మంచి రాక్షసుడు
భీకరారణ్యంలో ఓ మర్రిచెట్టు. దాన్ని ఆశ్రయించి ఎన్నో భూత, ప్రేత పిశాచాలు.
అక్కడే ఓ బ్రహ్మరాక్షసుడు తన నివాసాన్ని ఏర్పరుచుకున్నాడు. అడవిలో ఎన్నో
ఔషధాలు ఉండడం మూలన్నేమో వాటి గాలి సోకి ఆ బ్రహ్మరాక్షసుడు కాలక్షికమేణా
తాను వికృతాకారం నుంచి విముక్తి పొందాలనే మంచి ఆలోచన కలిగింది. ఎవరైనా తనకు
సన్మార్గం చూపే వాళ్లుంటారేమోనని అన్వేషిస్తుంటే శాపక్షిగస్తురాలైన ఓ పులి
అటుగా వచ్చింది. దాని కళ్లలోని నిర్మలత్వాన్ని గమనించి ఆ
బ్రహ్మరాక్షసుడిలా అన్నాడు. ‘ఓ వ్యాఘ్రేశ్వరా! నాకీ జన్మ నుంచి విముక్తి
కలిగే మార్గం చెప్పగలవా?’అని! ‘పూర్వ జన్మల దుష్కర్మలే ఈ వికృత జన్మలకు
హేతువు. నీవు పూర్వజన్మలో సద్భ్రాహ్మణునిగా పుట్టి నీకు వచ్చిన విద్యను
ఎవరికీ అందించకుండా సమాజ శ్రేయస్సుకు వినియోగించకుండా నీ వద్దనే
ఉంచుకున్నావు. ఆ దోష కారణంగా నీవిప్పుడు బ్రహ్మరాక్షసుడవయ్యావు. ఏదైనా మంచి
పనిచేస్తే నీకు విముక్తి కలుగుతుంది’అని చెప్పింది పులి.
అది విని
ఆ బ్రహ్మరాక్షసుడిలా అన్నాడు.. ‘జంతువై ఇంత జ్ఞానం ఎలా సంపాదించావు?’ .
దానికి పులి.. ‘నేను సద్గురువును అధిక్షేపించడం వలన ఈ రూపాన్ని పొందాను.
ఏదైనా సత్కార్యం చేద్దామని ఎంతో ప్రయత్నించాను. కానీ ఈ రూపాన్ని చూసి ఎవరూ
నా దగ్గరకైనా రావడం లేదు. ఇప్పుడు నీవేదైనా సత్కర్మ చేస్తే ఆ పుణ్యంతో
నీవు, నీచేత సత్కర్మ చేయించినందుకు నేను ఇద్దరం బయటపడతాం’అని అన్నది.
సత్కర్మ
చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్న ఆ బ్రహ్మరాక్షసునికి ఓ ఆగంతకుడు కనిపించాడు.
తనని ఆ రూపంలో చూస్తే భయపడతాడని ఓ సాధువు వేషంలో ఆ బాటసారి వద్దకు పోయి
యోగక్షేమాలు విచారించాడు. అతను తన విచారాన్ని.. ‘ఒక వంద వరహాలు కావాలి. ఎలా
సంపాదిద్దామా అని ఆలోచిస్తున్నాను’అని తెలిపాడు. ఆ రత్నాలతో ఏమిచేస్తావని
ఆత్రుతగా అడిగాడు బ్రహ్మరాక్షసుడు. ‘రాజకుమారిని పెళ్లాడాలి’అన్నాడు
అగంతకుడు. పెళ్లికి రత్నాపూందుకని ప్రశ్నించగా.. ‘ఆ ఎక్కడో హిమవత్ పర్వతాల
దగ్గర ఏవో రత్నాలున్నాయట. అవి తేస్తేగానీ పెళ్లి చేయరట. ఈ దండకారణ్యంలో
ఎందరో యోగులు, బ్రహ్మరాక్షసులు ఉంటారని విని వాళ్ల ద్వారా ఆ రత్నాలు
సంపాదిద్దాం అని ఇక్కడికి వచ్చాను’అన్నాడు బాటసారి. ‘ఏ రాజకుమారి? అవంతీ
రాజకుమారేనా?’అని ప్రశ్నించాడు ఆ బ్రహ్మరాక్షసుడు. ‘అవును.. నీకెలా
తెలుసు’అన్నాడు బాటసారి.
‘అది వీర శుల్కం. వరుని ధైర్య సాహసాలు,
వీరత్వం పరీక్షించడానికి నియమం. పైగా వారడిగినది 50 రత్నాలే కదా?’అన్నాడు
రాక్షసుడు. ‘వాళ్లకంతా ఇచ్చేస్తే మరి నా భార్య పిల్లలకో..’అన్నాడు బాటసారి.
‘ఓరి దుర్మార్గుడా! రాజ్యాన్ని, రాకుమారిని మోసగిద్దాం అనుకున్నావా?
నీలాంటి దేశవూదోహికి సహాయపడి నేనింకా పాపం మూట కట్టుకోలేను’అని అనుకొని
అమాంతంగా ఆ బాటసారిని మింగేశాడు ఆ బ్రహ్మరాక్షసుడు. తక్షణమే పులిగా శాపం
పొందిన శిష్యుడు నరరూపంలో ప్రత్యక్షమయ్యాడు. రాక్షసుడు కూడా మానవ రూపం
ధరించాడు. ‘మివూతమా! దుష్టుడైన దేశవూదోహిని సంహరించి రాజ్యాన్ని కాపాడిన
నీకు, నాకు ఆ దేవుడు శాప విమోచనం కలిగించాడ’ని అన్నాడు. ఇద్దరూ ఎంతో
సంతోషపడ్డారు.
0 comments:
Post a Comment