ప్రాణహిత గోస...!
- ముందుకు సాగని నిర్మాణ పనులు
- తెలంగాణ ప్రాజెక్టుపై కరడుగట్టిన నిర్లక్ష్యం
- అనుమతులు సాధించని రాష్ట్ర సర్కారు
- జాతీయ హోదాకు అన్నీ అడ్డంకులే
- మహారాష్ట్రతో పూర్తికాని చర్చల ప్రక్రియ
- నిధుల కొరతతో నిలిచిపోయిన పనులు
- తెలంగాణ ప్రాజెక్టుపై కరడుగట్టిన నిర్లక్ష్యం
- అనుమతులు సాధించని రాష్ట్ర సర్కారు
- జాతీయ హోదాకు అన్నీ అడ్డంకులే
- మహారాష్ట్రతో పూర్తికాని చర్చల ప్రక్రియ
- నిధుల కొరతతో నిలిచిపోయిన పనులు

హైదరాబాద్, అక్టోబర్ 27 (టీ న్యూస్) :తెలంగాణ ప్రాజెక్టులపై సర్కారు వివక్ష కొనసాగుతోందనడానికి ప్రాణహిత-చే ప్రాజెక్టు తాజా ఉదాహరణ. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడినప్పుడో, ఎన్నికల ముందో తెలంగాణ ప్రాజెక్టుల గురించి మాట్లాడే పాలకులు ఆ తర్వాత వీటి గురించి పట్టించుకోక పోవడం విషాదం. తెలంగాణ ప్రజల కలల పంటైన ప్రాణహిత-చే ప్రాజెక్టుకు కేంద్ర జల వనరుల సంఘం 2010 ఏప్రిల్‌లో సూత్రవూపాయ అనుమతినిచ్చింది. 18 నెలలు గడిచినా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తిస్థాయి అనుమతులను సంపాదించలేక పోయింది. ప్రధాన మంత్రి ప్రత్యేక కార్యక్షికమం కింద ప్రాణహిత ప్రాజెక్టుకు పూర్తి స్థాయి పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వమే పెట్టే విధంగా ప్రయత్నిస్తామని, ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా సంపాదించడానికి కృషి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ దిశగా ఎటువంటి ప్రయత్నాలను చేయక పోవడంతో తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరువు పీడిత తెలంగాణ ప్రాంతానికి తక్షణ అవసరమైన ప్రాణహిత-చే పట్టించుకోని సర్కారు... తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్ట్ కట్టి.. తెలంగాణ అటవీ ప్రాంతాలను జల సమాధి చేసి, గిరిజన జీవన విధ్వంసాన్ని సృష్టించి, సీమాంవూధకు నీళ్లు పారించే పోలవరానికి జాతీయ హోదా కల్పించేందుకు కిందికి మీదికి అవుతోందని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు.
జాప్యంతో పెరుగుతున్న అంచనా వ్యయం
ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇవ్వలేదు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి కోసం సవరించిన ప్రాజెక్టు నిర్మాణ రిపోర్టును గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం పంపింది. కేంద్ర జలవనరుల సంఘానికి చెందిన 16 విభాగాలతో పాటు పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకు చెందిన ఎనిమిది రకాల అనుమతులు, కేంద్ర ప్రణాళిక సంఘానికి చెందిన సవరించిన పెట్టుబడుల అనుమతులు పొందవలసి ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 17,875 కోట్లు ఖర్చవుతాయని మొదట అంచనా వేసి ప్పటికీ మొదటిసారి సవరించిన అంచనాల ప్రకారం 38,500 కోట్లకు పెరగగా 2007లో సవరించిన అంచనాల ప్రకారం 40,300 కోట్లకు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతి కూడా ఇచ్చింది. నిర్మాణంలో జరుగుతున్న జాప్యంవల్ల అంచనావ్యయం ఏటా పెరుగుతోంది.
కేంద్ర అనుమతిలో జాప్యం


జాతీయ హోదాతోనే సత్వరం పూర్తి
ప్రాణహితకు జాతీయ ప్రాజెక్టు హోదా లభిస్తే కేంద్రం 90% వాటాను, రాష్ట్రం 10% వాటాను భరించవలసి ఉంది. ప్రాణహిత ప్రాజెక్టు వ్యయం పోలవరం కన్నా రెట్టింపు ఉండడంతో ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా తీసుకుంటే త్వరగా పూర్తి చేసే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటికే 4 వేల కోట్లు ఖర్చు పెట్టగా ప్రాణహితపై కేవలం వెయ్యి కోట్లు రాష్ట్రవూపభుత్వం ఖర్చు పెట్టింది. 28 ప్యాకేజీలుగా విభజించిన ప్రాణహిత ప్రాజెక్టును రెండుదశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణ స్థలం నుంచి మధ్యమానేరు వరకు నిర్ణయించిన తొమ్మిది ప్యాకేజీ పనులను, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు నీరందించే ఐదు ప్యాకేజీలను రూ.24,000 కోట్ల వ్యయంతో నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఇటీవల నిర్ణయించింది. మిగిలిన 14 ప్యాకేజీల పనులను మరో ఏడేళ్ళకాలంలో పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత బడ్జెట్‌లో ఇప్పటి వరకు కేవలం 54 కోట్ల రూపాయలు కేటాయించడంతో కాంట్రాక్టర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర జలసంఘం సూత్రవూపాయమైన అనుమతులనిచ్చిన మూడు సంవత్సరాల్లోగా మిగిలిన అనుమతులను పొందకపోతే మొదటఇచ్చిన అనుమతులను కూడా రద్దు చేసే అవకాశం ఉంది. ప్రాణహిత పనులను కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేపడితే ప్రభుత్వం చెప్పే లెక్క ప్రకారం ఇది పూర్తి కావడానికి 11ఏళ్ల కాలం పడుతుంది. ఈ వ్యవహారం చూస్తుంటే సర్కారుకు ఈ ప్రాజెక్టుపై చిత్త శుద్ధిలేదని స్పష్టమౌతోందని నిపుణులు విమర్శిస్తున్నారు.ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడినెట్టి వద్ద ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మించి ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తారు. ప్రాజెక్టు ప్రారంభ స్థలం వద్ద 236.5 టీఎంసీల నీరు లభ్యమవుతుందని కేంద్ర జలవనరుల సంఘం అంచనా వేసింది. ఈ ప్రాజెక్టు మొత్తం కాలువల పొడవు 1055 కిలోమీటర్లుగా అంచనా వేశారు. 22 లిఫ్ట్‌ల ద్వారా నీటిని తరలించడానికి 3466 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఎల్లంపల్లి ద్వారా మరో 20 టీఎంసీల నీటిని కూడా ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం మొత్తం పనులను 28 ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టు పనులను అప్పగించారు.

Take By: T News
Keywords: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC. Polavaram Project, Sonia Gandhi, Urdu shayari, hyderabad urdu Shayari,
0 comments:
Post a Comment