ప్రభుత్వ సేవల గురించి తెలుసుకోవడం ఇక సులభతరం కానుంది
న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ప్రభుత్వ సేవల గురించి తెలుసుకోవడం ఇక సులభతరం
కానుంది. మీరు పెట్టుకున్న దరఖాస్తు స్థితి ఏంటన్న విషయం తెలుసుకునేందుకు
ఇకనుంచి ప్రతిసారి సంబంధిత కార్యాలయానికి తెలుసుకోవాల్సినవసరం లేదు.
ఎందుకంటే ఈ ఇబ్బందిని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం 166 అనే ఒక ఆటోమేటిక్
టెలిఫోన్ నెంబర్‌ను కేటాయించింది. దీనికి డయల్‌చేసి మీ రేషన్‌కార్డు,
విద్యుత్ కనెక్షన్ వంటి తదితర సేవలను గురించిన సమాచారం ఇట్టే
తెలుసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది.
ఇది డిసెంబర్‌లో నుంచి అందుబాటులోకి
రానుంది. ఇంతకు ముందు ఇలాంటి సేవలు అందించేందుకు 51969 ఫోన్ నెంబర్
ఉన్నప్పటికీ దీనికి ఫోన్ చేసే అవకాశం లేకుండా కేవలం ఎస్సెమ్మెస్ ద్వారా
మాత్రమే సేవలు పొందేందుకు వీలు ఉండేది. ఈ నెంబర్‌తో ఎస్సెమ్మెస్ ద్వారా
సమాచారం పొందాలన్నా, పంపించాలన్నా కొంత పరిధిలోనే సాధ్యమయ్యేది.
0 comments:
Post a Comment