ఎన్ని ఆరోపణలు వచ్చినా దీక్ష ఆగదు -ఆమరణం-2e
- తేల్చిచెప్పినకోమటిరెడ్డి వెంకన్న
- వేలాదిగా తరలివస్తున్న తెలంగాణవాదులు
- తెలంగాణ సాధించేవరకు ఉద్యమం: కోదండరాం
రెండో రోజూ అదే జాతర.. జన జాతరగా తరలివచ్చిన జనం.. అభిమానులు, తెలంగాణవాదుల కోలాహలం.. ఉపాధ్యాయ, ఉద్యోగ, ప్రజాసంఘాలు, వివిధ జేఏసీ నేతల మద్దతు మధ్య మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌డ్డి నల్లగొండ పట్టణంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష బుధవారం రెండో రోజు పూర్తిచేసుకుంది. తను తెలంగాణ కోసం దీక్ష చేస్తుంటే, పార్టీ మారుతానని దుష్ర్పచారం చేస్తున్నారని కోమటిడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం దిగివచ్చేవరకు దీక్ష ఆగేదిలేదని స్పష్టం చేశారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మతి స్థిమితం కోల్పోయి తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. కొందరు సీమాంవూధులకు తొత్తులుగా మారి తెలంగాణ ఉద్యమాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
దీక్ష చేస్తున్న కోమటిడ్డికి రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అభినందనలు తెలిపారు. ఉద్యమ స్వరూపం మారుతుందే తప్ప, తెలంగాణ వచ్చేదాకా పోరు ఆగదన్నారు. సందర్భాన్ని బట్టి ఉద్యమ అస్త్రాలను ప్రయోగిస్తామని చెప్పారు. సకల జనుల సమ్మెతో దోషుపూవరో, ద్రోహుపూవరో తేలిపోయిందన్నారు. నిద్ర నటించిన కేంద్రాన్ని సమ్మెతో తట్టిలేపామన్నారు. ఇక, చంద్రబాబూ మనం ఎందుకు కలిసుండాలో చెప్పగలవా అని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సవాలు విసిరారు. తెలంగాణ ద్రోహులపై టీఆర్‌ఎస్ నేత కర్నె ప్రభాకర్ నిప్పులు చెరిగారు. శవాలపై ప్రమాణాలు చేసినవారు ఇప్పుడు పదవుల కోసం పాకులాడుతున్నారన్నారు. కోమటిడ్డి దీక్షతో తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతమవుతుందని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ రఘు చెప్పారు. దీక్షా శిబిరం వద్ద కళాకారుల ధూం ధాం ఆకట్టుకుంది.
సకల జనుల సమ్మెతో ద్రోహులెవరో తేలింది
నిద్ర నటిస్తున్న కేంద్రాన్ని తట్టిలేపాం
నల్లగొండ, టీన్యూస్ ప్రతినిధి:తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో మాజీమంత్రి, ఎమ్మెల్యే కోమటిడ్డి వెంకటడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజులు పూర్తి చేసుకుంది. రెండవ రోజు జిల్లావ్యాప్తంగా వేలాది మంది ప్రజలు, అభిమానులు, తెలంగాణవాదులు తరలివచ్చి దీక్షకు మద్దతు తెలిపారు. కోమటిడ్డి వెంకట్‌డ్డిని బుధవారం పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం అభినందిచారు. దీక్షకు సంఘీభావం తెలిపి ప్రసంగించారు. పరిస్థితులకు బట్టి ఉద్యమ స్వరూపం మారుతుందే తప్ప, తెలంగాణ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వాహనానికి గేర్లు మార్చినట్లుగానే పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
సందర్భాన్ని బట్టి ఉద్యమ అస్త్రాలను ప్రయోగిస్తామని వెల్లడించారు. తెలంగాణవూపాంత మంత్రులు రాజీనామాలు చేస్తే తెలంగాణ ఎప్పుడో వచ్చేదని, వారి వల్లే ఆలస్యమవుతోందన్నారు. మంత్రి జానాడ్డి రాజీనామా చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేశామని, ఆయన స్పందించకపోవడంతో ఇప్పుడు జిల్లాలో తిరగలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇంటి చుట్టూ పోలీసు పహారాల మధ్య బతుకుతున్నారని చెప్పారు. జిల్లాలో నిన్న మొన్నటి వరకు జై తెలంగాణ అన్న నేతలు, కోమటిడ్డి రాజీనామా మంత్రి పదవి ఖాళీకాగానే చప్పుడు చేయడం విమర్శించారు. నాయకత్వ లోపంతో 1969 ఉద్యమం వైఫల్యం చెందిందని, ఇప్పుడు తెలంగాణలో నాయకత్వం పుష్కలంగా ఉందన్నారు.
కోమటిడ్డి దీక్షతో కేంద్రంపై మరింత ఒత్తిడి పెరుగుతందన్నారు. సమైక్యాంవూధలో బీఫామ్‌లు ఇచ్చేది వలస పాలకులే అయినప్పటికీ, ఓట్లు వేసి గెలిపించేంది తెలంగాణ ప్రజలేనని, ఈ సత్యాన్ని గ్రహించే కోమటిడ్డి, జూపల్లి మంత్రి పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో భాగస్వాములయ్యారని ప్రశంసించారు. సకల జనుల సమ్మెతో దోషుపూవరో, ద్రోహుపూవరో తెలిసిందన్నారు. నిద్ర నటించిన కేంద్రాన్ని సమ్మెతో తట్టి లేపామని చెప్పారు.
శవాలపై ప్రమాణాలు చేసిన వారంతా ఇప్పుడు పదవుల కోసం పాకులాడుతున్నారని, తెలంగాణ ద్రోహులే ఉద్యమానికి అడ్డుపడుతున్నారని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. ఏమాత్రం చీము, నెత్తురు ఉన్నా పదవులను వీడి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలన్నారు. ఐక్యంగా ఉద్యమిస్తేనే తెలంగాణ సాధ్యమని ఎమ్మెల్సీ మోహన్‌డ్డి సూచించారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ రఘు మాట్లాడుతూ సమ్మెతో ద్రోహుపూవరో, తెలంగాణ బిడ్డలు ఎవరో తెలిసిపోయింన్నారు.
మునుగోడు ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు మాట్లాడుతూ సీమాంధ్ర పాలకులు తెలంగాణ రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. చీము, నెత్తురు ఉంటే ప్రజావూపతినిధులందరూ రాజీనామా చేయాలని, త్యాగాలు చేయకుండా తెలంగాణ సాధించుకోలేమని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం అన్నారు. దీక్షకు మద్దతు తెలిపిన వారిలో మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటడ్డి, సెక్ర ఉద్యోగుల సంఘం నేత నరేందర్‌రావు, అడ్వకేట్ జేఏసీ చైర్మన్ రాజేందర్‌డ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌డ్డి, తెలంగాణ ఎంఎస్‌ఓల సంఘం అధ్యక్షుడు కులదీప్ సహానీ, కార్యదర్శి ఏచూరి భాస్కర్, ఓయూ జేఏసీ నేత గాదరి కిశోర్, ఇంకెనాళ్లు సినిమా హీరో రఫీ తదితరులు ఉన్నారు.
దీక్ష శిబిరం వద్ద కళాకారులు నిర్వహించిన ధూం..ధాం అందరిని ఆకట్టుకుంది. రెండోరోజున రసమయి బాలకృష్ణ, స్వర్ణ, తాటిపాముల శంకర్, బచ్చలకూరి శ్రీనివాస్, నకిరేకంటి సైదులు తమ కళాబృందాలతో పాటలతో ఉర్రూతలూగించారు. ఆమరణ దీక్షకు చేపట్టిన కోమటిడ్డికి మద్దతు తెలిపేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. జనంతో క్లాక్‌టవర్ సెంటర్ కిక్కిరిసిసోయింది. కోమటిడ్డి ప్రత్యర్థి పాల్వయి గోవర్ధన్‌డ్డి నియోజకవర్గమైన మునుగోడు నుంచి రెండవ రోజు దీక్షకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. కోమటిడ్డికి డాక్టర్ మాతృనాయక్ ప్రభుత్వ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండో రోజు బీపీ, షుగర్ లెవల్ భారీగా పడిపోయాయి.
పాల్వాయికి మతిస్థిమితం లేదు -కోమటిరెడ్డి
తెలంగాణ కోసం దీక్ష చేస్తుంటే, పార్టీ మారుతానని దుష్ర్పచారం చేస్తున్నారని కోమటిడ్డి వెంకట్‌డ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లోనే ఉండి సోనియాను ఒప్పించి తెలంగాణ సాధిస్తానని స్పష్టం చేశారు. కేంద్రం దిగి వచ్చే వరకు దీక్ష ఆగదన్నారు. పాల్వాయి గోవర్ధన్‌డ్డి మతి స్థితిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని, ఓడిపోయిన నేతలంతా తనపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. సీమాంవూధులకు తొత్తులుగా మారి ఉద్యమాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.ఎవన్ని ఆరోపణలు చేసినా దీక్షను విరమించేది లేదన్నారు. పాల్వాయి తనపై చేసిన విమర్శలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నారన్నారు.
బాబూ.. ఎందుకు కలిసి ఉండాలి -గుత్తా సుఖేందర్‌రెడ్డి
2009 ఎన్నికలపుడు మేనిఫెస్టోలో తెలంగాణకు అనుకూలం అని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు ఏ విధంగా కలిసి ఉండాలని అంటున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌డ్డి ప్రశ్నించారు. తెలంగాణనేతల నాయకత్వంలోనే ప్రత్యేక రాష్ట్రం సాధించుకుందామని పిలుపునిచ్చారు. శీతకాల సమావేశాల్లో తెలంగాణపై తేల్చకుంటే పార్లమెంట్‌ను నడవనివ్వమని హెచ్చరించారు. రాష్ట్ర ఏర్పాటుకు ప్రతిచోటా సీమాంవూధులు అడ్డు తగులుతున్నారని, ఈ సారి తన్ని గుంజుకుం తప్ప రాష్ట్రం వచ్చే పరిస్థితి లేదన్నారు. యూపీఏ తెలంగాణ ఏర్పాటుపై ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేక రాష్ట్రం సాధించుకుందామని పిలుపునిచ్చారు.

Take By: T News
0 comments:
Post a Comment