రాజకీయాల్లో ముస్లింల పాత్ర పెరగాలి
హైదరాబాద్, డిసెంబర్ 31 (): రాజకీయాల్లో ముస్లింల పాత్ర పెరగాలని, తద్వారా మాత్రమే వారికి సరైన న్యాయం జరుగుతుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అభివూపాయపడ్డారు. రంగనాథమిశ్రా, సచార్ తదితర కమిటీలు ఇచ్చిన సూచనలు అమల్లోకి రాకపోవడంవల్ల ముస్లింలలో పేదరికం పెరుగుతోందని అన్నారు. ఉర్దూ భాష అభివృద్ధి, పరిరక్షణ కోసం ముస్లింలు కార్యాచరణను రూపొందించుకోవాలని సూచించారు. ముస్లింల పేదరికమే ఉర్దూ భాష అభివృద్ధికి ప్రధాన అవరోధంగా మారిందని పేర్కొన్నారు.
‘ప్రపంచ ఉర్దూ ఎడిటర్స్ కాన్ఫన్స్’లో భాగంగా శనివారం జూబ్లీహాలులో జరిగిన కార్యక్షికమానికి బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టీడీపీ హయాంలో 15 జిల్లాల్లో ఉర్దూ రెండవ భాషగా అభివృద్ధి చెందేటట్లు చర్యలు తీసుకున్నామని చెప్పారు. వరల్డ్ ఉర్దూ ఎడిటర్స్ కాన్ఫన్స్ అసోసియేట్ ప్రెసిడెంట్ అల్లమా ఇజాజ్ ఫారూఖ్ మాట్లాడుతూ హైదరాబాద్ లాంటి చారివూతాత్మక నగరంలో ‘ప్రపంచ ఉర్దూ ఎడిటర్స్ కాన్ఫన్స్’ నిర్వహించడం తమకు ఆనందాన్నిచ్చిందన్నారు. ఎమ్మెల్సీ ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి మాట్లాడుతూ అందరూ ఉర్దూ భాష అభివృద్ధి చెందాలని ఉపన్యాసాలు ఇస్తున్నారని, కానీ అభివృద్ధి మాత్రం జరగడంలేదని వ్యాఖ్యానించారు. సియాసత్ ఎడిటర్ జహీద్ అలీఖాన్ మాట్లాడుతూ పాలకులు ఉర్దూ భాషను అభివృద్ధి చేస్తారని ఎదురుచూడకుండా భాషాభిమానులు ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
0 comments:
Post a Comment