కోమటిరెడ్డి రాజీనామా ఆమోదం
రాష్ట్ర ఓడరేవులు, మౌలిక సదుపాయాల కల్పనశాఖ మంత్రి కోమటిడ్డి వెంకట్‌డ్డి రాజీనామాను గవర్నర్ ఈఎల్‌ఎన్ నరసింహన్ ఆమోదించారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ప్రెస్ సెక్రటరీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కోమటిడ్డి రాజీనామాను ఆమోదించాలని సిఫారసు చేస్తూ సీఎం కిరణ్‌కుమార్‌డ్డి కూడా బుధవారం గవర్నర్‌కు లేఖ పంపించారు. దీంతో గవర్నర్ మంత్రి రాజీనామాను ఆమోదించినట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు కోమటిడ్డి నిర్వహించిన శాఖలను మరోమంవూతికి అప్పగించే వరకు సీఎం కిరణ్ చూస్తారని గవర్నర్ పేర్కొన్నారు. మంత్రి పదవికి కోమటిడ్డి చేసిన రాజీనామా ఆమోదం పొందినప్పటికీ, శాసనసభ సభ్యత్వానికి చేసిన రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు. స్పీకర్ ఇంకా ఆయన రాజీనామా లేఖపై నిర్ణయం తీసుకోలేదు. తన రాజీనామా ఆమోదించక పోతే పట్టుబట్టి ఆమోదింపజేసుకుంటానని కోమటిడ్డి ఇంతకు ముందే ప్రకటించారు.
ఇటీవల కోమటిడ్డి నేరుగా సీఎంపైనే విమర్శలు సంధించడం, సకలజనుల సమ్మెకు సంఘీభావం తెలుపుతూ ఇటీవల విద్యుత్ సౌధ వద్ద జరిగిన ఉద్యోగుల ఆందోళన కార్యక్షికమంలో అరెస్టు కావడం లాంటి చర్యలు సీఎంకు తలనొప్పిగా తయారయ్యాయనే వాదన వినిపిస్తోంది. మిగతా మంత్రులు కూడా రాజీనామాస్త్రాలు సంధించకుండా ఉండాలనే ఉద్దేశంతోనే సీఎం కోమటిడ్డి రాజీనామాను ఆమోదించాలని గవర్నర్‌కు సిఫరసు చేసినట్లు తెలిసింది. తెలంగాణ కోసం అంతకుముదు జూపల్లి కృష్ణారావు కూడా తన మంత్రి పదవిని త్యాగం చేసిన విషయం తెలిసిందే.
పదవులు గడ్డిపరకలే నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ముందు తమ పదవులు గడ్డిపరకలతో సమానమని కోమటిడ్డి వెంకట్‌డ్డి అన్నారు. కేవలం తెలంగాణ కోసమే కోమటిడ్డి తన పదవికి రాజీనామా చేశారని భావించటం లేదంటూ కేంద్ర మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి గులాంనబీ ఆజాద్ ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలపై బుధవారం ఆయన ఈ విధంగా స్పందించారు. తన మంత్రి పదవికి చేసిన రాజీనామాను ఆమోదించినందుకు కృతజ్ఞతలు తెలిపిన కోమటిడ్డి ఈనెల 8వ తేదీలోపు ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను కూడా ఆమోదించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 9వ తేదీ నుంచి ప్రజలతో కలిసి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లో దీక్ష చేపడతానని హెచ్చరించారు.
0 comments:
Post a Comment