Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Sunday, December 25, 2011

కదులుతోంది.. చంద్రబాబు దండు యాత్ర

- ప్రైవేట్ సైన్యంతో పాదయావూతలకు..తెలంగాణ పర్యటనకు పక్కా వ్యూహం
- కాన్వాయ్‌లో 500 వాహనాలు!
- నిలదీతలు అడ్డుకునేందుకు చంద్రదండు
- ప్రశ్నించినవారిపై గుత్పలతో దాడులు
- జనం లేకపోతే ఉపన్యాసాలు వినేదీ వారే
- ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్..మూడు జిల్లాల్లోనూ ఇదే తీరులో పర్యటన
- కరీంనగర్‌కూ ఇదే భరోసాతో పయనం
- అడ్డుకునేందుకు సిద్ధమవుతున్న జనం


chandra-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema( హైదరాబాద్) అధినాయకుడి ఇంటి నుంచి అంగరక్షకులు, అనుయాయులు సహా పది వాహనాలు బయల్దేరుతాయి! కొద్దిదూరంలో ప్రధాన మార్గంపైకి చేరుకోగానే అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న దాదాపు 200 వాహనాలు డిక్కీల్లో గుత్పలు కుప్పలు పోసుకుని జతచేరుతాయి! ఒక వాహనం రెండు కిలోమీటర్ల ముందు వెళుతూ.. పరిసరాలను క్షుణ్ణంగా గమనిస్తుంటుంది! అధినాయకుడు స్పాట్‌కు చేరుకునే సరికి అప్పటికే అక్కడికి 300 వాహనాలకు సరిపడా ఒక ప్రత్యేక దండు చేరుకుని ఉంటుంది! వీరికి తీసిపోని స్థాయిలో పోలీసు భద్రత! అధినాయకుడు కారుదిగి నడవడం మొదలు పెట్టే సరికి.. మూడు వరసల్లో ప్రైవేటు సేన కాపలా! ఈలోపు అధినేత ఎవరినో పలకరించాలని అనుకుంటాడు.. సదరు రైతును కనీసం వందమంది చుట్టుముడతారు! కంటి చూపుతో చంపేస్తామన్న పద్ధతిలో నిలబడతారు!

దీంతో బిక్కచచ్చిపోయిన రైతును అధినాయకుడు పలకరిస్తాడు.. పరామర్శిస్తాడు..! ఈలోపు ఎవరైనా అధినాయకుడిని ప్రశ్నించినా.. నిలదీసినా.. దండు గుత్పలు తీస్తుంది.. తన ప్రతాపం చూపిస్తుంది! లైన్ క్లియర్ చేసి.. అధినాయకుడు ‘ఆ విధంగా ముందుకు పోయేందుకు’ వీలు కల్పిస్తుంది! ఇదేదో ఫ్యాక్షన్ సినిమా సీన్ అనుకుంటున్నారా? కాదు. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రైతులను పరామర్శించేందుకు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో చేసిన పోరుబాట యాత్రలో భాగం! రైతుల పరామర్శకు వస్తున్నారో.. జనంపై దండెత్తడానికి వస్తున్నారో అర్థం కాని రీతిలో సాగిస్తున్న పాదయాత్ర దృశ్యం! ఇదే పద్ధతిలో ఈ నెల 27న కరీంనగర్‌కు వెళ్లేందుకు బాబు సమాయత్తమవుతున్నారు! మరి జనం ఎలా స్పందిస్తారో!!

రైతు పోరుబాట పాదయావూతను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలపైకి దండెత్తి వస్తున్న పద్ధతిలో కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం 500 వాహనాలతో ఎంతలేదన్నా మూడు వేల మంది అనుచరులు, నాయకగణం, దండుతో బాబు చేస్తున్న పాదయావూతలు రైతులను పరామర్శించేందుకు ఉద్దేశించినట్లు కనిపించడం లేదని అభివూపాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ విషయంలో చంద్రబాబు అనుసరించిన రెండు కళ్ల సిద్ధాంతం.. తదుపరి తటస్థ విధానంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు రెండేళ్ల క్రితం డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణను అడ్డుకోవడంలో చంద్రబాబుదే ప్రధాన పాత్ర అన్నఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు జనం అడ్డు తగులుతున్నారు. దీన్ని నివారించేందుకు, తన రైతు పోరుబాట యాత్ర నిరాటంకంగా కొనసాగేందుకు చంద్రబాబు అండ్ కో పెద్ద పథకమే వేసినట్లు కనిపిస్తోంది. తన పాదయావూతకు ఎలాంటి విఘాతం కలగకుండా భారీ ఎత్తున ప్రైవేట్ సైన్యాన్ని చంద్రబాబు వెంట తీసుకుపోతుండటం విశేషం. దీంట్లో రెండు ప్రయోజనాలు ఉన్నాయి. తన యాత్రకు పూర్తి రక్షణ ఒక కోణమైతే.. పర్యటనలో ఏ సెంటర్‌లో బాబు మాట్లాడినా కనీసం మూడునాలుగు వేల మంది పోగైనట్లు కలరింగ్ ఇచ్చుకోవడం రెండవ కోణం. వాస్తవానికి ఇది వైఎస్ జగన్ తన ఓదార్పు యాత్రను జైత్రయావూతలా జరుపుకొన్న తరీఖాయే! జగన్ తన ఓదార్పు యాత్రలకు ప్రతి సెంటర్‌కు ఒకే జనాన్ని, కడప నుంచి ప్రత్యేక రక్షకులను తెచ్చుకున్నట్లే చంద్రబాబు కూడా పాదయాత్ర సాగిస్తున్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి.

అధినేత కదిలేది ఇలా
పర్యటనకోసం చంద్రబాబు కాన్వాయ్ హైదరాబాద్‌లోని ఆయన స్వగృహం నుంచి బయలుదేరుతుంది. బ్లాక్ కమెండోలు, పార్టీ సీనియర్ నాయకులు ఓ పది వాహనాల్లో కదులుతారు. చూడటానికి సాధారణ పర్యటనలానే ఉంటుంది. కొంచెం దూరం వెళ్లాక అసలు సీన్ మొదలవుతుంది. ఏడవ నెంబరు జాతీయ రహదారిపై నగర శివారు ప్రాంతమైన సుచిత్ర వద్దకు బాబు కాన్వాయ్ చేరుకోగానే దాదాపు రంగాడ్డి, హైదరాబాద్‌ల నుంచి 200 వాహనాలు కలుస్తాయి. చూసేవాళ్లకు ఏదైనా దాడి జరగబోతోందా? అన్న అనుమానాలు కల్గించే రీతిలో చీమలబారులా కాన్వాయ్ రయ్యిన దూసుకుపోతుంటుంది. వీటన్నింటికీ ముందు ఒక వాహనం రెండు కిలోమీటర్ల ముందు ఉండి.. పరిస్థితులను పర్యవేక్షిస్తుంటుంది. ఎవరైనా తెలంగాణవాదులు గుమిగూడినట్లు అనుమానం కలిగితే వెంటనే చంద్రబాబు కాన్వాయ్‌కు సంకేతాలు పంపిస్తుంది.

చివరకు పాదయాత్ర ప్రారంభించాల్సిన స్థలానికి కాన్వాయ్ చేరుకుంటుంది. వివిధ జిల్లాల నుంచి సమీకరించిన చంద్రబాబు దండు దాదాపు 300 వాహనాల్లో అప్పటికే అక్కడకు చేరుకుని ఉంటుంది. దాదాపు ఇంతే స్థాయిలో పోలీసులు కూడా ఉంటారు. ఇక చంద్రబాబు తన కారుయాత్ర ఆపి.. పాదయాత్ర ప్రారంభిస్తారు. ఈ యాత్రకు మూడంచెల భద్రతా వలయం ఉంటుంది. దీన్ని దాటుకుని చంద్రబాబును సమీపించడానికి ఎవరికీ అవకాశం ఉండని స్థాయిలో ప్రైవేట్ సైన్యం మోహరించి ఉంటుంది. ఎవరైనా తెగించి చొరబడ్డారో.. చంద్రదండు తన ప్రతాపం చూపిస్తుంది. వారిని చితకబాది.. పోలీసులుకు అప్పగిస్తుంది. ఇదంతా చూసిన స్థానికులు.. చంద్రబాబు పాద యాత్ర రైతులను పరామర్శించడానికా లేక ప్రజలపై దాడి చేసేందుకా? అని చర్చించుకుంటున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, 21న మెదక్ జిల్లాలో చంద్రబాబు పర్యటన సాగిన తీరు ఇలానేఉంది. ఈ పర్యటనల్లో లభించిన భరోసాతో తెలంగాణ ఉద్యమం కేంద్రంగా భాసిల్లుతున్న కరీంనగర్ జిల్లాలో పర్యటించేందుకు చంద్రబాబు సమాయత్తమవుతున్నారు.

పట్టుదలతోనే పర్యటన
తెలంగాణలో పర్యటించి తీరాలనే పట్టుదలతోనే చంద్రబాబు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే అవసరమైతే ఎదురుదాడులు చేసేందుకు సైతం తన కేడర్‌ను ఆదేశించారని సమాచారం. స్థానికంగా తెలంగాణవాదులను అడ్డుకునే ధైర్యం స్థానిక క్యాడర్‌కు ఉండదని భావించే చంద్రబాబు ఈ ఏర్పాట్లు చేసుకున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఇదే పద్ధతిలో చంద్రదండు స్థానిక తెలంగాణవాదులపై దాడులు చేసిందని అంటున్నారు. దీనితో స్థానిక ప్రజలు బాబు పర్యటనకు రాకపోయినా.. తన వెంట వచ్చే దాదాపు 500 వాహనాల్లోని వ్యక్తులే జనంగా అవతారమెత్తుతున్నారని పరిశీలకులు అంటున్నారు. చంద్రదండు పేరుతో ప్రత్యేకంగా టీషర్టులు ధరించిన బాబు ప్రైవేట్ సైన్యం తెలంగాణ ప్రజలపై యధేచ్ఛగా దాడులకు దిగుతున్నదని, టీడీపీ టీ ఫోరం నేతలు దగ్గరుండి మరీ దాడులు చేయిస్తున్నారని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు.

దాడులు చేయించడం ద్వారా ఏం సంకేతాలు ఇవ్వాలని అనుకుంటున్నారని టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. దండయావూతలా సాగుతున్న చంద్రబాబు పోరుయావూతపై టీడీపీలోని కిందిస్థాయి నేతలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘చంవూదబాబుతో మాట్లాడిస్తాం.. మీటింగ్‌కు రమ్మంటే.. ఆయన ఎవరు? వచ్చిన తెలంగాణను అడ్డుకున్న బాబుతో మేం మాట్లాడేదేమిటని అసహ్యించుకుంటున్నారు’ అని నిజామాబాద్‌కు చెందిన పార్టీ నేత ఒకరు అన్నారు. స్థానికులు మీటింగ్‌కు రాకపోతే వచ్చిన చంద్రదండునే ప్రజల మాదిరిగా భావించి ఉపన్యాసాలు చేశాడని అంటున్నారు. స్థానిక ప్రజలు సభలకు రాకపోయినా.. చంద్రదండుతో కవరింగ్ ఇచ్చుకున్నంత మాత్రాన తమ పార్టీ బలపడినట్లు ఎలా భావిస్తామని ఒక నేత ఆవేదన వ్యక్తం చేశారు.

వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది బాబే...
2009 ఎన్నికల తరువాత తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. కేసీఆర్ ఆమరణ దీక్షతో కేంద్రం దిగి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని 2009 డిసెంబర్ 7న అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ చెప్పింది. అఖిలపక్ష సమావేశం నిర్ణయాల మేరకు డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పక్రియను మొదలు పెడుతున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ప్రజలు సంబురాలు జరుపుకొన్నారు. కానీ.. ఆ సంతోషాలను చంద్రబాబు తెలంగాణ ప్రజలకు 24గంటలు కూడా ఉండనీయలేదని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంటూ మరుసటి రోజే అడ్డం తగిలిన బాబు.. కేంద్రం ఏకపక్షంగా తెలంగాణ ఎలా ఇస్తుందంటూ అడ్డుకున్నారు.

ఇది తెలంగాణ ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. కేంద్రం ఇచ్చిన తెలంగాణను చంద్రబాబే అడ్డుకున్నారన్న భావన ప్రజల్లో స్థిరపడిపోయింది. ఆయన సీమాంవూధలో కృత్రిమంగా సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయించడం, రాజీనామాల డ్రామాకు తెరతీయడంతోనే కేంద్రం ఇచ్చిన మాటపై వెనుకంజ వేసిందని, ఫలితంగానే డిసెంబర్ 23న కేంద్రం మరో ప్రకటన చేసిందని వారు నమ్ముతున్నారు. చంద్రబాబు ఆనాడు తెలంగాణను అడ్డుకోకపోతే నేడు తెలంగాణ రాష్ట్రంలో స్వయం పాలనలో ఉండే వాళ్లమని ప్రజలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబును, ఆయన అడుగుజాడల్లో నడిచే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలపై స్థానిక ప్రజలు గుర్రుగా ఉన్నారు. గ్రామాల్లో జేఏసీలుగా ఏర్పడిన తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్న టీడీపీ ప్రజా ప్రతినిధులను గ్రామాల్లోకి రానీయకూడదని తీర్మానాలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు నియోజకవర్గాలకు వెళితే ప్రజలు దాడులు చేయడం మొదలు పెట్టారు. ఒక దశలో వీరు రాజధానికే పరిమితమయ్యారు.

అయినా బాబులో మార్పు రాలేదు. టీడీపీ టీ ఫోరం ఏర్పడినా.. దాన్నీ జనం నమ్మలేదు. చంద్రబాబు నుంచి స్పష్టమైన ప్రకటనకు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ బలహీనపడిపోయింది. దీని ప్రభావం సీమాంవూధలోనూ ఉంటుందని భావించిన ఆ ప్రాంత నేతలు.. తెలంగాణలో చంద్రబాబ పర్యటించాల్సిందేనని ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణలో పర్యటనకు చంద్రబాబు సిద్ధమయ్యారని తెలుస్తోంది. మరి జనం ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సిందే!

Take By: T News   :

0 comments:

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP