ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి రెండేళ్లు పెంపు
నిరుద్యోగులకు ప్రభుత్వం
నూతన సంవత్సర కానుక
నూతన సంవత్సర కానుక
హైదరాబాద్ డిసెంబర్ 31 (): ప్రభుత్వ ఉద్యోగాలకోసం అర్హతా వయోపరిమితిని రెండేళ్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వయోపరిమితి పెంచాలని కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం నూతన సంవత్సర కానుక అందించింది. నిరుద్యోగులకు ప్రస్తుతం ఉన్న వయస్సు నిబంధనను అన్ని కేటగిరీల వారి రేండేళ్లకు పెంచింది. అయితే నిరుద్యోగులు మాత్రం కనీసం ఐదేళ్ల వయోపరిమితిని పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుండగా, ప్రభుత్వం కేవలం రేండేళ్లకు పరిమితి చేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రభుత్వం చాన్నాళ్లుగా నిరుద్యోగుల వయో పరిమితి పెంపుపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేసింది.
0 comments:
Post a Comment