ఉద్యమానికి ‘భాగ్య’నగరం
హైదరాబాద్, నవంబర్ 26 (: భిన్నత్వంలో ఏకత్వం అన్న నానుడిని సొంతం చేసుకున్న హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలోనే ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. నాటి నగర చారివూతక వైభవం నేటికీ గుభాళిస్తోంది. 1857 సిపాయిల తిరుగుబాటు రోజుల్లోనే.. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం ఉద్యమించిన నగరం. సుల్తాన్‌బజార్‌లో వీరత్వానికి చిహ్నంగా కనిపిస్తోన్న తుర్రేబాజ్‌ఖాన్ అమర స్తూపం నేటి తెలంగాణ ఉద్యమానికి ైధైర్యాన్ని నింపుతోంది. శస్త్ర చికిత్సలో అత్యంత ముఖ్యమైన అనస్థీషియా (మత్తు మందు)ను కనిపెట్టిన వైద్యుడు డా.మల్లయ్య, బడుగుల కోసం తాపవూతయపడ్డ కె.కృష్ణస్వామిముదిరాజ్.. ఇలా ఒక్కరేమిటి? వందల సంఖ్యలో ఎందరో మహనీయులు నడయాడిన నేల ఇది. పట్టెడన్నం కోసం పట్నమొచ్చిన ఎవరినైనా అక్కున చేర్చుకుంది. దేశ విదేశీయులనూ తన పొత్తిళ్లల్లో దాచుకుంది. మార్వాడీలు, గుజరాతీలు, బీహారీలు..ఇలా మినీ భారతం హైదరాబాద్‌లో కనిపిస్తుంది. ప్రత్యక్షంగా లక్షలాది మందికి, పరోక్షంగా కోట్లాది మందికి భాగ్యనగరం ఉపాధి కల్పిస్తోంది.
ఎంత మందినో భాగ్యవంతులుగా తీర్చిదిద్దింది. అందరూ హైదరాబాదీలతో సమ్మిళితమై హాయిగా బతుకుతున్నారు. కానీ వలసాధిపత్యం కలిగిన సీమాంవూధకు చెందిన కొందరు పెత్తందార్లు మాత్రం జులుం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముల్కీ.. నాన్ ముల్కీ, ఇడ్లీ సాంబర్ గో బ్యాక్ వంటి ఉద్యమాలకు పుట్టినిల్లు ఈ భాగ్యనగరం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి 1969లో పునాదులను పటిష్టంగా నిర్మించడంలో నగరవాసుల పాత్ర ఎనలేనిది. తూటాలకు ఎదురొడ్డి ప్రాణాలు అర్పించిన ఘనత నగరవాసులకే దక్కుతుంది. కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం నాటి ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన 369 మందిలో సింహభాగం హైదరాబాదీయులే. ఈ క్రమంలోనే గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం ఉద్యమానికి ఆలయంగా మారింది. మలి విడత తెలంగాణ ఉద్యమానికి కూడా హైదరాబాద్ కేంద్రమైంది.
కాంగ్రెస్‌లో ఆధిపత్యపోరు
గ్రేటర్ హైదరాబాద్‌లో అధికంగా ఎమ్మెల్యే స్థానాలు గెల్చుకున్న కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ఆధిపత్యపోరుతో పార్టీకి నష్టం చేకూరుతోంది. తెలంగాణ ఉద్యమం పట్ల అంటీముట్టనట్లుగా నాయకులు వ్యవహరిస్తుండటంతో కూడా పార్టీ పట్ల ప్రజలు విముఖత చూపుతున్నారు. ఖైరతాబాద్ నుంచి విజయం సాధించిన దానం నాగేందర్, గోషామహల్ నుంచి గెలుపొందిన మూల ముఖేష్‌గౌడ్, కంటోన్మెంట్ నుంచి విజయం సాధించిన శంకర్‌రావు, మహేశ్వరం నుంచి జయకేతనం ఎగురవేసిన సబిత మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్నారు. కాగా రెండు పర్యాయాలు సికింవూదాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించిన ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ఎటువంటి పదవిని దక్కించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే గ్రేటర్‌కు చెందిన మంత్రులు, ఎంపీ మధ్యన ఆధిపత్యపోరు చోటుచేసుకుంది. వీరంతా పైకి కలిసికట్టుగా ఉన్నట్లు నటిస్తున్నా, ఎవరికి వారు అధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు.
టీడీపీలో గ్రూపుల లొల్లి
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం తెరపైకి తీసుకురావడంతో టీడీపీకి ప్రజలు క్రమంగా దూరమవుతున్నారు. ఇక గ్రూపు రాజకీయాలు తోడవ్వడంతో గ్రేటర్ టీడీపీ పరిస్థితి గందరగోళంగా మారుతోంది. 1983లో జరిగిన ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుని విజయఢంకా మోగిస్తే, ప్రస్తుతం ఒకే ఒక్క స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే 2002లో మేయర్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోవడంతో కొంత వరకు పార్టీ కేడర్‌ను కాపాడుకోగలిగింది. ప్రస్తుతం గ్రేటర్ టీడీపీలో నెలకొన్న గ్రూపు రాజకీయాల కారణంగా నియోజవర్గాల ఇన్‌చార్జీల ఎంపిక నిలిచిపోయింది. ఇక జనచైతన్య యాత్రల్లో గ్రూపు తగాదాలతో బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో ఆయా నియోజవర్గాల్లో ఎవరికి వారు తామే నియోజవర్గ ఇన్‌చార్జిలుగా అన్నట్లుగా గ్రూపులు కట్టుకుంటున్నారు. ఇటీవల అవినీతికి వ్యతిరేకంగా చంద్రబాబు నగరంలో పాదయాత్ర చేసినా కొందరు నాయకులు మినహా కార్యకర్తల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదరు. ఒకనాడు కళకళలాడిన టీడీపీ ఇప్పుడు వెళ చెప్పవచ్చు.
బీజేపీకి జీవం పోసిన ఉద్యమం
గ్రేటర్‌లో పూర్తిగా చతికిలపడిపోయిన భారతీయ జనతాపార్టీకి తెలంగాణ ఉద్యమం మళ్లీ జీవం పోసింది. గ్రూప్ రాజకీయాలు, అంతర్గత కలహాలతో బీజేపీ నాయకులు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడంతో పార్టీ నిర్వీర్యం అయ్యింది. బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు అనుకూలంగా ఉండడంతో ఉద్యమం ఆ పార్టీకి కలిసొచ్చింది. గ్రేటర్‌లో రెండు నియోజక వర్గాలకే పరిమితమైన బీజేపీకి ఉద్యమం, బీజేపీ జాతీయ నేత అద్వానీ రథయావూతతో పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపింది. గ్రేటర్‌లో ఒక ఎమ్మెల్యే, ఐదుగురు కార్పొరేటర్లకు పరిమితమైన బీజేపీని మరింత బలోపేతం చేయడానికి నాయకులు విశ్వవూపయత్నం చేస్తున్నారు.
పుంజుకుంటున్న ఎంబీటీ
పాతనగరంలో మజ్లీస్ పార్టీ నేతలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్షికమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకు మజ్లిస్ బచావ్ తహెరిక్ (ఎంబీటీ) సత్తా చాటుతోంది. ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ వాదంతో మైనార్టీ వర్గాలను ప్రభావితం చేస్తోంది. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో రెండోసారి ఈ పార్టీ కన్వీనర్ కార్పొరేటర్‌గా గెలుపొందారు. మైనార్టీల్లోని పలు గ్రూపుల మధ్య విభేధాలకు ఆజ్యం పోస్తున్న మజ్లిస్ వ్యవహారాలు ఎంబీటీకి బలం చేకూరుస్తున్నాయి.
ఉద్యమంతో సీపీఐకి ఊపిరి
వామపక్ష పార్టీలలో సీపీఐ తెలంగాణకు అనుకూలంగా ఉండడంతో తెలంగాణ ఉద్యమం సీపీఐకి బాగా కలిసొచ్చింది. పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి నుంచి మళ్లీ కేడర్ బలోపేతం చేసుకునే దిశగా పార్టీ కార్యక్షికమాలు రూపొందించుకుంటోంది. తెలంగాణ ఉద్యమంతోపాటు ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూ తన ఉనికిని కాపాడుకుంటోంది. సీపీఎం మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా ఉండడంతో గ్రేటర్‌లో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.
ఉనికి కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ యత్నాలు
గ్రేటర్ హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం ప్రయత్నిస్తోంది. అధినేత జగన్ చరిష్మాతో పార్టీని బలోపేతం చేయాలని అనుకుంటున్నా, ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలు సమస్యగా మారింది. తెలంగాణ విషయంలో పార్టీ వైఖరి ప్రకటించకపోవడం, పటిష్టమైన కేడర్ లేకపోవడం కూడా పార్టీ బలోపేతం కాకపోవడానికి కారణంగా చెప్పవచ్చు. కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయవూపకాష్ నారాయణ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తుండటంతో ఓటమి భయంతో అక్టోబర్‌లో జరిగిన కేపీహెచ్‌బీకాలనీ డివిజన్ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. సామాజిక న్యాయమే ధ్యేయంగా ప్రజల ముందుకు వచ్చిన ప్రజారాజ్యంపార్టీకీ ప్రజల ఆదరణ కరువై బొక్కబోర్లాపడింది. ప్రజాక్షేవూతంలోఎక్కువ కాలం నిలవలేక జెండా ఎత్తేయడంతో నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలలో చేరారు.
పట్టుబిగిస్తున్న టీఆర్‌ఎస్
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి గ్రేటర్‌లో క్రమంగా పట్టుబిగిస్తోంది. ఉద్యమానికి కేంద్ర బిందువైన హైదరాబాద్ నగరంలో టీఆర్‌ఎస్‌కు ఆదరణ పెరుగుతూ వస్తోంది. కేసీఆర్ ఆమరణ దీక్ష తరువాత నగరంలోని తెలంగాణవాదం బయటపడింది. మిలియన్‌మార్చ్, ఓయూ విద్యార్థుల ఉద్యమం టీఆర్‌ఎస్‌కు స్ఫూర్తినిచ్చింది. సకలజనుల సమ్మెనాటికి అది మహోధృతంగా మారి టీఆర్‌ఎస్‌కు కొండంత అండగా నిలిచింది. విద్యావంతులు, ఉద్యోగులు, యువతరం తెలంగాణవాదంతో టీఆర్‌ఎస్‌కు అండగా నిలబడుతున్నారు. ఇటీవల నగరంలో పార్టీని బలోపేతం చేయడానికి ఒకవైపు హరీష్‌రావు, మరోవైపు కేటీఆర్‌లు తీవ్రంగా కృషిచేస్తున్నారు. విభిన్న సంస్కృతుల కలయికతో ఉన్న నగరంలో రాష్ట్ర సాధన కోసం ఇచ్చిన ప్రతి పిలుపుకు ప్రజలు స్పందించి తెలంగాణవాదాన్ని చాటిచెప్పారు. సీమాంధ్ర వలసవాదులు ఉన్న కొన్ని ప్రాంతాలలో తప్ప హైదరాబాద్‌లో తెలంగాణవాదం బలంగానే ఉంది. ఇటీవల కేటీఆర్ ఆధ్వర్యంలో గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్భుల్లాపూర్ నియోజవర్గాల్లో నిర్వహించిన పాదయావూతలకు ప్రజల నుంచి వచ్చిన అనూహ్య స్పందననే ఇందుకు సాక్ష్యం.
నిర్ణయాత్మక శక్తిగా మజ్లిస్
మైనార్టీల ప్రతినిధిగా ముద్రపడిన ఎంఐఎం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కీలకమైన నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరింది. ఆరంభంలో కేవలం మున్సిపల్ ఎన్నికలకు పరిమితమైన మజ్లిస్, ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు హైదరాబాద్ లోక్‌సభ స్థానం కూడా దక్కించుకుని గ్రేటర్‌లో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. ఆ పార్టీకి చెందిన దివంగత నేత సలావుద్దీన్ ఒవైసీ ముందుచూపు, అసదుద్దీన్ ఒవైసీ దూరదృష్టితో ఎంఐఎం రాజకీయ ప్రాబల్యం క్రమంగా పెరిగింది. దీంతో మున్సిపల్ కార్పొరేషన్‌లో సైతం 42 కార్పొరేటర్ స్థానాలను దక్కించుని నిర్ణయాత్మకశక్తిగా మారింది. అయితే ఒంటెత్తు పోకడల నేపథ్యంలో ఎంఐఎంపై మైనార్టీలో వ్యతిరేకత ప్రారంభమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అత్యధికంగా మైనార్టీలు కోరుతుండటంతో ఆ పార్టీ చిక్కుల్లో పడింది. పాత నగరం అభివృద్ధి పై కపట ప్రేమతో వ్యవహరించడం కూడా స్థానిక మైనార్టీ ఒటర్లకు మింగుడుపడటం లేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షగా భాగస్వామ్యం అవుతున్న జమాతే ఇస్లామియా, ఇతరత్రా మైనార్టీ సంఘాల కూటమిలు మజ్లీస్ పార్టీకి ధీటూగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు దిశగా ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. .
Take By: T News http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=7&ContentId=48012
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News
0 comments:
Post a Comment