డ్రగ్స్ తరలిస్తూ దొరికిపోయిన నటుడు
- అభిషేక్, అతడి అనుచరుడు అరెస్ట్
- కారులో పది గ్రాముల కొకైన్ పట్టివేత.. టాలీవుడ్‌లో కలకలం
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 8 : అతడో నటుడు. టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్నా డు. ఆ గుర్తింపు వెనుక ఓ గ‘మ్మత్తు’ రహస్యం దాగి ఉంది! నటుడిగా స్థిరపడేందుకు అతగాడు మాదక ద్రవ్యాల దందా ఎంచుకున్నాడు! నాలుగేళ్లుగా సాగిస్తున్న ఈ దందాను ఎట్టకేలకు పోలీసు లు ఛేదించారు. వివరాలను పశ్చిమ మండలం డీసీపీ సుధీర్‌బాబు తన కార్యాలయం లో విలేకరులకు వెల్లడించారు. ఉత్తరవూపదేశ్‌కు చెందిన అభిషేక్ కుమార్(31) డిగ్రీ వరకు చదువుకున్నాడు. 1998లో తండ్రి మరణించడంతో అతడి కుటుంబం ఉత్తరవూపదేశ్ నుంచి హైదరాబాద్‌కు వలసవచ్చింది. ఈ కుటుంబానికి గోవాలో హోటల్ వ్యాపారం ఉంది.

సినిమాల్లో నటించాలన్న ఆశతో చిత్ర పరిక్షిశమ, క్లబ్, పబ్‌లు
తిరిగిన అభిషేక్‌కు 2007లో గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలించే
మల్హోత్ర (2008లో పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు)తో పరిచయం ఏర్పడింది.
అప్పటినుంచి అభిషేక్ డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడు. చిత్ర పరిక్షిశమకు చెందిన మరో ఇద్దరు నటులు భరత్, రఘు (వూపముఖ హీరో రవితేజ సోదరులు) అభిషేక్‌కు మంచి స్నేహితులు. చిత్ర పరిక్షిశమలో డ్రగ్స్ తీసుకునేవారి వివరాలు సేకరించిన అభిషేక్... గోవా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి సరఫరా చేసేవాడు. అతడు ‘ఎలా చెప్పను’, ‘నువ్వస్తానంటే నేనొద్దంటానా’, ‘డేంజర్’, ‘శశిరేఖ పరిణయం’, ‘గాయం’, ‘కాళిదాస్’, ‘గగనం’ వంటి పలు చిత్రాల్లో నటించాడు. గతనెల 29న అభిషేక్, అతని వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు(24) గోవా వెళ్లారు. తిరిగి ఈనెల 2న హైదరాబాద్‌కు వచ్చి.. నేరుగా ఎస్‌ఆర్‌నగర్‌లోని అభిషేక్ నివసిస్తున్న తిరుమల అపార్టుమెంట్‌కు వెళ్లారు.

శుక్రవారం అర్ధరాత్రి దాటిన
తర్వాత స్కోడాకారులో ఇంటి నుంచి అభిషేక్, శ్రీనివాసులు బయలుదేరారు. వారు
కొకైన్‌తో ఉన్నారన్న విషయం తెలుసుకున్న ఎస్‌ఆర్ నగర్ డిటెక్టివ్
ఇన్‌స్పెక్టర్ శంకర్ తన టీమ్‌తో నిఘా ఏర్పాటు చేశారు. శనివారం
తెల్లవారుజామున ధరమ్ ఖరమ్ రోడ్డులో అభిషేక్ కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా
అందులో ఒక్కో గ్రాము చొప్పున పది కొకైన్ పాకెట్లు (పది గ్రాములు) దొరికాయి.
దీంతో పోలీసులు.. అభిషేక్‌ను, శ్రీనివాసులను అదుపులోకి తీసుకొని
విచారిస్తున్నారు. విచారణలో అభిషేక్ కీలక సమాచారం వెల్లడించినట్లు
తెలిసింది. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిక్షిశమలో చాలా మంది ప్రముఖులకు
నాలుగేళ్లుగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అతడు ఒప్పుకున్నట్లు సమాచారం.
గ‘మ్మత్తు’ టాలీవుడ్!
హైదరాబాద్, డిసెంబర్ 8 (టీ మీడియా): టాలీవుడ్.. డ్రగ్స్‌కు మధ్య సంబంధం మరోసారి బయటపడింది. ఇన్నాళ్లూ మాదకవూదవ్యాలు కొంటూ టాలీవుడ్ స్టార్లు పట్టుబడగా ఈసారి ఏకంగా చిత్ర పరిక్షిశమలోని పలువురికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న నటుడు అభిషేక్ తన అనుచరుడితో దొరికిపోవడంతో చిత్రసీమలో కలకలం రేగింది. అతడు ఎవవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడో తెలుసుకునేందుకు పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.

గడిచిన రెండున్నరేళ్ల కాలంలోనే హైదరాబాద్‌లో పోలీసులు 25కు
పైగా డ్రగ్స్ గ్యాంగులను అరెస్టు చేసి, వారి నుంచి రెండున్నర కిలోలకు పైగా
కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మాదకవూదవ్యాలను వినియోగిస్తున్నవారి
సంఖ్య టాలీవుడ్‌లో పదుల్లోనే ఉంటుందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. అయితే,
విచారణలో నిందితులు టాలీవుడ్ నటుల పేర్లు చెప్పినంత మాత్రాన అవతలివారిని
అరెస్టు చేయలేమని పోలీసు అధికారులు అంటున్నారు. హీరో రవితేజ సోదరులు రఘు,
భరత్‌లు డ్రగ్స్ ఉపయోగిస్తారని సమాచారం ఉన్నా వాళ్లు కొకైన్‌ను
కొంటున్నపుడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న తర్వాతే కేసులు పెట్టిన
విషయాన్ని పోలీసులు గుర్తు చేశారు.
అభిషేక్ కొకైన్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా
దొరికిన నేపథ్యంలో టాలీవుడ్‌కు చుట్టుకున్న డ్రగ్స్ గుట్టు వెలుగులోకి
వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు డ్రగ్స్
కొంటూ దొరికినవారు మాత్రమే ఉన్నారని, ఈ సారి ఏకంగా టాలీవుడ్‌లోని
ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న నటుడు తమ చేతికి చిక్కాడని ఆ వర్గాలు
పేర్కొన్నాయి.
0 comments:
Post a Comment