ప్రణబ్‌పై మండిపడ్డ ఎంపీ విజయశాంతి,11న మళ్లీ ఢిల్లీ టూర్: కేసీఆర్,తెలంగాణ ఇవ్వకపోతే మనుగడ కష్టం:యాష్కీ
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే సమస్యలు వస్తాయి అని ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ విజయశాంతి మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో ముడిపెట్టి తెలంగాణ సమస్యను నాన్చొద్దని ఆమె హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే కాంగ్రెస్‌ను నిమజ్జనం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదన్నారు. ఎన్డీఏనే తెలంగాణ ఇస్తుందన్నారు.11న మళ్లీ ఢిల్లీ టూర్: కేసీఆర్
ఈనెలలోనే మళ్లీ ఢిల్లీ యాత్ర ఉంటుందని టీఆర్‌ఎస్ కె. చంద్రశేఖరరావు తెలిపారు. హైదరాబాద్‌కు బయలుదేరేముందు ఆయన బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఈనెల 11న ఢిల్లీ వచ్చి కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఏకే ఆంటోనీలను కలుస్తానని చెప్పారు. వీరు అందుబాటులో లేకపోవడంతో కలవలేకపోయానని కేసీఆర్ తెలిపారు. జేఏసీ ప్రతినిధులు తీసుకొచ్చే విషయంపై ఇంకా ఏమీ అనుకోలేదని చెప్పారు.
ప్రణబ్ వ్యాఖ్యల్లో కొత్తదనం లేదు: వినోద్
కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నట్టు భావించడం లేదని టీ ఆర్‌ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ అన్నారు. ప్రణబ్ చరిత్రను ఉటంకించారని చెప్పారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో దేశ సమగ్రతకు ఎలాంటి భంగం కలగదని గతంలోనే చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణ ఇవ్వనంతమాత్రాన కొత్త రాష్ట్రాల డిమాండ్‌లు ఆగిపోతాయా అని వినోద్ ప్రశ్నించారు. ప్రణబ్ వ్యాఖ్యల్లో కొత్తదనమేమీ లేదన్నారు.
తెలంగాణ ఇవ్వకపోతే మనుగడ కష్టం:యాష్కీ
తెలంగాణ ఇస్తే కొత్త రాష్ట్రాల డిమాండ్లు వస్తాయన్న సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంపీ మధుయాష్కీ అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇవ్వకపోతేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మనుగడ కష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అంశానికి, వేరే డిమాండ్లకు పోలిక లేదన్నారు.
0 comments:
Post a Comment