గ్రూప్-1 ఫలితాలపై అనుమానాలు!
- వరంగల్ కేంద్రం నుంచి 11మంది మాత్రమే ఎంపిక
- చిత్తూరు నుంచి 120 మందికి పైగా ...
- పేపర్‌లీక్ అయిందని కొందరి అభ్యర్థుల ఆరోపణ
- నేడు ఏపీపీఎస్సీ అధికారులను కలుస్తామని వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 18 (): గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో వరంగల్ కేంద్రం నుంచి పరీక్ష రాసిన వారిలో కేవలం 11 మందిని మాత్రమే ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూలకు ఎంపిక చేసిందని, అదే చిత్తూరు నుంచి సుమారు 120 మంది పైగా ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.h
పరీక్షా సమయంలో తిరుపతి కేంద్రంలో ప్రశ్నాపత్రం లీకయిందని, అందుకే ముఖ్యమంత్రి జిల్లా చెందిన చిత్తూరు అభ్యర్థులు ఎక్కువగా ఇంటర్వ్యూలకు ఎంపికయి ట్లు వారు ఆరోపిస్తున్నారు. ఆదివారం పలువురు గ్రూప్-1 అభ్యర్థులు ‘టీ న్యూస్’తో మాట్లాడారు. వీరు వ్యక్తం చేసిన అనుమానాలకు పరీక్షా సమయంలో జరిగిన సంఘటనలు బలం చేకూరుస్తున్నాయి. మెయిన్స్ పరీక్ష సందర్భంగా తిరుపతిలోని ఓ పరీక్షా కేంద్రంలో కొంత మంది అభ్యర్థులు జవాబు పత్రం (బుక్‌పూట్) ఇవ్వగానే బుక్‌పూట్‌లోని రఫ్ పేపర్లో సుమారు 10 ప్రశ్నలకు సంబంధించి జవాబులు రాశారు. ఒక్కో అభ్యర్థి ఒక్కో ప్రశ్నకు జవాబు రాశారు.
ఇది గమనించిన ఇతర అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారి వద్ద నుంచి జవాబు పత్రాలు తీసుకుని కొత్తవి ఇచ్చారు. తిరుపతి పరీక్షా కేంద్రంలో అబ్జర్వర్‌గా ఉన్న ఏపీపీఎస్సీ బోర్డు సభ్యుడు చంద్రశేఖర్.. ప్రశ్నా పత్రం ఇవ్వకుండానే రాసిన జవాబులకు, ఇవ్వబోయే ప్రశ్నాపవూతంలోని ప్రశ్నలను పరిశీలిస్తే అవి అందులో ఉన్నట్టుగా నిర్దారించారు. దీంతో ముందస్తుగా పేపర్ లీక్ అయిందని గమనించిన ఏపీపీఎస్సీ..
ఆ జిల్లా కలెక్టర్‌తో విచారణ చేయించినట్లు సమాచారం. కానీ ఆ అభ్యర్థుల జవాబు పత్రాలను వాల్యువేషన్ చేశారా? లేదా అన్న విషయాన్ని ఏపీపీఎస్సీ వెల్లడిస్తే తప్పా ఎవ్వరికీ తెలిసే అవకాశం లేదు. కాగా, పేపర్ లీకేజీతో పాటు, తెలుగు మీడియం విద్యార్థులకు జరిగిన అన్యాయంపై సోమవారం ఏపీపీఎస్సీ అధికారులను కలువనున్నట్లు పలువురు అభ్యర్థులు తెలిపారు.
Take By: T News
0 comments:
Post a Comment