తెలంగాణను ఎస్సార్సీతో ముడిపెట్ట్టొద్దు
- ఆ డిమాండ్ ప్రత్యేకమైనది
- రెండో ఎస్సార్సీ ఇతర రాష్ట్రాల డిమాండ్ల కోసమే
- ఏఐసీసీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ వివరణ
న్యూఢిల్లీ, నవంబర్ 18 ():కొత్త రాష్ట్రాల ఏర్పాటు విషయంలో రెండో ఎస్సార్సీ వేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ అభివూపాయమైనప్పటికీ తెలంగాణ అంశం దీని పరిధిలోకి రాదని ఏఐసీసీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ స్పష్టం చేశారు. తెలంగాణ అంశాన్ని విడిగా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణతో సహా ఇతర చిన్న రాష్ట్రాల డిమాండ్లకు ఎస్సార్సీయే పరిష్కారం చూపిస్తుందని ఆయన గతంలో చేసిన ప్రకటనపై ఈ మేరకు వివరణ ఇచ్చారు. ఏఐసీసీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్తరవూపదేశ్ విభజనపై ఓ ప్రశ్నకు బదిలిస్తూ.. రాజకీయ ప్రయోజనాల కోసమే మాయావతి యూపీ విభజన అంశాన్ని లేవనెత్తారని విమర్శించారు. ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందే రాష్ర్ట విభజన అంశాన్ని ముందుకు తేవడాన్ని ఆయన తప్పుబట్టారు.
మాయావతి అధికారంలోకి ఉన్న ఐదేళ్లలో యూపీ భవిష్యత్తు, అభివృద్ధి గురించి పట్టించుకొనివుంటే చాలా బాగుండేదని విమర్శించారు. దేశంలో యూపీ తరహాలో మరికొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లున్నాయని, వాటన్నింటిని పరిశీలించేందుకు ఎస్సార్సీ వేయాలన్నది తమ పార్టీ అభివూపాయమని చెప్పారు. భాష, ఆర్థిక స్థితిగతులు తదితర అంశాలన్నింటితో సహా రాష్ట్రాల విభజన ఏ ప్రతిపాదికన జరగాలో కమిషన్ పూర్తి స్ధాయిలో సమీక్షించి ప్రభుత్వానికి నివేదిక అందించగలదని వివరించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అయితే తెలంగాణ అంశం ఈ పరిధిలోకి రాదని, దానిని ప్రత్యేకంగా చూడాలన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నట్లు తెలిపారు.

Take By: T News
Tags: Telangana News, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, Telangana agitation, statehood demand, Venkat Reddy,

0 comments:
Post a Comment