అసెంబ్లీ సమావేశాలు స్తంబింపచేస్తాం
పాల్వంచ, ఫిబ్రవరి 14: రాష్ట్రంలో అధికార, ప్రధానప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కయ్యాయని టీఆర్ఎస్ శాసనసభా పక్షనేత, సిద్దిపేట ఎ మ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామ ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపును టీడీపీ తిరస్కరించడమే దీనికి నిదర్శనమన్నారు.సోమవారం ఖమ్మం జిల్లా పాల్వంచలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. గతంలో 45 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అవిశ్వాసానికి సమ్మతించిన టీడీపీ అధినేత చంద్రబాబు..
ఇప్పుడు 90 మంది ఎమ్మెల్యేలున్నా అవిశ్వాసానికి ముందుకు రాకపోవడం వెనుక తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే కుట్ర దాగిఉందన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించడంతోపాటు, అన్నిరోజులూ శాసనసభను స్తంభింపచేస్తామని తెలిపారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్న సీపీఐ ఎమ్మెల్యేలు కూడా తమతో కలిసిరావాలని కోరారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న సీపీఎం పునాదులు తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే కదలడం మొదలైందని, ఇప్పటికైనా పంథా మార్చుకోకుంటే.. ఆ పార్టీ ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కూడా గెలుచుకునే పరిస్థితి ఉండదన్నారు.
0 comments:
Post a Comment