భలే.. షేరింగ్!
ఏ వస్తువైనా దొరికితే ఏం చేస్తాం. మన దగ్గరే ఉంచేసుకుంటాం. అది మన
ఫ్రెండ్‌కు ఇష్టమైతే.. అందులో షేర్ ఇస్తాం. అయితే ఇక్కడ కొన్ని రామచిలుకలు
కూడా షేరింగ్‌లో ముందున్నాయి. ఎందులో అనుకుంటున్నారు.. చాక్లెట్
మిల్క్‌షేక్‌ని తాగడంలో.
ఇది నిజం! ఆస్ట్రేలియాలోని ఓ కేఫ్‌లో తల్లీ
కూతుళ్లు మిల్క్ షేక్ ఆర్డరిచ్చారు. తల్లి ఏదో పని మీద పక్కకు వెళ్లింది.
ఈలోపు వెయిటర్ మిల్క్ షేక్ తీసుకొచ్చి మీద పెట్టి వెళ్లిపోయాడు.
అమ్మ కోసం
ఎదురు చూస్తుందా అమ్మాయి. ఇంతలో ఎక్కడి నుంచో వచ్చింది ఓ రామచిలుక మిల్క్
షేక్‌ని కొద్దిగా సిప్ చేసింది. ఆ తర్వాత వింతగా శబ్దాలు చేయడం మొదలు
పెట్టిందట. ఈలోపు మూడు, నాలుగు రామచిలుకలు వచ్చిచేరాయి. ఐదు నిమిషాల్లో
వాటి సంఖ్య ఏకంగా 30కి చేరింది. పదినిమిషాల్లో అన్నీ కలిపి మిల్క్ షేక్‌ని
గుటుక్కుమనిపించాయి చుక్క కూడా మిగల్చకుండా.
ఇదంతా చూసిన ఆ తల్లీ కూతుళ్లు
వాళ్ల సెల్‌ఫోన్లో వాటి ఫోటోలను బంధించేశారు. భలే విచివూతంగా ఉంది కదూ!
ఇలాంటి సంఘటనలు అక్కడ మామూలే అని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.
0 comments:
Post a Comment