ఖుష్బూ పై మరొక వివాదం
తమిళ నటి ఖుష్బూ మరొక వివాదంలో
చిక్కుకుంది. రీసెంట్ గా ఒక పబ్లిక్ ఫంక్షన్ కి ఖుష్బూ కట్టుకొచ్చిన చీర
ఆమెను వివాదంలోకి నెట్టింది. ఈ చీరపై రాముడు, హనుమంతుడితోపాటు
కొందరు దేవుళ్ళ బొమ్మలు ప్రింట్ చెయ్యబడి వున్నాయి.
ఈ సంఘటనపై హిందూ మక్కల్ కచ్చి తన
అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి చీర ధరించినందుకు క్షమాపణ చెప్పాలని
డిమాండ్ చేసింది. ఖుష్బూ కేవలం ప్రచారం కోసమే ఇటువంటి వివాదాస్పద అంశాలపై
ఎక్కువగా దృష్టి సారిస్తోందని మక్కల్ కచ్చి ఆరోపిస్తుంది.
0 comments:
Post a Comment