లిటిల్ డైరెక్టర్స్
శనివారం... ఉదయం తొమ్మిది గంటలు స్కూలు విద్యార్థులతో శిల్పారామం కళకళలాడింది బాలల చిత్రోత్సవాల చివరి రోజు కదా... ఈ రోజు మిస్సయితే మరో రెండేళ్ల దాకా బాలల సినిమాలు చూసే అవకాశం రాదు కాబట్టి చిత్రోత్సవాలు జరుపుకుంటున్న మూడు థియేటర్లు... ఫుల్ అయిపోయాయి.
సీట్లు సరిపోక చాలామంది సినిమాలు చూడలేకపోయారు కూడా.
ఆ మూడు థియేటర్లలో వండర్ లాండ్ ఒకటి. నిన్న(శనివారం) ఆ థియేటర్‌లో జరిగిన వండర్ ఏమిటంటే... మధ్యాహ్నం పన్నెండు గంటలకు ‘లిటిల్ డైరెక్టర్స్ కేటగిరీ’లో ఏడు సినిమాలు ప్రదర్శించారు. అవన్నీ షార్ట్‌ఫిల్మ్స్. పదిహేను నిమిషాల నుంచి రెండు నిమిషాల నిడివి గల చిత్రాలున్నాయి ఆ లిస్టులో.
ఫేంకాక్4, స్రీమ్ వర్సెస్8 హోలో నైట్, టెల్లూ, కభీ సోచా హై, ముంబయి, ఢిల్లీకి చెందిన చిత్రాలుకాగా, నిషధం(ద సేవేజ్), తుల్యం(ఈక్వల్), ధనం( చిత్రాలు కేరళ రాష్ట్రానికి చెందినవి. అయితే అందరి టాలెంట్ తెరపై అద్భుతంగా ఆవిష్కృతమైనప్పటికీ చివరి మూడు సినిమాలు మాత్రం చిత్రోత్సవాల చివరి రోజున ప్రత్యేకంగా నిలిచాయి. ఆ చిత్రాల ప్రదర్శన తిలకించేందుకు స్వయంగా కేరళ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఎం.కె. మునీర్ శిల్పారామంలో దిగాడు. దాంతో ఈ మూడు సినిమాలకు మరింత ఆసక్తి కలిగించాయి.
ఆ మూడు సినిమాల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... మూడు సామాజిక అంశాలపై తీసిని చిత్రాలవి. ‘నిషధం’...ఎయిడ్స్ వ్యాధితో బాధపడే పదేళ్ల చిన్నారి కథ అది. మరో చిత్రం ‘తుల్యం’... ఒకే కుటుంబమైనా కొడుకు కూతుళ్లను సమానంగా చూడలేని భారత సంస్కృతిపై తీసిన చిత్రం. ఇక మూడో సినిమా ‘దనం’... ఆడపిల్ల పెళ్లి చేయడానికి వరకట్నం ఎంతటి సమస్య అవుతుందో, దాని పరిష్కారం ఏమిటో ఈ చిత్రంలో చూడవచ్చు. ఈ చిత్రాల నిడివి 7-9 నిమిషాలు.
ఈ చిత్రాల వెనక ఆసక్తికరమైన కథ ఉంది. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక శ్రద్దతో నిర్చించిన చిత్రాలివి. ఈ లఘు చిత్రాలను నిర్మాణం కోసం కేరళ మొత్తం మీద 25 మంది అమ్మాయిలను ఎంపిక చేశారు. ఆ ఇరవై ఐదు మందిని ఐదుగురు చొప్పున ఐదు గ్రూపులు చేసి, వాళ్లకు దర్శకత్వం, స్క్రిప్టు రైటింగ్, కెమెరా... ఇలా అన్ని విభాగాల్లో శిక్షణ ఇప్పించారు. ఆ పిల్లలు తీసిన ఐదు సినిమాలను ‘25 గర్ల్స్ అండ్ దెయిర్ స్టోరీస్8’ పేరుతో ఒక సిరీస్8 చేశారు.
అయితే ఈ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలకు మాత్రం మూడు నగూప్-ఎ, గ్రూప్-బి, గ్రూప్-ఈ) సినిమాలే ఎంపికయ్యాయి. ప్రదర్శన ముగిసిన తరువాత ‘చిన్నపిల్లల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు, వారికి సామాజిక సమస్యల పట్ల అవగాహన పెంచేందుకు ప్రభుత్వం తరఫున కృషి చేస్తున్నామంటూ’ చెప్పుకొచ్చారు మినిస్టర్. ఆయన ఎంత సపోర్ట్ చేయకుంటే... తమ రాష్ట్రం తరఫున పాల్గొన్న పిల్లల కోసం ఇంతదూరం వచ్చి అందరి మధ్య కూర్చుని సినిమా చూస్తాడు?! మనవాళ్ల నుంచి కూడా ఇలాంటి ప్రోత్సాహం ఉంటే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో తెలుగు విద్యార్థులు సైతం తమ సృజనను చూపించేవారు. కానీ ప్రారంభోత్సవం మరుక్షణం నుంచి చివరి రోజు వరకూ థియేటర్స్ లోపలికి కనీసం అడుగుపెట్టని మన మంత్రులు, అధికారుల నుంచి అంతగా ఆశించడం అత్యాశే అవుతుంది.

Take By: T News - http://www.namasthetelangaana.com/Features/article.asp?Category=7&subCategory=8&ContentId=46593
Tags: T News, hmtv, tv9, Telangana agitation, statehood demand, Cinema, Images, sex, hot images, Movies, Tollywood, Bollywood, Hollywood, Dacanwood

0 comments:
Post a Comment