గణితంలో చిచ్చర పిడుగు హర్షిత - ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 31(): ‘ పిట్ట కొంచెం కూత ఘనం’ అన్నట్లుగా పిన్న వయస్సులోనే గణిత సూత్రాలను ఔపోసన పట్టిన బేబీ హర్షితాడ్డి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు ను నమోదు చేసుకుంది. కరీంనగర్ జిల్లాకు చెంది న హర్షితాడ్డి(10) ఐదో తరగతి చదువుతూనే ఇంటర్మీడియట్ గణిత సూత్రాలను అలవోకగా చెప్పేస్తోంది.
శనివారం సిద్దిపేటలో ఎస్‌ఎంఎస్ కళాశాలలో ఎర్పాటు చేసిన కార్యక్షికమంలో వంద నిముషాల్లో వంద గణిత సమస్యలను పరిష్కరించి ఔరా అనిపించింది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఠక్కున సమాధానాలు తెలిపి ఆశ్చర్య పరిచింది.
కార్యక్షికమంలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు దక్షిణ భారత సమన్వయ కర్త వెంకటాచారి, డాక్టర్.జి.శ్రీనివాస్, ప్రముఖ గణిత శాస్త్ర నిపుణులు రాజేందర్, కళాశాల ప్రిన్సిపాల్ నర్సయ్యలు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment