కేబినెట్‌లో మార్పులకు కిరణ్ కసరత్తు!
- సీఆర్, గంటా కోసమే చిరు పట్టు?
- పీఆర్పీ కోటాలో తెలంగాణకు మొండిచెయ్యే..
- బడ్జెట్ సమావేశాల తర్వాత పూర్తి స్థాయి విస్తరణ
- బొత్స, కాసు, సబిత, శంకర్‌రావుకు ఉద్వాసన?
హైదరాబాద్, డిసెంబర్ 27 ():సంక్రాంతిలోపే మెగాస్టార్ చిరంజీవి బృందం (పీఆర్పీ) కిరణ్ కేబినెట్‌లో చేరబోతున్నది. చిరు కోటాలో ఈసారికి ఇద్దరికి మాత్రమే మంత్రివర్గంలో చోటుకు అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత ఉగాది నాటికి జరిగే మంత్రివర్గ విస్తరణలో ప్రస్తుత మంత్రులు బొత్స సత్యనారాయణ, కాసు వెంకటకృష్ణాడ్డి, డాక్టర్ పీ శంకర్‌రావు, సబితా ఇంద్రాడ్డిలకు ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తోంది.తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంతాల నుంచి ఒక్కొక్కరు చొప్పున పీఆర్పీ కోటాలో ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఇటీవల ప్రచారం జరిగినా, పదవుల విషయంలో పీఆర్పీ కూడా తెలంగాణకు మొండి చెయ్యి చూపించనున్నట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పీఆర్పీ అధినేత చిరంజీవి ఇటీవల ఢిల్లీ పర్యటనలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో మూడు ప్రాంతాల నుంచి ఒక్కొక్కరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరినట్లు చెప్పుకున్నారు. చిరు బృందం నుంచి ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడానికి కాంగ్రెస్ సుముఖంగానే ఉన్నప్పటికీ చిరంజీవి తన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికే మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతం నుంచి ఆ పార్టీ టికెట్‌పై ఇద్దరు మాత్రమే గత ఎన్నికల్లో గెలిచారు. వీరిలో వెనుకబడిన తరగతులకు చెందిన అనిల్‌కు తెలంగాణ కోటాలో మంత్రి పదవి ఖాయమని ప్రచారం సాగింది.
అయితే చిరంజీవి ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పైగా, సీమాంధ్ర నుంచే సీ రామచంవూదయ్య (కడప ఎమ్మెల్సీ), గంటా శ్రీనివాసరావు (విశాఖ జిల్లా ఎమ్మెల్యే)లకు మంత్రి వర్గంలో తీసుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి కూడా జనవరి తొలి వారంలో తన మంత్రివర్గంలో పీఆర్పీ నుంచి ఇద్దర్ని తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విస్తరణ అనేది పీఆర్పీకే పరిమితం చేయాలని, బడ్జెట్ సమావేశాల తర్వాత ఉగాది నాటికి చేపట్టనున్న మంత్రివర్గ పునర్వవ్యస్తీకరణలో కాంగ్రెస్ వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది.
సీఆర్‌తో కొత్త సమస్యలా?
కడప జిల్లాకు చెందిన పిఆర్పీ ఎమ్మెల్సీ సి.రామచంవూదయ్యను మంత్రివర్గంలో తీసుకోవడం ద్వారా కిరణ్‌కుమార్‌కు కొత్త సమస్యలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2009 ఎన్నికల్లో సీనియర్ నేత రోశయ్య ఎమ్మెల్యేగా పోటీ చేయక పోవడంతో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌డ్డి ఆయన్ని శాసన మండలికి ఎంపిక చేసి ఆ తరువాత మంత్రివర్గంలో తీసుకున్నారు. రోశయ్య తరువాత కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ, వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానందడ్డికి ఆ జిల్లా రాజకీయ సమీకరణలు, ఉప ఎన్నికల నేపధ్యంలో మంత్రివర్గంలో తీసుకున్నారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేతిలో పరాజయం పొందడం, ఆ తరువాత ఎమ్మెల్సీ పదవి కాలం ముగియడంతో ఆయనకు మంత్రిగా కొనసాగించే అవకాశం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు అదే జిల్లాకు చెందిన పీఆర్పీ ఎమ్మెల్సీ సీ రామచంవూదయ్యకు మంత్రి పదవి కోసం చిరు పట్టుబడుతున్నారు.
నలుగురికి ఉద్వాసన?
ఫిబ్రవరి రెండవ వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు మార్చి 30 వరకు జరిగే అవకాశాలుంటాయి. దీని కంటే ముందు మంత్రివర్గాన్ని పునర్వవ్యస్థీకరణ, శాఖల మార్పులు చేపడితే బడ్జెట్ సమావేశాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుందని సీఎం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి. దీంతో ప్రస్తుతానికి పీఆర్పీ నుంచి ఇద్దర్ని తీసుకుని ఖాళీగా ఉన్న శాఖలను వారికి కేటాయించాలని ఆలోచనతో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ విస్తరణలో ప్రస్తుత మంత్రులు బొత్స సత్యనారాయణ, కాసు వెంకటకృష్ణాడ్డి, డాక్టర్ పి.శంకపూరావు, సబితా ఇంద్రాడ్డిలకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తోంది. జోడు పదవులు, రానున్న స్థానిక సమరం, ఉప ఎన్నికలు, ఆ తరువాత సాధారణ ఎన్నికల దృష్ట్యా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి పార్టీ అధ్యక్షుడిగానే బొత్స సేవలు ఉపయోగించు కోవాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో బొత్సను మంత్రి పదవి నుంచి తప్పించడం ఖాయమని పార్టీ వర్గాలంటున్నాయి. అదే విధంగా పనితీరు ఆశాజనకంగా లేక పోవడంతో మంత్రి కాసు వెంకటకృష్ణాడ్డి కూడా ఉద్వాసన పలకాలనే ఆలోచనతో సిఎం ఉన్నట్లు సమాచారం. ఇక తెలంగాణ నుంచి మంత్రి శంకర్‌రావును మంత్రివర్గం నుంచి తప్పించడం ఖాయమంటున్నారు. జగన్‌వర్గంతో సంబంధాలున్నాయని ప్రచారంలో ఉండటంతో హోంమంత్రి సబితా ఇంద్రాడ్డికి కూడా మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు లేక పోలేదని అంటున్నారు.
సబితను అప్పుడు తొలగించకపోయినా హోంశాఖ నుంచి మరో శాఖకు మార్చడం ఖాయమని పారీ ్టవర్గాలంటున్నాయి. ఇప్పటికే హోం శాఖ కోసం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పట్టుబడుతున్నట్లు సమాచారం. శంకర్‌రావును తొలగిస్తే ఆయన స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి మరొకరిని సీఎం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇదే నిజమైతే రంగాడ్డి జిల్లా వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్ లేదా, ప్రభుత్వ విప్ కొండ్రు మురళికి మంత్రివర్గంలో అవకాశాలుంటాయని పార్టీ వర్గాలంటున్నాయి. అప్పటి వరకు మంత్రుల పనితీరును బేరీజు వేసుకుని మరో ఒకరిద్దరిని తప్పించడం ద్వారా కొత్త వారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలనే ఆలోచనతో కిరణ్ ఉన్నట్లు సమాచారం.

Take By: T News
0 comments:
Post a Comment