క్రిస్మస్‌కు ముస్తాబైన మెదక్ చర్చి
మెదక్, డిసెంబర్ 24 (): ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. డయాసిస్ మిషనరీ ప్రతినిధులు, అధికార యంత్రాంగం వారం రోజులుగా సమష్టి కృషితో ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆదివారం తెల్లవారుజామున రెవండ్ బిషప్ కనకవూపసాద్ భక్తులనుద్దేశించి వాక్యోపదేశం చేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభిస్తారు.
ఇక్కడ జరిగే వేడుకలకు మెదక్ డయాసిస్ పరిధిలోని హైదరాబాద్, రంగాడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన క్రైస్తవ సోదరులే కాకుండా మతాలకతీతంగా కర్ణాటక, మహారాష్ట్రతో పాటు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో సందర్శకులు రానున్నారు. దాదాపు రెండు లక్షల మంది దాకా రావచ్చని డయాసిస్ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు.
వేడుకలను పురస్కరించుకొని మెదక్‌కు ఆర్టీసీ అదనపు బస్సులను నడుపుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రెసిబెటరీ ఇన్‌చార్జి రాబిన్‌సన్ తెలిపారు.
0 comments:
Post a Comment