ఖరీఫ్‌లో ఇదీ ఆంధ్రా దొపిడీ తరీఖా
- సీమాంవూధకు 350 టీఎంసీలు.. తెలంగాణకు 100 టీఎంసీలు
- పాలమూరుకు దక్కింది 11 టీఎంసీలే.. సీమాంధ్ర జల దోపిడీకి తాజా సాక్ష్యం
- సాగర్, శ్రీశైలం నీళ్లు పారేది అటే.. రబీకి మరో 200 టీఎంసీలూ సిద్ధం
- బీళ్లవుతున్న తెలంగాణ చేలు.. ఖరీఫ్‌లో ఎండిన పంటలు
- రబీకి నీళ్లివ్వలేమన్న సర్కార్.. సీమాంవూధకు మాత్రం సరఫరా
మా నీళ్లు మాగ్గావాలె! ఇది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష వెనుక ఉన్న కీలక డిమాండ్! తెలంగాణలో కట్టిన జలాశయాల నుంచి సీమాంవూధకు నీళ్లు తరలించుకుపోతున్నారంటూ దశాబ్దాలుగా ఇక్కడి రైతు పెడుతున్న ఘోష! ఎప్పటికప్పుడు ఈ జల దోపిడీ సాగుతూనే ఉంది! ఈ ఖరీఫ్ సీజన్ కూడా నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి జల దోపిడీకి, తెలంగాణ ప్రాంత రైతుల పట్ల వివక్షకు నిదర్శనంగా నిలిచింది! కృష్ణా నికరజలాల నుంచి ఈ ఖరీఫ్ సీజన్‌లో సీమాంధ్ర రైతులు 350 టీఎంసీల నీటిని వినియోగిస్తే.. తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలకు లభ్యమైనది కేవలం 100 టీఎంసీలు! అంటే తెలంగాణ తన వాటా ప్రకారం 48 టీఎంసీలు కోల్పోతే.. కోస్తాంధ్ర తన వాటాకు మించి 19 టీఎంసీలు, రాయలసీమ తన వాటాకు రెట్టింపు నీళ్లు పొందాయన్నమాట! అంతే కాదు.. రబీ సీజన్‌లోనూ తెలంగాణ రైతుకు సున్నమే మిగలనుంది! తెలంగాణకు రబీకి నీళ్లందించలేమంటూ అనేక కారణాలు చెబుతున్న సీమాంధ్ర సర్కారు... సీమాంధ్ర ప్రాంతానికి మాత్రం 200 టీఎంసీలు పారించేందుకు ప్రయత్నాలు చేస్తోంది!
(టీ న్యూస్8, నల్లగొండ, మహబూబ్‌నగర్)ఖరీఫ్ సీజన్‌లో కృష్ణా జిలాల పంపిణీలో సీమాంధ్ర, తెలంగాణ రైతుల పట్ల భారీ వివక్షను చూపింది కిరణ్‌కుమార్‌డ్డి ప్రభుత్వం. ఈ ఖరీఫ్ సీజన్‌లో 350 టీఎంసీల నీటిని సీమాంవూధకు తరలించగా.. తెలంగాణకు దక్కింది మాత్రం 100 టీఎంసీలు మాత్రమే! ఇది చాలదన్నట్లు నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్ల నుంచి రబీకి తరలించనున్న 250 టీఎంసీల నీటిలో ఆంధ్ర ప్రాంత ఆయకట్టుకే 200 టీఎంసీలు పారించే ప్రయత్నాల్లో సీమాంధ్ర సర్కారు ఉంది. నిజానికి కృష్ణానదీ జలాల్లో మొత్తం రాష్ట్రానికి నికరజలాలు ఏడాదికి 811 టీఎంసీలు. ఇందులో తెలంగాణ ప్రాంతం వాటా 297 టీఎంసీలు. కోస్తాంధ్ర వాటా 362 టీఎంసీలు, రాయలసీమ వాటా 152 టీఎంసీలుగా ఉంది. అయితే ప్రస్తుతం ఆరు నెలలకు లెక్క వేస్తే.. తెలంగాణకు ఖరీఫ్‌లో 148 టీఎంసీలు రావాల్సి ఉంది. కోస్తాంవూధకు 181 టీఎంసీలు, రాయలసీమకు 76 టీఎంసీలు పారాల్సి ఉంది. కానీ.. 181 టీఎంసీల వాటా ఉన్న కోస్తాంవూధకు 200 టీఎంసీలు పారాయి.
76 టీఎంసీలు వాటా కలిగిన రాయలసీమకు ఇప్పటికే 195 టీఎంసీలు పారాయి. కానీ.. తెలంగాణకు మాత్రం ఈ ఖరీఫ్ సీజన్‌లో అందినవి కేవలం 100 టీఎంసీలే! అంటే రావాల్సినవాటిలో 48 టీఎంసీలు రాకుండా పోయాయన్నమాట. అంటే ఒక టీఎంసీ నీటితో పది వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందనుకుంటే.. తెలంగాణకు ఈ సీజన్‌లో 4.8 లక్షల ఎకరాలకు నీరందలేదన్నమాట. పైగా.. వేర్వేరు కారణాలు చూపుతూ రబీ సీజన్‌కు తెలంగాణ ప్రాంతానికి నీరిచ్చేది లేదని ప్రభుత్వం తెగేసి చెబుతున్నది. అంటే నికరంగా తెలంగాణ ఈ ఏడాది కోల్పోతున్నది 196 టీఎంసీలన్నమాట! ఓవైపు తెలంగాణకు నిర్బంధ క్రాప్‌హాలిడే విధించి.. నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్ల నుంచి నీటిని సీమాంధ్ర సర్కారు తన ప్రాంత రైతులకు దోచిపెడుతున్నది.
తెలంగాణ భూములను పడావు పడేసి.. సీమాంధ్ర ప్రయోజనాలను పరిరక్షిస్తున్నది. ఈ క్రమంలోనే రబీకి కూడా సీమాంధ్ర ప్రాంతానికి 200 టీఎంసీల నీటిని తరలించేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తున్నదని నిపుణులు విమర్శిస్తున్నారు. పడావు పడిన తెలంగాణ ఈ ఖరీఫ్ సీజన్‌లోనే సీమాంధ్ర పాలకుల కుటిల నీతి వల్ల పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కేవలం 100 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించారు. ఫలితంగా రబీ సీజన్‌లో దాదాపు నాలుగు లక్షలపైచిలుకు ఎకరాల భూమికి నీరందలేదు. ఇందులో లక్షన్నర భూమి పడావు పడగా, మిగతా భూమిలో వేసిన పంటలు ఎండిపోయాయి. అధికారుల లెక్కల ప్రకారం వాస్తవంగా సాగర్ ఎడమ కాలువ కింద మూడుజోన్లకు కలిసి 9.50 లక్షల ఎకరాల స్థిరీకరణ ఆయకట్టు ఉండగా, ఖమ్మం, నల్లగొండ జిల్లాలో 6.05 ఎకరాల స్థిరీకరణ ఆయకట్టు ఉంది. ఈ రెండు జిల్లాల్లో ఖరీఫ్ సీజన్‌లో కేవలం 3.78 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. ఇందులోనూ లక్ష ఎకరాల పంట నీరు అందక ఎండిపోయింది.ఎలిమినేటి మాధవడ్డి ప్రాజక్టు కింద 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా కేవలం 1.50 లక్షల ఎకరాలు మాత్రమే సాగు చేశారు. ఇందులో 70 వేల ఎకరాల్లో పంట ఎండిపోయింది. సాగర్ ప్రాజెక్టులో నిండుగా నీరున్నా రాష్ట్ర ప్రభుత్వం రబీకి నీరు ఇవ్వలేమని చెప్పింది. దీంతో ఇప్పటికే ఖరీఫ్‌లో పంటపూండిపోయి కుదేలైన రైతాంగం నెత్తిన పిడుగుపడినట్లయింది.
ఆర్డీస్8 అంతా భ్రమ
రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్8) ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లోని 87,480 ఎకరాల ఆయకట్టుకు 15.9 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. కానీ.. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో ఆగస్టు 21వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో 3.86 టీఎంసీల నీటిని మాత్రమే ఆర్డీఎస్8 ప్రాజెక్టు నుంచి జిల్లాలోని రైతులకు విడుదల చేశారు. దీంతో పాతిక వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే, మన రాష్ట్రానికి వచ్చే సరికి కేవలం 12 వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరు లభ్యమవుతోంది.
జూరాల నీరు ఎవరి కోసం?
మహబూబ్‌నగర్‌లోని జూరాల ప్రాజెక్టు నుంచి జిల్లాలోని కుడి, ఎడమ కాలువలకు కలిపి 1,04,741 ఎకరాలకు 11.98 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉన్నది. ఎడవ కాలువ ద్వారా ఐదు మండలాల్లోని 69,082 ఎకరాలకు, కుడి కాలువ ద్వారా నాలుగు మండలాల్లోని 35,657 ఎకరాలకు నీరు ఇవ్వాల్సి ఉన్నది. ఆగస్టు రెండో వారం నుంచి ఆయకట్టుదారులకు నీరు విడుదల చేశారు. ఆగస్టులో 2.21 టీఎంసీలు, సెప్టెంబర్‌లో 2.66 టీఎంసీలు, అక్టోబర్‌లో 3.77 టీఎంసీల నీటిని విడుదల చేశారు. నవంబర్‌లో 2.53 టీఎంసీలు, డిసెంబర్‌లో 15 రోజుల కోసం 0.885 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించారు.
పోతిడ్డ్డిపాడుతో వట్టిపోతున్న శ్రీశైలం
ఏ కేటాయింపులు లేని పోతిడ్డిపాడు ద్వారా రాయలసీమకు మూడు నెలలుగా ప్రతి రోజూ 50 వేల క్యూసెక్కుల నీరు తరలిస్తున్నారని సమాచారం. ఇప్పటి వరకు150 టీఎంసీల నీటిని తీసుకు జూలై, ఆగస్టులో వచ్చిన భారీ వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు నిండిపోయింది. ఈ ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్ధ్యం 308 టీఎంసీలైతే, ప్రస్తుతం 167 టీఎంసీల నీరు మాత్రమే ఉంది.దీంతో ఈ ఏడాది అప్పుడే వట్టిపోతోంది.
కేటాయింపులు లేకున్నా సాగర్ నీళ్లన్నీ ఆంధ్రకే
ఈ ఏడాది జూలై, ఆగస్టులో కురిసిన వర్షాలతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ నిండింది. సాగర్ గేట్లు ఎత్తడం ద్వారా ఈ ఖరీఫ్ సీజన్‌లో సుమారు 203 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. ఇది కాకుండా కుడి కాలువ ద్వారా 103 టీఎంసీలు, సాగర్ ప్రాజెక్టు పవర్ హౌజ్ ద్వారా కృష్ణా డెల్టాకు 67 టీఎంసీలు, ఎడమ కాలువ ద్వారా మూడో జోన్‌కు 25 టీఎంసీల నీరు తరలించుకపోయారు. ప్రాజెక్టు కిందనున్న ఆంధ్ర ప్రాంత ఆయకట్టుకు 200 టీఎంసీల నీరు వినియోగించుకోగా, 200 టీఎంసీల నీరును సముద్రం పాల్జేశారు. సాగర్ ప్రాజెక్టు కింద ఎడమ కాల్వ ద్వారా నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు సుమారు 75 టీఎంసీల నీరు, ఎలిమినేటి మాధవడ్డి ప్రాజెక్టు ద్వారా మరో 15 టీఎంసీల నీరు మాత్రమే వినియోగించడం జరిగింది. మొత్తం నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో సాగర్ ప్రాజెక్టు నీటిలో కేవలం 90 టీఎంసీల నీరు మాత్రమే వినియోగమైంది. ఇదిలావుంటే ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టులో 550.80 అడుగుల (297టీఎంసీలు) నీరు ఉంది.
నిండుకుండలా సీమ రిజర్వాయర్లు
పోతిడ్డిపాడు ద్వారా ఇప్పటికే దాదాపు 150 టీఎంసీలను సీమాంవూధకు తరలించుకుపోయారు. శ్రీశైలంపై అధారపడి నిర్మించిన సోమశిల (78 టీఎంసీలు), కండలేరు (68 టీఎంసీలు), బ్రహ్మంగారి మఠం (30 టీఎంసీలు), వెలిగోడు (15 టీఎంసీలు), గండికోట (15 టీఎంసీలు) రిజర్వాయర్లను పోతిడ్డిపాడు ద్వారా నింపారు. శ్రీశైలం నుంచి మరో 50 టీఎంసీల నీరు రాయలసీమకు తరలించుకుపోయి రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన శ్రీశైలం ప్రాజెక్టును సీమాంధ్ర సర్కార్ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుగా మార్చేసింది. కృష్ణానీటిని దిగువకు రాకుండా అడ్డుకుంటోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టులోని కృష్ణానీటిని ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తూ నల్లగొండ, ఖమ్మం జిల్లాలను ఎండ బెడుతోంది.

0 comments:
Post a Comment