23RD DAY SAMME UPDATES….23వ రోజుకు చేరిన సకలజనుల సమ్మె,ఏపీకి గ్యాస్ కేటాయించిన కేంద్రం,మద్యం డిపోల్లో సమ్మె ఉధృతం
ప్రత్యేక రాష్ట్రం కోరుతూ తెలంగాణ ఉద్యోగులు చేపట్టిన సకల జనుల సమ్మె 23వ రోజుకు చేరింది. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 17వ రోజుకు చేరింది. నేటి నుంచి సమ్మెకు మద్ధతుగా ఎకై్సజ్ ఉద్యోగులు విధులు బహిష్కరించనున్నారు. మద్యం తయారీ సంస్థలు, డిపోలు మూయనున్నారు.
సీఎంతో డీజీపీ భేటీ
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో క్యాంపు కార్యాలయంలో డీజీపీ దినేష్‌రెడ్డి భేటీ అయ్యారు. భేటీలో శాంతి భద్రత సమస్యలపై చర్చిస్తున్నట్లు సమాచారం.
ఏపీకి గ్యాస్ కేటాయించిన కేంద్రం
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విన్నపం మేరకు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ఏపీకి గ్యాస్ కేటాయించారు. 1.5 ఎంఎంఎస్‌సీడీ గ్యాస్ విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో 330 మెగావాట్ల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది.
మద్యం డిపోల్లో సమ్మె ఉధృతం
సకల జనుల సమ్మెకు మద్ధతుగా మద్యం డిపోల్లో తెలంగాణ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మద్యం డిపోలకు తాళాలు వేశారు. తెలంగాణ వచ్చేంత వరకు తమ సమ్మె కొనసాగుతుందని ఎకై్సజ్ జేఏసీ తెలిపింది. నిజామాబాద్ జిల్లా మాక్లురు మండలం మాదాపూర్‌లో ఉన్న ఐఎంఎల్ డిపోకు తాళం వేసి నిరసన తెలుపుతున్నారు. ఆదిలాబాద్‌లోని ఊట్నూర్‌లో ఉన్న మద్యం డిపోకు తెలంగాణ ఉద్యోగులు తాళం వేశారు.
0 comments:
Post a Comment