుంచి స్పష్టమైన సంకేతం, సమాచారం వచ్చినట్లు తెలంగాణ ఉద్యమ వర్గాలు భావిస్తున్నాయి. మే వరకూ కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణ అంశాన్ని పక్కకుపెట్టిందన్న అనుమానా లు ఢిల్లీలో జరుగుతున్న తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నం దున అప్పటివరకూ కాంగ్రెస్ నాయకత్వం తెలం గాణ గురించి ఆలోచించే ప్రశ్నే లేదని కాంగ్రెస్ నాయకత్వం తమ పార్టీ ఎంపీలకు ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రణబ్ ముఖర్జీ సైతం తనను కలసిన తెలంగాణ ఎంపీలతో తెలంగాణ అంశం ఇప్పట్లో సమస్య పరిష్కారం కాదని, వచ్చే ఎన్నికల వరకూ ప్రజలకు మీరే ఏదో ఒకటి చెప్పుకోండని స్పష్టం చేశారు. చిదంబరం అయితే తెలంగాణ సమస్య ఒక్క రాత్రికే పరిష్కారం కాదని వ్యాఖ్యనించడం బట్టి కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణపై ఇప్పట్లో దృష్టి సారించే అవకాశం లేదని అర్ధమవుతోందని తెలంగాణ వర్గాలు వివరిస్తున్నాయి.
పార్లమెంటులో తెలంగాణ గురించి డిమాండ్ చేసిన కేసీఆర్, తెలంగాణ ఇచ్చే శక్తి ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సభలోనే ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా ఆమెను విమర్శించకపోవడం ప్రస్తావనార్హం. బీజేపీ సీనియర్లు తనకు తెలంగాణ అంశంలో దన్నుగా నిలిచినప్పటికీ, దానిని వినియోగించుకుని సోనియాపై విరుచుకుపడక పోవడాన్ని తెలంగాణ ఉద్యమ సంఘాల నేతలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్‌ను విమర్శి స్తున్న కేసీఆర్, ఆ పార్టీ అధినేత్రిని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదని, దీనిని బట్టి తెలంగాణపై కాంగ్రెస్ ఆలోచనా ధోరణికి సంబంధించి కేసీఆర్‌కు ఎప్పటికప్పుడు సమాచారం ఉందని స్పష్టమవుతోందంటున్నారు.
ఈ క్రమంలో తెలంగాణ ఉద్యోగుల సహాయ నిరాకరణను విరమించడం చర్చనీయాంశమ యింది. ఇది మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులలో తీవ్ర వ్యతిరేకత, నిరసనకు దారితీసింది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. సహాయ నిరాకరణను విరమించమని కేసీఆర్ తమను కోరారని ఉద్యోగ సంఘాల జాక్ నేతలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ విధంగా ఎందుకు కోరవలసి వచ్చిందన్న అనుమానాలు కూడా ఉద్యమ సంఘాల్లో వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు కేసీఆర్‌కు ఏమయినా సంకేతాలు పంపిందా? సహాయ నిరారణ విరమణపై కాంగ్రెస్ కేసీఆర్ సాయం అర్ధించిందా? ఆ మేరకు ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్పడకూడదన్న భావనతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారా? అన్న ప్రశ్నలు వారి నుంచి వినిపిస్తున్నాయి. అయితే, పరీక్షలు ముగిసిన తర్వాత విద్యార్థులతో కలసి ఆందోళన చేస్తామని ఉద్యోగ జేఏసీ నేతలు చెప్పిన దాని ప్రకారం.. సహాయ నిరాకరణకు విరామం మాదిరిగానే, 10న మిలియన్ మార్చ్ కూడా విరమించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సోమవారం జరగనున్న జాక్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం ప్రకటించనున్నారు. విద్యార్థుల తలిదండ్రులు మిలియన్ మార్చ్‌ను వాయిదా వేయమని తమను అభ్యర్ధించారని, తాను జేఏసీతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ స్పష్టం చేశారు. దీనితో మిలియన్ మార్చ్ కూడా విరమించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ కేసీఆర్ ఆదేశాల మేరకే రాజకీయ జేఏసీ నడుస్తున్నందున పరీక్ష రోజు జరిగే మిలియన్ మార్చ్ కూడా విరమణ అయ్యే అవకాశాలున్నాయి. మిలియన్ మార్చ్‌రోజు ఇంటర్ పరీక్ష ఉన్నందున, దానిని సజావుగా జరిపేందుకు మార్చ్‌ను వాయిదా వేయాలని ఇప్పటికే అన్ని పార్టీలు, ప్రభుత్వం కోరింది.
ఈ క్రమంలో.. భవిష్యత్తులో తెలంగాణ ఉద్య మం ఇక చల్లబడుతుందన్న సంకేతాలు స్పష్టమవు తున్నాయి. మే వరకూ తెలంగాణపై ఎలాంటి ఉద్య మాలు నిర్వహించినా ఫలితం ఉండదని కేసీఆర్ భావిస్తున్నట్లు ఆయన వ్యవహారశైలి స్పష్టం చేస్తోం ది. అదే సమయంలో ఉద్యమం వల్ల ప్రభుత్వం ఇబ్బందిపడకూడదన్న ధోరణి కూడా ఆయన మాటల్లో కనిపిస్తోంది. కేసీఆర్ పైకి.. కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నప్పటికీ ఆ పార్టీ అధినేత్రిని మాత్రం ఇప్పటివరకూ ఒక్కమాట కూడా అనకపోవడం కూడా తెలంగాణ ఉద్యమ సంఘాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కేసీఆరా? ప్రజలా ?
(సూర్య ప్రధాన ప్రతినిధి)తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తమ వంతు పోరాటాలు చేస్తున్న ఉద్యోగ, విద్యార్థి వర్గాల జేఏసీలు ఇప్పుడు అంతర్మథనంలో పడ్డాయి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలను వణికించిన ఉద్యోగుల సహాయ నిరాకరణ ఉద్యమం హటాత్తుగా నిలిపివేయడానికి టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సూచనే కారణమని తెలంగాణ ఉద్యోగుల జాక్ నేతలు తాజాగా స్పష్టం చేశారు. ఫలితంగా ఆయా సంఘాల్లో భాగస్వాములుగా ఉన్న మిగిలిన సంఘాల ఉద్యోగులు తమ జాక్ నేతల దిష్టిబొమ్మలు తగులబెట్టడం సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారం ఉద్యోగుల్లో చీలిక వచ్చిందనే సంకేతాలు పంపడంతో ఇకపై ఉద్యమాలు-విరమణ సందర్భాల్లో ఏ విధంగా వ్యవహరించాలన్న అంశంపై జేఏసీలలో ఆత్మపరిశీలన మొదలయింది.
కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేసిన తెలంగాణ ఉద్యోగుల సహాయ నిరాకరణ కార్యక్రమం చివరకు ఢిల్లీ వరకూ చేరింది. బీజేపీ నేత సుష్మాస్వరాజ్ సైతం రాష్ట్రంలో పరిపాలన స్తంభించిందని, ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తున్నారంటూ పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్లారు. ఆ క్రమంలో ప్రభుత్వం కూడా డైలమాలో పడింది. ఉద్యోగుల సహాయ నిరాకరణ ఫలితంగా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ముఖ్యమంత్రి, గవర్నర్, మంత్రులకు సైతం జీతాలు రాని దుస్థితి ఏర్పడింది. ఆ రకంగా తెలంగాణ ఉద్యోగులు తమ సత్తా చాటారు. తాము తలచుకుంటే ప్రభుత్వం ఏ స్థితికి చేరుతుందనేది అనుభవపూర్వకంగా తెలియచేశారు. రాష్ట్ర ఉద్యమ చరిత్రలో ఉద్యోగ సంఘాలు చేసిన ఈ నిరసన తొలిసారి అన్ని వర్గాలపైనా ప్రభావం చూపింది.
అయితే, ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ఉద్యోగ సంఘాల జాక్ నేతలు అమ్ముడుపోయారంటూ స్వామిగౌడ్, శ్రీనివాసగౌడ్, సి.విఠల్ దిష్టిబొమ్మలు దగ్ధం చేయడంతో పాటు.. ఉద్యోగ సంఘాలలో ఉన్న ఉద్యోగులే వారిని తెలంగాణ ద్రోహులుగా ప్రకటించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో వారి దిష్టిబొమ్మలు దగ్ధం చేసి, చెప్పులతో కొట్టి, ఊరేగించిన వైనం ఉద్యోగుల్లో తిరుగుబాటుకు దారితీసింది. సర్కారుతో చర్చలు జరిపిన నేతలు కేసీఆర్‌కు అమ్ముడుపోయారంటూ జాక్ నేతలతో వాగ్వాదానికి దిగడంతో పాటు, రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామిరెడ్డిని కూడా చుట్టుముట్టారు.
కాగా, సహాయ నిరాకరణను విరమించుకోవాలని కేసీఆరే తమను స్వయంగా కోరారని, ఢిల్లీలో ఉన్న కేసీఆర్ శుక్రవారం తమతో ఫోన్‌లో మాట్లాడారని జాక్ నేతలు వెల్లడించారు. మే వరకూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై స్పందించే అవకాశం లేనందున ఆ తర్వాత తలెత్తే సమస్యల దృష్ట్యా అప్పటివరకూ సహాయ నిరాకరణ విరమించుకోవాలని కేసీఆర్ తమకు సూచించినట్లు జాక్ నేతలు స్వయంగా మీడియాకు వివరించారు. పరీక్షలన్నీ ముగిసిన తర్వాత మళ్లీ నిరాకరణకు నోటీసు ఇవ్వాలనే విరమణ ప్రకటన చేశామని, అందుకు స్టీరింగ్ కమిటీ కూడా అంగీకరించిందని జాక్ నేతలు వెల్లడించారు.
ఇది వివిధ వర్గాల్లో చర్చనీయాంశమయింది. ఉద్యోగుల తిరుగుబాటు, నేతల దిష్టిబొమ్మల దగ్ధం పరిణామాల నేపథ్యంలో.. ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీకి, కేసీఆర్‌కు సంబంధం ఏమిటి? కేసీఆర్ ఆదేశాలను జాక్ పాటించవలసిన అవసరం ఏమిటి? జాక్‌కు స్వతంత్ర ప్రతిపత్తి లేదా? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకొచ్చాయి.జాక్ నేతలకు కేసీఆర్ ఫోన్ చేసి, సహాయ నిరాకరణను విరమించాలని కోరడం, ఆ తర్వాత జాక్ నేతలు నిరాకరణను విరమించడం చూస్తే.. కేసీఆర్ దిశానిర్దేశంలోనే జాక్ నడుస్తోందన్న వాస్తవం స్పష్టమవుతోందని తెలంగాణ ప్రజాసంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈనెల 10న తలపెట్టిన మిలియన్ మార్చ్ కూడా వాయిదా వేసుకోవడం ఖాయంగానే కనిపిస్తోందంటున్నారు. విద్యార్థుల తలిదండ్రులు పరీక్షలు వాయిదా వేయవద్దని కోరుతున్నారంటూ తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్య పరిశీలిస్తే మిలియన్ మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని కేసీఆర్ ఈపాటికే జాక్‌కు ఆదేశాలు ఇచ్చి ఉంటారన్న వ్యాఖ్యలు ప్రజాసంఘాలలో వ్యక్తమవుతోంది.
అటు.. కొన్ని విద్యార్థి జేఏసీలు కూడా టీఆర్‌ఎస్ ఆదేశాల మేర కే నడుచుకుంటున్నాయన్న విమర్శలు తెలంగాణ ప్రజాసంఘాల నుంచి వ్యక్తమవుతున్నాయి. కొన్ని విద్యార్థి సంఘాల నాయకులను టీఆర్‌ఎస్ ప్రభావితం చేస్తోందని, అందుకే బందులు, నిరసన కార్యక్రమాలను టీఆర్‌ఎస్ ఖరారు చేసిన తర్వాతే తేదీలను ప్రకటిస్తోందని స్వతంత్ర జేఏసీ నేతలు విమర్శిస్తున్నారు.
ఇప్పటికే రాజకీయ జేఏసీ కేసీఆర్‌కు తొత్తుగా మారిందని, టీఆర్‌ఎస్ ఎన్ని తప్పులు చేసినా దానిని ప్రశ్నించడంలో కోదండరామిరెడ్డి విఫలమయ్యారని, స్వయంగా కోదండరామిరెడ్డి పేరు టీఆర్‌ఎస్ డైరీలో పొలిట్‌బ్యూరో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉందని వారు గుర్తు చేస్తున్నారు. కోదండరామిరెడ్డి వ్యవహారశైలిపై అటు బీజేపీ కూడా అసంతృప్తితోనే ఉంది. కాంగ్రెస్ అధినే త్రి సోనియాగాంధీని ఎందుకు విమర్శించడం లేదని, ఆ మేరకు కేసీఆర్‌పై కోదండరామిరెడ్డి ఎందుకు ఒత్తిడి చేయలేకపోతున్నారని బీజేపీ నేతలు నిలదీస్తున్నారు.తాజాగా, ఉద్యోగుల సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని నిలిపివేయడంపై క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, విద్యార్ధుల జేఏసీలలో వ్యతిరేకత మొదలయింది.
ఈ పరిణామాలు అటు ఉద్యోగుల జాక్ నేతలలోనూ ఆత్మవిమర్శ దిశగా అడుగులు వేయిస్తోంది. స్వతంత్రంగా వ్యవహరించి, అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటే ఈ దుస్థితి వచ్చేది కాదని, తాము సహ ఉద్యోగుల దృష్టిలో చెడ్డవారిగా ముద్రవేసుకునేవారం కాదని మదనపడుతున్నారు. తమ సహాయ నిరాకరణకు మద్దతు ప్రకటించి ప్రత్యక్ష ఆందోళనలు నిర్వహించిన విద్యర్థి జాక్‌లతో కూడా చర్చించి ఉంటే బాగుండేదని ఇప్పుడు భావిస్తున్నారు. స్వతంత్ర ప్రతిపత్తి సాధించకుండా, మరొకరిపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని గుర్తించినట్లు తెలుస్తోంది. ఇకపై కేసీఆర్ ఆదేశాలను పాటించకూడదన్న ఒత్తిడి కూడా మొదలయింది.
ప్రధానంగా.. కేసీఆర్ సహాయ నిరాకరణను విరమించమని కోరారన్న విషయాన్ని అంగీకరించడం వల్ల.. తెలంగాణ జాక్‌లకు స్వతంత్ర ప్రతిపత్తి, సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి లేదన్న వాస్తవం తెలిసిపోయిందన్న సంకేతాలు ప్రజలకూ వెళ్లాయి. దీనివల్ల జాక్‌ల మనుగడను కేసీఆరే నిర్దేశిస్తున్నారు తప్ప, జాక్‌లు కాదన్న విషయం కూడా ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయిందంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎదురవుతున్న చేదు పరిణామాలను దృష్టిలో ఉంచుకుని.. భవిష్యత్తులో కూడా కేసీఆర్ ఆదేశాలు పాటించాలా? లేక సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలా అన్న అంశంపై జాక్ నేతల్లో ఆత్మపరిశీలన జరుగుతున్నట్లు సమాచారం. మూడు జిల్లాల్లో ఎదురయిన తిరుగుబాటు పరిణామాలను చవిచూసిన కొందరు జాక్ నేతలు ఇకపై కేసీఆర్‌తో సంబంధం లేకుండా వ్యవహరించాలని, టీఆర్‌ఎస్ కార్యాలయానికి కూడా వెళ్లకూడదని బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
కేసీఆర్‌కు తోకలుగా మారవద్దు
ఉద్యోగ సంఘాల సహాయ నిరాకరణ వల్ల ప్రభుత్వం పూర్తి స్థాయి లో దిగివచ్చి, తెలంగాణ పై కేంద్రం ఒక నిర్ణయం తీసుకునే సమయంలో ఉద్యమాన్ని విరమించ డం ఆత్మహత్యా సదృశ మని తెలంగాణ బీసీ ఫ్రం ట్ కన్వీనర్, తెలంగాణ ఓబీసీ జేఏసీ కన్వీనర్ కస్తూరి జయప్రసాద్ వ్యాఖ్యానించారు. స్వతంత్రంగా వ్యవహ రించవలసిన ఉద్యోగ, విద్యార్థి సంఘాల జాక్‌లు తెలం గాణ భవన్‌కు వెళ్లి, కేసీఆర్ ఆదేశాలు పాటించడం వల్లే ప్రజల్లో జాక్‌లపై విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. ఉద్య మ సంఘాలు కేసీఆర్‌కు తోకలుగా మారవద్దని, మారి తే ప్రజల్లో ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయన్నారు. ఉద్యోగుల తిరుగుబాటును జాక్‌లు ఒక గుణపాఠంగా తీసుకోవాలన్నారు. జాక్‌లలో ఉన్న బీసీ నేతలు కేసీఆర్ కు తొత్తులుగా వ్యవహరించొద్దని, అగ్రకులాల అడుగు లకు మడుగులొత్తకుండా నిర్ణయాలు తీసుకోవాలన్నారు.
ఎందుకీ పరాధీవత ?
ఉద్యోగుల సహాయ నిరాకరణ ఉద్యమంతో కేంద్రం దిగివచ్చే సమ యంలో ఆ వాతావర ణాన్ని కేసీఆర్ చెడగొట్టా రని తెలంగాణ డెమో క్రాటిక్ ఫ్రంట్ అధ్యక్షు రాలు నర్రా జయలక్ష్మి విమర్శించారు. తాజా పరిణామాలు ఉద్యోగ నేత పరాధీనతను చాటాయ న్నారు. సహాయ నిరాకరణ విమరించే సందర్భంలో ఉద్యోగ జాక్ నేతలు తెలంగాణ ప్రజాసంఘాలు, పార్టీలతో ఎందుకు సంప్రదించలేదని ఆమె ప్రశ్నిం చారు. కేసీఆర్ ఆదేశాలను పాటించి నిర్ణయాలు తీసుకుంటే పరిణామాలు ఇంతకు మించి భిన్నంగా ఉండవని స్పష్టం చేశారు. ఉద్యోగుల నిరసనలను బట్టి వారిలో కేసీఆర్‌పై ఏ స్ధాయిలో వ్యతిరేకత ఉందో అర్ధమవుతోందన్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా తెలంగాణపై పోరాడవలసిన కేసీఆర్ హైదరాబాద్ ఎందుకు వచ్చారని ఆమె నిలదీశారు.
Tag: AP. News, RajNews, hmtv, KCR, Telangana, Telangana News, Sexy, Hot Images,
take By: Suryaa
0 comments:
Post a Comment