హయాది నగర్
దో మినార్..
పేరు హయాత్ బక్షీ మసీదు..
నగర శివారులో ఉన్న మరో మక్కా ఇది.
కాలంతో కనుమరుగై.. చరివూతలో సమాధి అయింది.
హయాత్‌కు ఆయుష్షుకు సంబంధం ఉంది.
ఆ యాదితో ఆయుష్షు పోసే ప్రయత్నమే ఈ వాహ్.. హైదరాబాద్.
తొమ్మిదో నంబర్ జాతీయ రహదారి..
టీచర్స్‌కాలనీ, ఆర్టీసీ కాలనీ, లెక్చరర్స్ కాలనీ...
తర్వాత ఆటో నగర్. ఆర్టీసీ కాలనీలో ఆ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులే ఉంటారు. అలా అని ఆటోనగర్‌లో ఆటోడ్రైవర్లు ఉండరు. దేశవ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్‌లో ఇదో పేరెన్నికగల ప్రాంతం. వాహనాల స్పేర్‌పార్ట్స్, మాడిఫికేషన్, రిపేరింగ్.. అన్నింటికీ ఇది కేరాఫ్ అడ్రస్. రకరకాల వాహనాలతో నిత్యం రద్దీగా ఉంటుంది ఈ ప్రాంతం. ఆటోనగర్‌కు ‘ఆటోవాలా’కు ఎలాంటి సంబంధం లేకున్నా ఆప్రాంతంలో అడుగుపెట్టగానే వాళ్లే దర్శనమిస్తారు. చిన్నచిన్న ఆర్డర్‌ల కోసం ఎదురు చూస్తూ బతుకుపోరు సాగిస్తుంటారు.
ఆటోనగర్ దాటిన తర్వాత వనస్థలి జింకలపార్క్. దీంట్లో ఈ మధ్యే జంతు ప్రతిమల ప్రదర్శనని ప్రారంభించారు. ఆ తర్వాత హయాత్‌నగర్. (హయత్‌నగర్‌గా వాడుకలో ఉంది) ఆయుష్షుకు హయాత్‌నగర్‌కు సంబంధమేమిటి? అని ఆలోచిస్తుండగా ఎన్‌హెచ్-9కు కుడివైపున అల్లంత దూరం నుంచి రెండు మినార్లు కనిపించాయి. వెళ్లిచూస్తే అదో పెద్ద మసీదు. ఐదెకరాల విస్తీర్ణం. మరో మక్కామసీదులా ఉంది ఆ ప్రాంతం. గోల్కొండలోని కుతుబ్‌షా మసీదుని గుర్తుకు తెస్తుంది ఆ నిర్మాణం. హైదరాబాద్ శివారులో ఇలాంటి ఓ చారివూతాత్మక కట్టడం ఉందని చాలామందికి తెలియదు.
దీన్ని ఎవరు నిర్మించారు? ఎప్పుడు కట్టారు? ఎందుకు కట్టారు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం లోపలికి వెళ్లాను.. మధ్యాహ్నం ‘నమాజ్’ నడుస్తోంది. ఆ ప్రార్థనలు అయిపోగానే స్థానికులతో కాసేపు మాట్లాడితే విషయం తెలిసింది.
బేగం నజరానా
గోల్కొండ సుల్తాన్ వంశస్థురాలు హయాత్‌బక్షీ బేగం. కులీకుతుబ్ షా వంశస్థుల్లో నాలుగో కుతుబ్ మహ్మద్ కులీ ముద్దుల కూతురు. ఒక ఆదర్శ మహిళ. సుల్తానులకు రాజకీయ సలహాదారుగా కీలకపాత్ర పోషించింది. మహ్మద్‌కులీ ఆమెను తన మేనల్లుడు సుల్తాన్ మహమ్మద్‌కు ఇచ్చి వివాహం చేశాడు. ఆయన ఐదో కుతుబ్‌గా రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ తర్వాత వీరి కుమారుడు అబ్దుల్లా కులీ కుతుబ్ రాజ్యాధికారం చేపట్టాడు. గోల్కొండ సామ్రాజ్యం నుంచి రాజ్యపాలన చేసిన ఈ ముగ్గురు నవాబుల వెనక బక్షీ ఉండేది. శత్రువుల దాడిని పసిగట్టి ముందస్తు ప్రణాళిక రచించడంలో ఆమె దిట్ట. ఔరంగాజేబు గోల్కొండపై దండయాత్ర చేసిన సమయంలో ‘చుట్టరికం’ చేసుకుందామని చర్చలు జరిపింది. ఆమె జరిపిన చర్చలు ఆ యుద్ధవాతావరణాన్నే మార్చేశాయి. యుద్ధంలో ఓడిపోయే ప్రమాదముందని ముందుగానే పసిగట్టి ఆమె పక్కా ప్రణాళికతో రంగవూపవేశం చేసింది. తండ్రి, భర్త, కుమారుడు... వీరి కాలంలో ఇటువంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. జ్యోతిష్యులు చెప్పిన మాటల ప్రకారం.. సుల్తాన్ మహమ్మద్ 12 సంవత్సరాల పాటు తన కొడుకును చూడలేదట. అప్పుడు హయాత్‌బక్షీ అన్నీ తానై అబ్దుల్లాను పెంచింది. ఓ సారి ఎవరికీ కనిపించకుండా పోయాడు. అబ్దుల్లా కోసం అందరూ వెతుకుతుండగా ఒక వృద్ధుడు తీసుకొచ్చి బక్షీకి అప్పగించాడట. అప్పుడు తన కుమారుడికి ఆయుష్షు ప్రసాదించినందుకు ఏం కావాలో కోరుకొమ్మని బేగం అడిగిందంట. అందుకు ఆ వృద్ధుడు ‘హైదరాబాద్‌కు తూర్పున ఒక పెద్ద మసీదును నిర్మించా’లని కోరాడట. అలా సుల్తాన్ మహమ్మద్ కాలంలో ఈ మసీదును నిర్మించారు. అప్పట్నుంచి దీనిని హయాత్‌బక్షీ మసీదుగా.. ఈ ప్రాంతాన్ని హయాత్‌నగర్‌గా పిలుస్తున్నారు.
ఏనుగుల బావి
అరబ్ నిర్మాణశైలిలో ఉన్న ఈ మసీదుకు ఐదు ఆర్చ్‌లు, రెండు మినార్‌లు ఉన్నాయి. మధ్యలో ప్రార్థనలు చేయడానికి ప్లాట్‌ఫారమ్‌లా హాలు ఉంది. దీనికి తూర్పున కింది భాగంలో నీటి ట్యాంకు ఉంది. మసీదు చుట్టూ 140 ఆర్చ్‌ల్లాంటి గదులున్నాయి. వీటిని సరాయ్‌లు అని పిలుస్తారు. ఈ సరాయ్‌లు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. మసీదుకు ఎడమవైపునున్న సరాయిల పక్కన పెద్దబావి ఉంది. దీన్ని ‘హథీబౌలీ’ అని పిలుస్తారు. హథీ అంటే ఏనుగు. బౌలీ అంటే బావి. మసీదు కింద పెద్ద తోట ఉండేది. ఏనుగుల ద్వారా నీటిని తోడించి తోటకు నీళ్లు మళ్లించేవారట. అందుకే దీనికి హథీబౌలీ అనే పేరొచ్చింది. ప్రస్తుతం ఈ మసీదు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఒకవూపాంత చరివూతకు సాక్షిగా నిలుచున్న ఈ కట్టడం పరిరక్షణకు పురావస్తు శాఖ కృషి చేయాల్సిన అవసరం ఉంది.
రింగురోడ్డులా..
హయత్‌నగర్ చుట్టున్న ప్రాంతాల పేర్లపై కూడా గోల్కొండ సుల్తాన్‌ల ప్రభావం ఉన్నట్లు అనిపిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు వలయంలా పరుచుకున్న అబ్దుల్లాపూర్‌మెట్ హయాత్ కుమారుడు అబ్దుల్లా పేరు మీద ఏర్పడింది. బక్షీ మసీదు ప్రేరణతో మజీద్‌పూర్, రాజనర్తకి తారామతి పేరుతో తారామతిపేట, అనాజ్‌పూర్, లష్కర్‌గూడ, జాఫర్‌గూడ వంటి గ్రామాలు మరికొన్ని ఉదాహరణలు. హయత్‌నగర్ దాటాక ఎన్‌హెచ్-9కు కుడిపక్కన ‘సంఘీటెంపుల్’ ఉంది. దాని పక్కనే రామోజీ ఫిల్మ్ సిటీ. పేదల భూములు కొట్టి పెద్దలకు పంచిపెడితే పుట్టిందే ఈ సిటీ.. సంఘీనగర్. భళేమంచి చౌకబేరం దొరికిందని ఐదు, పదికే వేల ఎకరాలు కొల్లగొట్టి.. రైతులను కూలీలుగా మార్చిన స్థావరాలివి. ఫిల్మ్‌సిటీ నుంచి వస్తుండగా ఔటర్‌రింగ్‌రోడ్‌పై వడ్ల ధాన్యం ఆరబోసిన రైతులు కనిపించారు. వారిని పలకరిస్తే అధికారుల అన్యాయం, పాలకుల పాపం తెలిసొచ్చింది. రింగ్‌రోడ్‌లో భాగంగా బంగారు భూములు కోల్పోయిన రైతులు వారు. ఎకరం, రెండెకరాలే ఉన్నప్పటికీ అంతా రోడ్డు పాలు అయింది. ఎకరం పదహారు లక్షలకు అమ్ముకున్నారు కానీ.. వారికి సగం డబ్బులు ముట్టాయి. మిగిలిన డబ్బుల కోసం.. ధర్నాలు, ముట్టడిలు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రోడ్డులో వడ్లు ఆరబోసిన చోటే వారి ‘కళ్లం’ ఉండేదేమో.. పూర్తిగా నష్టపరిహారం పొందలేదు కాబట్టి నడిరోడ్డుపై వడ్లతో నిరసన చేసే హక్కు వారికుంది కదా! అనిపించింది. హయత్‌నగర్ చుట్టుపక్కల ప్రజల బతుకులు రింగ్‌రోడ్డులా గింగిరాలు తిరుగుతున్నట్లు అనిపించింది. రియల్‌ఎస్టేట్ వారి కొంప ముంచింది. ప్రభుత్వం కోట్ల ఆశచూపి.. కోర్టుల చుట్టూ తిప్పుకుంటోంది.
మిగిలింది మసీదే..
చారివూతక కట్టడమైన హయాత్ బక్షీ బేగం మసీదు కింద ఉన్న భూమినంతా కోల్పోయాం. ఇక మిగిలింది ఈ మసీదే. దీనై్ననా రక్షించుకోవాలనేదే మా ఆకాంక్ష. 2000 మంది నమాజ్ చేసుకునేందుకు ఇక్కడ అవకాశం ఉంది. ప్రస్తుతం పురావస్తు శాఖ దీని వ్యవహారాలు చూసుకుంటోంది. ఇంతకు ముందు వక్ఫ్‌బోర్డ్ కింద ఉండేది. మసీదులోని సరాయి గదులు, మసీదు మినార్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాబట్టి వాటిని పునరుద్ధరించాలి. అందుకయ్యే నిధులను మంజూరు చేయాలి. గతంలో కొంత అభివృద్ధి జరిపినప్పటికీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది.

- మీర్జా సలీమ్ బేగ్
హయాత్‌బక్షీ బేగం మసీదు అభివృద్ధి సంస్థ అధ్యక్షుడ

0 comments:
Post a Comment