మూడు వేల కొలువులు (apspsc.gov.in )
- 2,805 ఉద్యోగాల భర్తీ
- ఒకేసారి 10 నోటిఫికేషన్‌లు జారీ చేసిన ఏపీపీఎస్సీ
- అత్యధికంగా 1,716 ఏఈఈ పోస్టులు
- జీవో 420 ప్రకారమే ఉద్యోగాల నియామకాలు
- మెరిట్ లిస్టు ఆధారంగానే భర్తీ
హైదరాబాద్, డిసెంబర్ 27 ():రాష్ట్ర ప్రభుత్వంలోని 10 శాఖలకు చెందిన 2,805 పోస్టుల భర్తీకి ఆంధ్రవూపదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) మంగళవారం 10 నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ పోస్టుల్లో పంచాయతీ రాజ్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్లూఎస్ శాఖల్లోని 1,716 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు, 432 డిప్యూటీ సర్వేయర్ పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వీటిలో అత్యధికంగా 397అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు ఉండగా, అత్యల్పంగా పోర్టు ఆఫీసర్ 2, అసిస్టెంట్ ఎలక్షిక్టికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 9 ఉన్నాయి. ఇటీవల ఏపీపీఎస్సీ సంస్కరణల ఆధారంగా విడుదల చేసిన జీవో 420 ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. ఈ జీవో ప్రకారం కేవలం రాత పరీక్ష మెరిట్ లిస్టు ఆధారంగా మాత్రమే ఉద్యోగాల భర్తీ ఉంటుంది. ఈ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండవని ఆమె స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా బోర్డు ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జీవో 420 విడుదల చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇంటర్వ్యూ పద్దతి ఉండాలని, ప్రభుత్వం విడుదల చేసిన జీవో 420ని ఉపసంహరించుకోవాలని బోర్డు సభ్యులు ముఖ్యమంవూతికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జీవో అమలుపై గత సోమవారం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫారసుల ఆధారంగా ఉత్తర్వులు అమలు చేయాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే కమిటీ సిఫారసుల మేరకు ప్రస్తుత నోటిఫికేషన్ల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుం దా? లేదా ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ల వరకు జీవో 420 అమలు చేసి, మిగితా నోటిఫికేషన్లకు కమిటీ సిఫారసులు వర్తింపజేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ప్రకటించిన తేదీల్లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ ప్రకటించింది. పూర్తి వివరాలు www.apspsc.gov.in వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు ప్రకటించారు.
Take By: T News
0 comments:
Post a Comment