గిరిజన సంక్షేమ శాఖలో 700 పోస్టుల భర్తీకి ఓకే
-ట్రైటా దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి పసుపులేటి
ఎల్బీనగర్, నవంబర్ 26 (: గిరిజన గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి పసుపులేటి బాలరాజు తెలిపారు. శనివారం కొత్తపేటలోని బాబు జగ్జీవన్ రామ్ భవనంలో గిరిజన గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయ సంఘం(ట్రైటా) దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్షికమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బాలరాజు మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖలో 700 పోస్టులను భర్తీ చేయ డానికి అనుమతి లభించిందని, 1900 మంది నాన్ టీచింగ్ స్టాఫ్‌ను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వానికి నివేదించామన్నారు. ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ గిరిజనుల జీవితాల్లో ప్రగతిని తీసుకువచ్చేందుకు టీచర్లు పాటుపడాలని సూచించారు. ఈ సందర్భంగా 25 ఏళ్ళ సర్వీసును పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులను మంత్రి బాలరాజు సన్మానించారు. ట్రైటా అధ్యక్షుడు టి.రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ట్రైటా ప్రధాన కార్యదర్శి బి.సీతామనోహర్‌రావులతో పాటు పలువురు పాల్గొన్నారు.
Take By: T News
Tags: Telangana News, Jobs, Notification, Govt Jobs, Full Time, Part Time, Job News, ryk, AP, TET, APTET, Kirankumar Reddy,
0 comments:
Post a Comment