ప్రత్యేక ‘ఆంధ్రా’ మండళ్లు
- సెజ్‌లలోనూ సీమాంవూధులదే హవా
- రాజధాని చుట్టూ వారిదే ఆధిపత్యం
- 10కిపైగా సీమాంధ్ర పెట్టుబడిదారులవే
- సత్యం, మేటాస్, శ్రీని, అనంత్, నవయుగ, ల్యాంకో, ఇందు... ఇదో చాంతాడు
- అభివృద్ధి ముసుగులో భూములు స్వాహా
- లొసుగుల పునాదులపై రియల్ దందా
- ల్యాంకోహిల్స్, ఎమ్మార్, ఐటీ పార్కులే నిదర్శనాలు
- పాలకులకు కాసుల వర్షం
పేరుకు అవి ప్రత్యేక ఆర్థిక మండళ్లు! కానీ తరచి చూస్తే అవి ప్రత్యేక ఆంధ్ర మండళ్లు! సత్యం, మేటాస్, శ్రీని, అనంత్, నవయుగ, ఇందు... చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తేలుతుంది. నయా ఆర్థిక విధానాల అమలు క్రమంలో కార్మిక హక్కులను కాలరాస్తూ.. భారీ మినహాయింపులు పొందుతూ సెజ్‌లు పుట్టుకొచ్చాయి. సెజ్‌ల చట్టంలో లొసుగులు ఆధారం చేసుకుని అసలు సంగతి పక్కనపె రియల్‌దందా మొదలు పెట్టాయి. పోగుపడిన సంపదను రెట్టింపు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్న సీమాంధ్ర బడాబాబులకు ఈ సెజ్‌లు వరంగా పరిణమించాయి. వారి ఆకాంక్షలను నెరవేర్చే ప్రభుత్వం తోడవడంతో సీమాంధ్ర పెట్టుబడిదారుల దోపిడీకి అంతే లేకుండా పోయింది. ఇప్పుడు సెజ్‌లంటే సీమాంవూధుల ఆధిపత్యమే కనిపించే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో అదే అభివృద్ధిగా నాడు చంద్రబాబు నాయుడు అనంతరం వైఎస్ రాజశేఖర్‌డ్డి ఉద్ఘోషించారు. ఆ అభివృద్ధి ఫలాలు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని చూస్తే.. అక్కడా సీమాంవూధులే కనిపిస్తున్నారు.
( హైదరాబాద్) ప్రత్యేక ఆర్థిక మండళ్ల విషయంలోనూ సీమాంధ్ర హవా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటికే ఉన్న సెజ్‌లే కాకుండా.. ఇటీవల ప్రారంభమైన సెజ్‌లలోనూ వారిదే ఆధిపత్యం. సెజ్‌ల పేరుతో భూములు స్వాహా చేసిన సీమాంధ్ర పెట్టుబడిదారులు.. నిబంధనల్లో లొసుగులను ఆధారం చేసుకుని రియల్ వ్యాపారం చేస్తున్నారు. సెజ్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రంలోనూ సెజ్‌లు వచ్చాయి. ఆ సమయంలో ఎక్కువగా ఐటీ రంగం ఊపులో ఉండడం వల్ల ఐటీ సెజ్‌లు ఎక్కువగా వెలిశాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో 73 సెజ్‌లుండగా వాటిలో పూర్తిగా ఆంధ్రవూపదేశ్ ఇండవూస్టియల్ ఇన్‌వూఫావూస్టక్చర్స్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నవి 17, ఏపీఐఐసీ భాగస్వామిగా ఉండి ప్రైవేటు కంపెనీలు అభివృద్ధి చేస్తున్నవి 29, పూర్తిగా ప్రైవేటు కంపెనీలు అభివృద్ధి చేస్తున్నవి 25 ఉన్నాయి. వీటిలో పూర్తిగా ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఉన్నవాటికి ప్రైవేటు వ్యక్తులతో సంబంధం ఉండదు. అయితే, ఏపీఐఐసీ సహకారంతో ప్రైవేటు డెవలపర్స్ భాగస్వామ్యంతో ఏపీఐఐసీ అభివృద్ది చేసేవాటిలో, ప్రైవేటు డెవలపర్స్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నవాటిలోనే సీమాంవూధులు తమ హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు.
ఏపీఐఐసీ-ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్న సెజ్‌లలో హైదరాబాద్ చుట్టుపక్కల.. అంటే రంగాడ్డి, మెదక్ జిల్లాల్లో ఉన్న సెజ్‌ల సంఖ్య 19. వీటిలో ఎక్కువ భాగం ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులకు చెందిన కంపెనీలు పెట్టుకునే సెజ్‌లదే. వీటిలో పక్కాగా సీమాంధ్ర పెట్టుబడిదారులకు చెందిన సెజ్‌లు కూడా ఉన్నాయి. ఏపీఐఐసీ భాగస్వామ్యంతో ఉన్న ప్రతి సెజ్‌లోనూ పరోక్షంగా సీమాంధ్ర బడాబాబులకు వారి ద్వారా పాలకులకు లాభం జరిగింది. వీటిలో జరిగిన అక్రమాల్లో ఏపీఐఐసీ వాటా తగ్గించి భూములు అందినకాడికి లాక్కోవడం, మిగతావి అమ్ముకుని జేబులో వేసుకున్నారని ఇటీవల వెలుగు చూసిన అక్రమాలే చెబుతున్నాయి.
ఇవికాక హైదరాబాద్ చుట్టుపక్కల ప్రైవేటు డెవలపర్స్ డెవలప్ చేస్తున్న సెజ్‌లు చాలా ఉన్నాయి. వీటిలో శేరిలింగంపల్లిలోని ఏపీ టెక్నో ప్రాజెక్ట్ ప్రైవేట లిమిటెడ్ (24.70 ఎకరాలు, ఐటీ), బహదూర్‌పల్లిలోని సత్యం కంప్యూటర్ సర్వీసెస్ లిమిటెడ్ (25.98, ఐటీ), సీఎంసీ లిమిటెడ్ (50 ఎకరాలు), సంఘీ సెజ్ ప్రైవేట్ లిమిటెడ్ (202.40, ఐటీ), మేటాస్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ సెజ్ లిమిటెడ్ (15.92 ఎకరాలు, ఐటీ), రుద్రదేవ్ ఇన్ఫోపార్క్ ప్రైవేట్ లిమిటెడ్ (12.25 ఎకరాలు, ఐటీ), మహవీర్ సై్క స్క్రాపర్స్ (56.27ఎకరాలు, ఐటీ), మేటాస్ ప్రాపర్టీస్ (73 ఎకరాలు, ఐటీ), శ్రీని ప్రాపర్టీస్ (66ఎకరాలు, ఐటీ), నవయుగ లీగల్ ఎస్టేట్స్ (25 ఎకరాలు, ఐటీ), జెన్‌ప్యాక్ట్ ఇండియా (50ఎకరాలు,ఐటీ), వివో బయోటెక్ లిమిటెడ్ (27ఎకరాలు), ఎస్2 టెక్ లిమిటెడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (25ఎకరాలు, ఐటీ),
జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (251ఎకరాలు, ఏవియేషన్), ఇన్‌ఫోసిస్ ప్రైవేట్ లిమిటెడ్ (296 ఎకరాలు, ఐటీ), దేవ్ భూమి రియల్టర్స్ (25ఎకరాలు, ఐటీ), అనంత్‌టెక్నాలజీస్ (25 ఎకరాలు, ఐటీ), గోద్రేజ్ రియల్‌ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (34 ఎకరాలు, ఐటీ), లహరి ఇన్‌వూఫావూస్టక్చర్స్ (25 ఎకరాలు,ఐటీ), బయాలజికల్ ఈ లిమిటెడ్ (25ఎకరాలు, బయోటెక్ సెజ్), మధుశీల్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ (25 ఎకరాలు,ఐటీ) సెజ్‌లున్నాయి. వీటిలో కొన్ని జాతీయ,అంతర్జాతీయ కంపెనీలకు చెందిన సెజ్‌లుండగా సత్యం, మేటాస్, నవయుగ, జీఎంఆర్ ఇంటర్నేషనల్, అనంత్ టెక్నాలజీస్, శ్రీని ప్రాపర్టీస్, బయలాజికల్ ఈ లిమిటెడ్ లాంటి సీమాంధ్ర పెట్టుబడిదారులకు చెందిన సెజ్‌లూ ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేట్ డెవలపర్ భూమి సమకూర్చుకున్న అనంతరం కేంద్రవూపభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే సెజ్‌గా నోటిఫై చేస్తుంది. వీటిలో కంపెనీల రాక, నిర్వహణ, పర్యవేక్షణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన సెజ్ డెవలప్‌మెంట్ కమిషనర్ చూస్తుంటారు. ఇలా ఏపీఐఐసీ భాగస్వామ్యం, ప్రైవేటుకు చెందిన సెజ్‌లన్నింటికీ సెజ్ చట్టం 2005 కిందే అన్ని రకాల రాయితీలు, ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంటారు.
ఇదీ సెజ్ చట్టం
పరిక్షిశమల రంగాన్ని అభివృద్ధి చేయడానికి, దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, స్థానికంగా ఉద్యోగ అవకాశాలను పెంపొందించడానికి, ఎగుమతులను ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికిగాను భారత ప్రభుత్వం 2005లో స్పెషల్ ఎకనమిక్ జోన్ చట్టాన్ని (సెజ్ యాక్ట్) రూపొందించింది. అప్పటి వరకు ఫారన్ ట్రేడ్ పాలసీ కింద ఉన్న ప్రత్యేక ఆర్థిక మండళ్ల కోసం సమగ్ర విధివిధానాలతో స్పెషల్ ఎకనమిక్ జోన్ చట్టం-2005 తయారైంది. ఈ ప్రత్యేక ఆర్థిక మండళ్ల బిల్లు మే 2005లో పార్లమెంటు ఆమోదం పొందింది. 2006 ఫిబ్రవరి 10 నుంచి ఇది అమలులోకి వచ్చింది.పలు రంగాలకు చెందిన పరిక్షిశమలను ప్రోత్సహించడానికి కొంత భూమిని ప్రభుత్వమే డెవలపర్‌కు అప్పగిస్తుంది.
ఆ ప్రదేశంలో పరిక్షిశమలు పెట్టడానికి పెట్టుబడిదారులు ముందుకు రావడం కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని రాయితీలు ఇస్తాయి.
ఇది ఒక పద్ధతి కాగా, మరో పద్ధతిలో సొంత భూమి కలిగి ఉన్న ప్రైవేటు డెవలపర్ ప్రత్యేక ఆర్థిక మండలి కోసం దరఖాస్తు చేసుకుంటే అన్ని రకాలు పరిశీలించిన మీదట ఆ ప్రదేశాన్ని సెజ్‌గా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. దేనిని ఉద్దేశించి ఆ సెజ్ పెట్టుకున్నారో అందులో వచ్చే పరిక్షిశమలన్నింటికీ రాయితీలు సెజ్ చట్టం 2005 ప్రకారం రాయితీలు కల్పిస్తారు. సెజ్‌లో వచ్చే పరిక్షిశమలకు మొదటి 5 సంవత్సరాల పాటు 100% ఆదాయం పన్ను మినహాయింపు, తర్వాతి 5 సంవత్సరాలకు 50 శాతం ఆదాయ పన్ను మినహాయింపు, డ్యూటీ ఫ్రీ దిగుమతులు, మినిమమ్ ఆల్టర్నేటివ్ ట్యాక్స్ మినహాయింపు,
ఎలాంటి పరిమితులు లేకుండా గుర్తింపు పొందిన బ్యాంకుల నుంచి సంవత్సరానికి 500 మిలియన్ డాలర్ల రుణం తీసుకోవడానికి అనుమతి, అమ్మకపు పన్ను మినహాయింపు, సేవా పన్ను మినహాయింపు, రాష్ట్రాల సేవా పన్ను మినహాయింపుతో పాటు సె్ నుంచి జరిగిన ఎగుమతులపై వచ్చిన ఆదాయంపై 10ఏళ్ల పాటు మినహాయింపులాంటి ఎన్నో భారీ రాయితీలు సెజ్ డెవలపర్‌కు కల్పిస్తారు. ఇన్ని రాయితీలతో పాటు ఎన్నో లొసుగులున్న సెజ్ చట్టాన్ని చూస్తే పెట్టుబడిదారుపూవరికైనా నోరూరుతుంది. అందులోనూ సీమాంధ్ర పెట్టుబడిదారులు ఎక్కడ రాయితీలుంటే అక్కడ వాలిపోతుంటారు.
సెజ్‌ల ముసుగులో రియల్ వ్యాపారం
సాధారణంగా సెజ్‌లలో ప్రాసెసింగ్ ప్రదేశం, నాన్ ప్రాసెసింగ్ ప్రదేశం ఉంటాయి. వీటిలో నాన్ ప్రాసెసింగ్ ప్రదేశంలో సెజ్‌లో ఉద్దేశించిన కంపెనీలు రాకముందే వాటితో సంబంధం లేకుండా కమర్షియల్ కాంప్లెక్సులు, రెసిడెన్షియల్ టవర్లు, థియేటర్లు, రిక్రియేషన్ క్లబ్‌లు, రెస్టాంట్‌లు, కన్వెన్షన్ సెంటర్‌లు, కార్లసర్వీసింగ్ సెంటర్లు తదితర వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నిబంధనను అడ్డం పెట్టుకుంటున్న సీమాంధ్ర పెట్టుబడిదారులు భూముల విలువ ఎక్కువగా ఉండే రంగాడ్డి జిల్లాలో సెజ్‌ల పేరుతో భూమి తీసుకొని వాటిలో ఎలాంటి కంపెనీలు రాకముందే ఇళ్లు నిర్మించి కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారు. లాంకోహిల్స్ టెక్నాలజీ ప్రైవేట్ పార్క్, ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఉదంతాలు ఇందుకు నిదర్శనం.
ఇవి ఐటీ కంపెనీల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెజ్‌లని చాలా మందికి తెలియదు. కంపెనీల రాకకంటే ముందే ఇక్కడ వెలసిన రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లు, విల్లాలు, గోల్ఫ్‌కోర్సులు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం... వాటిని అమ్ముకునేందుకు ఫక్తు రియల్‌ఎస్టేట్ కంపెనీల మాదిరిగా ప్రచారం ఇవన్నీ తెలిసిందే. లగడపాటి రాజగోపాల్‌కు చెందిన ల్యాంకో హి్ టెక్నాలజీ పార్క్, సీమాంధ్ర పాలకులందరి హస్తమున్న ఎమ్మార్ టౌన్‌షిప్ హిల్స్‌పై ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలా సెజ్ చట్టంలో ఉండే లొసుగులను అడ్డం పెట్టుకొని కాలంతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల రంగాడ్డి, మెదక్‌జిల్లాల్లోని లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను సెజ్‌ల ముసుగులో కాజేసి సీమాంధ్ర పాలకులు, పెట్టుబడిదారులు కలిసి తెగనమ్ముకుంటున్నారు.
0 comments:
Post a Comment