ప్రభుత్వానికి పాలించే హక్కులేదు: జూపూడి,కోమట్‌రెడ్డి రాజీనామాను ఆమోదించిన గవర్నర్,ఇక ప్రత్యక్షపోరే : కోమట్‌రెడ్డి
రైతుల సమస్యల్ని పరిష్కరించలేని రాష్ట్ర ప్రభుత్వానికి పాలించే హక్కులేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత జూపూడి ప్రభాకరరావు అన్నారు. రాష్ట్రంలో కిరణ్ ప్రభుత్వం 6 నెలలకు మించి కొనసాగే అవకాశం లేదని జూపూడి జోస్యం చెప్పారు. రాష్ట్రాన్ని అగమ్యగోచరంగా మార్చిన ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతారని ఆయన అన్నారు.కోమట్‌రెడ్డి రాజీనామాను ఆమోదించిన గవర్నర్
మంత్రి కోమట్‌రెడ్డి వెంకట్‌రెడ్డి రాజీనామాను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. కోమట్‌రెడ్డి రాజీనామాను ఆమోదించాల్సిందిగా ఇవాళ మధ్యాహ్నం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గవర్నర్‌కు సీఫార్సు చేశారు. ఇక కోమట్‌రెడ్డి ప్రత్యక్ష పోరులో పాల్గొంటారని ఆయన అనుచరులు తెలిపారు.
ఎమ్మెల్యేల రాజీనామాలూ ఆమోదించాలి : నాగం
మంత్రి కోమట్‌రెడ్డి వెంకట్‌రెడ్డి రాజీనామాను ఆమోదించినట్లే ఎమ్మెల్యేల రాజీనామాలను కూడా స్పీకర్ ఆమోదించాలని నాగరం జనార్ధనరెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి పదవికి అడ్డు రాని భావోద్వేగాలు ఎమ్మెల్యే పదవి రాజీనామాలను ఆమోదించడంలో ఎందుకడ్డుస్తున్నాయని ఆయన నాగం ప్రశ్నించారు. స్పీకర్ రాజ్యాంఘాన్ని ఉల్లంఘించి ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని నాగం అన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన దాదాపు 101 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే రాజ్యాంగ సంక్షోభం వస్తుందనే భయంతోనే ఆమోదించడం లేదన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించుకుంటే ఈ సకల జనుల సమ్మె అవసరమే లేదని, జనాలు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదని నాగం అన్నారు.
వరంగల్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ
జిల్లా వ్యాప్తంగా బుధవారం సద్దుల బతుకమ్మను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. భారీ సంఖ్యలో మహిళలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొని బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ప్రతి మహిళ తాను తాయరు చేసిన బతుకమ్మలపై జై తెలంగాణ నినాదం, తెలంగాణ మ్యాపు కల్గిన ప్లకార్డునుంచడం గమనార్హం. హన్మకొండలోని పద్మాక్షమ్మ దేవాలయం ప్రాంతమంతా మహిళలతో సందడిగా మారింది. ఎవరిని కదిపినా జైతెలంగాణ అంటూ స్పందించారు. వచ్చే బతుకమ్మను తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటామనే విశ్వాసం మహిలల్లో కనిపించింది.
తెలంగాణపై ప్రధానికి బర్ధన్ లేఖ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సీపీఐ జాతీయ నాయకులు బర్ధన్ ప్రధాని మన్మోహన్‌కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ రాష్ట్రంలో సకల జనుల సమ్మె ప్రారంభించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. సమ్మె వల్ల రాష్ట్రంలో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయని ప్రధానికి బర్ధన్ తెలిపారు.
ఇక ప్రత్యక్షపోరే : కోమట్‌రెడ్డి
తన మంత్రి పదవికి చేసిన రాజీనామాను గవర్నర్ ఆమోదించడాన్ని కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని ఆయన చెప్పారు. మంత్రి పదవిని ఆమోదించినట్లే ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను కూడా ఆమోదించాలని కోమట్‌రెడ్డి స్పీకర్ కోరారు.
0 comments:
Post a Comment