రేపటి పూట మరో మాట!
- గత కృషి, భవిష్యత్ కార్యక్షికమంపై వివరణ
- పార్లమెంటు సమావేశాలు గట్టెక్కేందుకే.. తెలంగాణపై చర్చ రచ్చ కాకూడదనే..
- విపక్షాలు రాద్ధాంతం చేయకముందే ఒకటి రెండు రోజుల్లో ప్రకటన
- అది కూడా చిదంబరం నోటి నుంచే
- చిన్న రాష్ట్రాల డిమాండ్ల ప్రస్తావన
- విపక్ష, స్వపక్ష దాడిని తప్పించుకునేందుకు వ్యూహ రచనలో కేంద్ర ప్రభుత్వం!
న్యూఢిల్లీ, నవంబర్ 20 ():మంగళవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ విషయంలో కేంద్రం నుంచి ఒక ప్రకటన రానున్నదా? రాష్ట్ర విభజనపై విధానపరమైన నిర్ణయం తీసుకోవడంలో మీనమేషాలు లెక్కపెడుతున్న యూపీఏ ప్రభుత్వం.. ఈ సమావేశాలను సజావుగా సాగించుకునేందుకు మధ్యేమార్గాన్ని అనుసరించనున్నదా? పూటకో ప్రకటన చేస్తూ రాష్ట్రంలో అనిశ్చిత వాతావరణాన్ని కొనసాగిస్తోందని కేంద్రంపై మండిపడుతున్న విపక్షాలను శాంతపర్చేందుకు.. విపక్షాలతో గొంతు కలుపుతున్న అధికార పక్ష సభ్యుల ఆగ్రహాన్ని తాత్కాలికంగా సద్దుమణిగేలా చేసేందుకు పాచిక వేయనున్నదా? అవుననే అంటున్నాయి ఢిల్లీలోని ఏఐసీసీ వర్గాలు! తెలంగాణ అంశంపై రాబోయే పార్లమెంటు సమావేశాల్లో పెద్ద ఎత్తున రగడ జరగనున్న విషయాన్ని గుర్తించిన కేంద్రం.. ఈ అడ్డంకిని అధిగమించేందు కు ఒక ప్రకటన చేయనున్నదని తెలుస్తున్నది. ఇది తెలంగాణపై నిర్ణయాత్మక అడుగు కాకపోయినా.. తక్షణ గండం గట్టెక్కేందుకే ఉద్దేశించారని చెబుతున్నారు. తెలంగాణ విషయం లో ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్న హోం మం త్రి చిదంబరం తాజా ప్రకటన చేయనున్నారని తెలుస్తున్నది.
సెగల నేపథ్యంలోనే..
ఇప్పటికే వివిధ ఆందోళన రూపాలతో తీవ్ర స్థాయికి చేరిన తెలంగాణ ఉద్యమం.. ఇటీవలి సకల జనుల సమ్మెతో జాతీయ స్థాయిలో ప్రకంపనలు రేపింది! దీంతో కంగాత్తిన కాంగ్రెస్ అధిష్ఠానం ఉద్యమాన్ని శాంతపర్చేందుకు అనేక పాచికలు వేసింది. తెలంగాణపై యూపీఏ ప్రభుత్వం పార్లమెంటు సమావేశాల్లోపే ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నారని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. కానీ.. అవన్నీ నీటిమీద రాతలేనని తేలిపోయింది. తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షిస్తూ సాక్షాత్తూ ప్రధాని మన్మోహన్ ఇప్పుడప్పుడే తెలంగాణ ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టేశారు. దీంతో ఉద్యమక్షిశేణుల్లో మరింత ఆగ్రహం రాజుకుంది! ఈ సెగలు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా తాకుతాయన్న ఆందోళనలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉందని చెబుతున్నారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకే మరో ప్రకటన వెలువడనున్నదని తెలుస్తున్నది. ప్రభుత్వ ప్రకటనతో తెలంగాణ ఎంపీలు, మద్దతిస్తున్న పార్టీలు సంతృప్తి చెందినా.. చెందక పోయినా తెలంగాణ అంశం ఈ సమావేశాల్లో పదే పదే ప్రస్తావనకు రాకుండా చూసుకోవడమే యూపీఏ ఉద్దేశంగా కనిపిస్తోంది. సమావేశాలు ప్రారంభమైన ఒకటి రెండు రోజుల్లోనే ప్రభుత్వం తనకు తానుగా తెలంగాణపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
తెలంగాణ సమస్య పరిష్కారానికి గత సమావేశాల నుంచి ఇప్పటి వరకు సాధించిన పురోగతిని వివరించడంతో పాటు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అన్న దానిపై కూడా కొంత స్పష్టతనిచ్చి తెలంగాణ అంశాన్ని దాట వేయాలని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో యూపీ విభజన నేపథ్యంలో తెరమీదకొచ్చిన చిన్న రాష్ట్రాల డిమాండ్లను, ఎస్సార్సీని ప్రస్తావించి సంక్లిష్ట తెలంగాణ సమస్య పరిష్కారానికి మరింత సమయాన్ని కోరనుంది. మొత్తంగా చూస్తే తెలంగాణపై సభలో గందరగోళం నెలకొనే పక్షంలో ప్రతిపక్షాలతో సహా మిత్ర పక్షాలు కూడా అధికార పార్టీ వైపే వేలెత్తి చూపనున్నాయి. గతంలో కూడా తెలంగాణ సహా వివిధ అంశాల కారణంగా గందరగోళం ఏర్పడి.. ప్రభుత్వం తాను అనుకున్న అజెండాను సభలో చర్చించలేక పోయింది. సమయం లేకపోవడం వల్ల కొన్ని బిల్లులు పార్లమెంటు గడపతొక్కనే లేదు. మరి కొన్ని బిల్లులపై కొంత చర్చ జరిగినా అవి అమోదానికి నోచుకోలేదు. వాటితో పాటు కొత్త బిల్లులకు ఈ సమావేశాల్లో అమోదముద్ర వేయించు కోవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. రైతు సమస్యలు, ధరల పెరుగుదల, దెబ్బ తిన్న ఆర్థిక రంగం, నల్ల ధనం తదితర కీలకాంశాలపై సాగనున్న సుదీర్ఘ చర్చను దాటుకొని అనుకున్న సభా కార్యక్షికమాలను ఎలా పూర్తి చేసుకోవాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్న కేంద్రానికి తెలంగాణ అంశం మరింత అవరోధాన్ని సృష్టించనుంది. దీంతో ప్రత్యామ్నాయాలతో ఏదో ఒక రకంగా పార్లమెంటు సమావేశాలను సజావుగా పూర్తి చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణపై విధాన నిర్ణయ దిశగా అధికారిక ప్రకటన కానప్పటికీ విసృ్తతాభివూపాయం ద్వారానే తెలంగాణ సాధ్యమని ప్రధాని చెప్పిన రీతిలోనే కేంద్ర హోం మంత్రి చిదంబరంతో మరో ప్రకటన చేయించాలని చూస్తోందని సమాచారం.
Take By: T News
Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Azad, T News, hmtv, tv9, Harish Rao, MLA, Sima Andra, AP News, MP, Political News
0 comments:
Post a Comment