డర్టీ పిక్చర్‌పై హై కోర్టులో పిటిషన్
హైదరాబాద్: ప్రముఖ కథానాయిక విద్యా బాలన్ నటించిన డర్టీ పిక్చర్ విడుదలను నిలిపివేయాలంటూ సిల్క్‌స్మిత సోదరుడు నాగవరప్రసాద్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన సోదరి జీవిత చరిత్రను అసభ్యకరంగా చిత్రీకరించారని ఆయన ఆరోపించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా సినిమాను నిర్మించారని డైరెక్టర్, నిర్మాతపై మండిపడ్డారు. తమని సంప్రదించకుండా తన సోదరి జీవిత చరిత్రను ఆధారం చేసుకుని సినిమాను నిర్మించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. డర్టీ పిక్చర్‌ను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు.
0 comments:
Post a Comment