బి.ఇడి సీటు చాలా హాటు!
బి.ఇడి ఎంట్రన్స్‌ను తేలికగా తీసుకున్నవారు ఇప్పుడు
కౌన్సిలింగ్‌లో సీటు కోసం కుస్తీ పట్టవలసి ఉంటుంది. సోషల్ స్టడీస్‌లో,
బయోలాజికల్ సైన్స్, మేథమేటిక్స్ గ్రూపుల్లో ప్రతి సీటుకు ముగ్గురు
అభ్యర్థుల చొప్పున పోటీపడుతుంటే ఇక ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా,
ఐ.ఎ.ఎస్.ఇ. , కాకతీయ కాంపస్‌లలో సీటు రావాలంటే ర్యాంకు ఎంత కనిష్టంగా వుంటే
అంత సులువు అవుతుందని తెలిసిందే. 2011 కౌన్సిలింగ్ ముగింపు ర్యాంకుల
ఆధారంగా విశ్లేషణ.
బి.ఇడి సోషల్ స్టడీస్ మెథడాలజీలో 19,500 సీట్లు
ఉండగా, అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య 59,605. ఇక బి.ఇడి మేథమేటిక్స్
మెథడాలజీలో 16,250 సీట్లు ఉండగా, అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య 25,257.
బయోలాజికల్ మెథడాలజీలో 13,000 సీట్లు వుండగా, అర్హత సాధించిన అభ్యర్థుల
సంఖ్య 37,375. ఇక ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో 9,750 సీట్లు ఉండగా అర్హత
సాధించిన అభ్యర్థుల సంఖ్య 11,237, చివరగా బి.ఇడి ఇంగ్లీష్ మెథడాలజీలో 6,500
సీట్లు ఉండగా అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య 3193. బి.ఇడి సీట్లు,
సంబంధిత బి.ఇడి మెథడాలజీ సీట్లు, ఎడ్‌సెట్ పరీక్షలో అర్హత సాధించిన
అభ్యర్థుల సంఖ్యను బట్టి చూస్తే ఇంగ్లీష్ మెథడాలజీ మినహాయిస్తే అన్ని
మెథడాలజీలలో అందుబాటులో ఉన్న సీట్లకంటే అర్హత గల అభ్యర్థులే ఎక్కువ
సంఖ్యలో ఉన్నారు. ఇక గత ఏడాది బి.ఇడికి అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య
(1,92, 389) కంటే, ఈ ఏడాది బి.ఇడికి అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య
(1,36,667).
57 వేలు తగ్గినప్పటికీ నిర్థిష్ట మెథడాలజీలల్లో పోటీ
కనిపించటం విశేషం. డియస్సీ రిక్రూట్‌మెంటులో ఎస్.జి.టి. పోస్టులకు బి.ఇడి.
అభ్యర్థులను అనుమతించకపోవటంతో బి.ఇడి కోర్సుపై గ్రాడ్యుయేట్ అభ్యర్థులు
తక్కువ మోజు కనబరుస్తున్నారనేది తాజా ఎడ్‌సెట్ పోటీ స్పష్టం చేస్తోంది.
అయితే ఇందుకు భిన్నంగా ఆయా మెథడాలజీ బి.ఇడి కోర్సుల సీట్లకంటే పోటీపడే
అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనించాల్సిన విషయమే.
కేంపస్‌లో సీటు పొందాలంటే?
ఎడ్‌సెట్ పరీక్షలో బెస్ట్ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఎక్కువగా కోరుకునేవి యూనివర్సిటీ బి.ఇడి కోర్సులనే. ఉన్నత విద్యకు, ఉత్తమ సదుపాయాలకు యూనివర్సిటీలే కేంద్రాలు. అందుకే ఇవి అఫర్ చేసే బి.ఇడి సీట్లకు మంచి డిమాండ్ ఉంటుంది. హాస్టల్ వసతి అదనపు ఆకర్షణగా అభ్యర్థులు కేంపస్ బి.ఇడిలకు మొగ్గు చూపుతుంటారు. గత ఏడాది జరిగిన ఉస్మానియా వర్సిటీ కేంపస్ కాలేజీ బి.ఇడి.అడ్మిషన్స్‌లో బి.ఇడి సీట్లు కైవసం చేసుకున్న టాప్ ర్యాంకర్ల వివరాలు పరిశీలిస్తే బి.ఇడి మ్యాథ్స్ మెథడాలజీలో 8వ ర్యాంకర్ వుండగా, అలాగే ఫిజికల్ సైన్స్‌లో 26వ ర్యాంకర్, బయోలాజికల్ సైన్స్‌లో 1వ ర్యాంకర్, సోషల్ స్టడీస్‌లో 16వ ర్యాంకర్, ఇంగ్లీష్ మెథడాలజీలో 8వ ర్యాంకర్ అభ్యర్థులున్నారు.
అలాగే కాకతీయ యూనివర్సిటీ కేంపస్ బి.ఇడి. కాలేజీలో సీట్లు సాధించిన ర్యాంకర్ అభ్యర్థులు బిఇడి మ్యాథమెటికల్ మెథడాలజీలో 367వ ర్యాంకర్, బయోలాజికల్ సైన్స్‌లో 86వ ర్యాంకర్, సోషల్ స్టడీస్‌లో 14వ ర్యాంకర్, చివరగా ఇంగ్లీష్ మెథడాలజీ బి.ఇడిలో 26వ ర్యాంకర్ సీట్లు కైవసం చేసుకున్నారు. ఇదే పంథాలో టాప్ 100 నుంచి 500 ర్యాంకుల మధ్యన గల ర్యాంకర్లు ఆయా యూనివర్సిటీ కేంపస్ బి.ఇడి కాలేజీలలో సీట్లు పొందగలరు. ఉదాహరణకు బి.ఇడి. కేంపస్ సీట్లు ఇంకా ప్రైవేటు బి.ఇడి సీట్లు మొత్తం సంఖ్యలో 15శాతం సీట్లు యూనివర్సిటీయేతర అభ్యర్థులు మెరిట్ ర్యాంకుతో రాష్ట్రంలో ఎక్కడైనా బి.ఇడి. సీటును కోరుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో బి.ఇడి. సీట్లు ఉస్మానియా యూనివర్సిటీ (తెలంగాణ జిల్లాలు), ఆంధ్రా వర్సిటీ (కోస్తాంధ్ర జిల్లాలు), శ్రీవేంకటేశ్వర వర్సిటీలలో (రాయల సీమ జిల్లాలు) భర్తీ అవుతాయి.
100 సీట్లు గల బి.ఇడిలో 85 సీట్లు స్థానికులకు రిజర్వ్ చేయగా 15 సీట్లు స్థానికులు లేదా స్థానికేతరులు ఎవరైనా మెరిట్‌తో ఎంపిక అవుతారు. సాధారణంగా కేంపస్ బి.ఇడి సీటు డిమాండ్ ఉస్మానియా వర్సిటీకి ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర రాజధానిలో ఉస్మానియా యూనివర్సిటీ ఉండటంతో ఇక్కడకు వచ్చి కోర్సు చేస్తే బహుముఖ అవకాశాలు దక్కుతాయన్న అభిప్రాయం అభ్యర్థుల్లో వుంది. దానితో ఉస్మానియా బి.ఇడి కోర్సు పట్ల ఇతర యూనివర్సిటీ అభ్యర్థులు ఆసక్తి చూపుతుంటారు. యూనివర్సిటీ కాలేజీ బి.ఇడి. అభ్యర్థులకు ప్రముఖ కార్పోరేట్ సంస్థలో ప్లేస్‌మెంట్స్ ఇస్తుండటంతో కేంపస్ కోర్సులకు డిమాండ్ ఉంటోంది.
ఐ.ఎ.ఎస్.ఇ అంటే క్రేజ్
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (ఐ.ఎ.ఎస్. ఇ.) ఆఫర్ చేస్తున్న బి.ఇడి కోర్సులకు అభ్యర్థుల నుంచి మంచి డిమాండ్ ఉంది. ఉదా॥ మాసాబ్‌ట్యాంకులోని ఐ.ఎ.ఎస్.ఇ. విద్యా సంస్థ 1959లో ఏర్పాటైన పురాతన కాలేజీగా ఖ్యాతి గడించింది. ఇదిలా ఉండగా ప్రభుత్వ బి.ఇడి. కాలేజీల్లో ఒకటైన కాలేజీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ సంస్థలు ఆఫర్ చేస్తున్న బి.ఇడి కోర్సులకు ర్యాంకర్లు మొగ్గు చూపుతున్నారు. పటిష్టమైన విద్యాబోధన అందించే సీనియర్ క్వాలిఫైడ్ లెక్చరర్లు ఐ.ఎ.ఎస్.ఇ.;సి.టి.ఇ.లలో ఉండటం, అత్యంత తక్కువగా ఫీజు చెల్లించి బి.ఇడి ని సొంతం చేసుకునే అవకాశం ఉంటున్న దృష్ట్యా ఇక్కడి బి.ఇడి కోర్సులకు డిమాండ్ ఉంటోంది.
మాసాబ్‌ట్యాంక్‌లోని ఐ.ఎ.ఎస్.ఇ.లో 2011 బి.ఇడి సీట్లు పొందిన టాప్ ర్యాంకర్లను పరిశీలిస్తే, మ్యాథమెటిక్స్ మెథడాలజీలో 46వ ర్యాంక్, ఫిజికల్ సైన్స్‌లో 208వ ర్యాంక్, బయోలాజికల్ సైన్స్‌లో 25వ ర్యాంకర్, సోషల్ స్టడీస్‌లో 46వ ర్యాంకర్ చివరగా ఇంగ్లీష్ మెథడాలజీలో 30వ ర్యాంక్ అభ్యర్థులు అడ్మిషన్లు కైవసం చేసుకున్నారు.
ప్రఖ్యాత బి.ఇడి. కాలేజీలు
రాష్ట్రంలో బి.ఇడి మొత్తం కాలేజీలు 605, ఇందులో మొత్తం సీట్లు 65వేలు ఉన్నాయి. ఫీజుల పరంగా సౌలభ్యం ఇతర సదుపాయాలపరంగా సౌకర్యం గల కేంపస్, గవర్నమెంట్ బి.ఇడి.కాలేజీల సంఖ్య పట్టుమని 15 మించడం లేదు. ఇందులో మొత్తం బి.ఇడి సీట్లు సంఖ్య 2వేలకు మించదు. పోటీకీ సమీపంలో గల ఎయిడెడ్ కాలేజీలలో ఫీజులు సాధారణంగానే ఉన్న దృష్ట్యా కొంతమంది అభ్యర్థులు సదరు బి.ఇడి. కోర్సుల వైపు చూస్తున్నారు.
ఎక్కువభాగం బి.ఇడి సీట్లు ప్రైవేట్ బి.ఇడి కాలేజీలలో అందుబాటులో ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ బి.ఇడి. కాలేజీలు కేంపస్ కాలేజీలతో పోటీపడేలా బి.ఇడి కోర్సును ఆఫర్ చేస్తూ అభ్యర్థులకు మౌలిక సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఫీజులు మాత్రం కాస్త భారీగానే చెల్లించాల్సిందే. గత ఏడాది ప్రైవేటు కాలేజీలలో బి.ఇడి సీటు పొందాలంటే రూ. 16,500 ట్యూషన్ ఫీజు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదిలా వుండగా, కేంపస్ బి.ఇడి కాలేజీలలో రూ.8,000 ఉండగా ఐ.ఎ.ఎస్.ఇ విద్యా సంస్థల్లో రూ.3000లతో బి.ఇడి కోర్సు చేసే అవకాశం ఉంటున్నది.
ఇంకా ఎస్.సి. , బి.సి, ఎస్.టి.కి చెందిన నిర్థిష్ట రూ.లక్ష రూపాయల కుటుంబ వార్షికాదాయం గల వారికి బి.ఇడి ట్యూషన్ ఫీజు మొత్తం ప్రభుత్వం నుంచి కాలేజీలకు రీయం బర్స్‌మెంటు లభించటం అభ్యర్థులకు తెలిసిందే.
Take By: T News
0 comments:
Post a Comment