రాయల రచ్చ
-ఎందుకొస్తున్నదీ ప్రస్తావన?
-తెలంగాణపై హస్తినలో కదలిక వచ్చినప్పుడే తెరమీదకు రాయల తెలంగాణ డిమాండ్
-ఒకరిద్దరు రాజకీయ నేతల్లో తప్ప సీమ ప్రజల్లో లేని ఆ కోరిక
-అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలా?
-రాష్ట్రం ఇవ్వడానికా? పీటముడి వేయడానికా?
తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడ ఏళ్ళ తరబడి ఉద్యమం జరుగుతున్నది. ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. రాష్ట్ర సాధన కోసం ఇంకా రాజకీయ పక్షాలు, వివిధ సంఘాలతో ఉద్యమ పోరాటం నడుస్తూనే ఉంది. తెలంగాణ ప్రాంత ప్రజలు పది జిల్లాల సొంత రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు రాజకీయ నేతలు వ్యూహాత్మకంగా రాయల తెలంగాణ డిమాండ్‌ను తెరమీదకు తీసుకొస్తున్నారు. రాయలసీమకు చెందిన కొందరు నాయకులు గత కొన్ని రోజులుగా ఢిల్లీకి చక్కర్లు కొడుతూ ఈ ప్రచారం కొనసాగేలా చూస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణలోని పది జిల్లాలతోపాటు సీమలోని రెండు జిల్లా లు కర్నూలు, అనంతపురంలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటుచేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ తతంగం వెనుక అనేక మతలబులు, రాజకీయాలున్నాయనే అభివూపాయాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ తప్ప రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదు. రాయల తెలంగాణపై ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటు. రాయల తెలంగాణ పేరిట మరోసారి తెలంగాణ ప్రజలను సీమాంధ్ర పడగ నీడలోకి నెట్టివేసే కుట్ర. ఈ ప్రతిపాదన తెచ్చేవారంతా తెలంగాణ ద్రోహులే. వీరికి వ్యతిరేకంగా శుక్ర, శనివారాల్లో తెలంగాణవ్యాప్తంగా వారి దిష్టిబొమ్మలను దహనం చేయాలి.
-తెలంగాణపై హస్తినలో కదలిక వచ్చినప్పుడే తెరమీదకు రాయల తెలంగాణ డిమాండ్
-ఒకరిద్దరు రాజకీయ నేతల్లో తప్ప సీమ ప్రజల్లో లేని ఆ కోరిక
-అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలా?
-రాష్ట్రం ఇవ్వడానికా? పీటముడి వేయడానికా?
తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడ ఏళ్ళ తరబడి ఉద్యమం జరుగుతున్నది. ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. రాష్ట్ర సాధన కోసం ఇంకా రాజకీయ పక్షాలు, వివిధ సంఘాలతో ఉద్యమ పోరాటం నడుస్తూనే ఉంది. తెలంగాణ ప్రాంత ప్రజలు పది జిల్లాల సొంత రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు రాజకీయ నేతలు వ్యూహాత్మకంగా రాయల తెలంగాణ డిమాండ్‌ను తెరమీదకు తీసుకొస్తున్నారు. రాయలసీమకు చెందిన కొందరు నాయకులు గత కొన్ని రోజులుగా ఢిల్లీకి చక్కర్లు కొడుతూ ఈ ప్రచారం కొనసాగేలా చూస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణలోని పది జిల్లాలతోపాటు సీమలోని రెండు జిల్లా లు కర్నూలు, అనంతపురంలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటుచేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ తతంగం వెనుక అనేక మతలబులు, రాజకీయాలున్నాయనే అభివూపాయాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ తప్ప రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదు. రాయల తెలంగాణపై ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటు. రాయల తెలంగాణ పేరిట మరోసారి తెలంగాణ ప్రజలను సీమాంధ్ర పడగ నీడలోకి నెట్టివేసే కుట్ర. ఈ ప్రతిపాదన తెచ్చేవారంతా తెలంగాణ ద్రోహులే. వీరికి వ్యతిరేకంగా శుక్ర, శనివారాల్లో తెలంగాణవ్యాప్తంగా వారి దిష్టిబొమ్మలను దహనం చేయాలి.
- ప్రొఫెసర్ కోదండరాం , తెలంగాణ జేఏసీ చైర్మన్
ఆంధ్రతో విలీనం చేసిన తెలంగాణ ప్రాంతాన్నే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి. రాయల తెలంగాణ ఏర్పాటుకు నేను వ్యతిరేకం. నేను రాయల తెలంగాణకు సానుకూలమంటూ జరిగిన ప్రచారాన్ని నమ్మొద్దు.
- గండ్ర వెంకటరమణాడ్డి, చీఫ్‌విప్
హైదరాబాద్, జూన్ 28 (టీ మీడియా):రాయలసీమలోని ప్రజల నుంచి ఇప్పటివరకు రాయల తెలంగాణ డిమాండ్ వినిపించకపోయినా కేవలం ఇద్దరు, ముగ్గురు సీమ నేతలు తరచూ ఈ ప్రతిపాదనను వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకొస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి హస్తినలో కదలిక వచ్చినప్పుడల్లా ఆ నేతలు రాయల తెలంగాణ ప్రతిపాదనలు ముందుకు నెడుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేతలు కొందరు సైతం ఆ ప్రతిపాదనలకు గళం కలుపుతుండటం గమనార్హం. సీఎం మార్పు ఉంటుందని, త్వరలో తెలంగాణ రాష్ట్రం వస్తుందని రాష్ట్ర మంత్రి జానాడ్డి గురువారం నల్గొండ జిల్లాలో వెల్లడించారు. అదే సమయంలో ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణాడ్డి వరంగల్‌లో మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం రాయల తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. అయితే అనంతరం మాట మారుస్తూ రాయలతెలంగాణను ఏర్పాటు చేసే విషయంపై కేంద్ర ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నదని మాత్రమే తాను చెప్పానని అన్నారు.
అసలు రాయల తెలంగాణ అనే ప్రస్తావన ఎందుకు వస్తున్నది? ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికా? లేక తెలంగాణకు పీటముడి వేయడానికా? తెలంగాణ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం, కేంద్రం అడుగులు వేస్తున్న తరుణంలోనే ఈ ప్రతిపాదనలు రావడంపై రాజకీయవర్గాల్లో, ముఖ్యంగా తెలంగాణవాదుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రజలు తమ డిమాండ్‌పై ఎంతో కాలంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు చేస్తుంటే, సమయం, సందర్భం లేకున్నా కొందరు రాయల తెలంగాణకు ఎలాంటి అభ్యంతరం లేదంటుండటంపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ఈ ప్రతిపాదన వెనుక వారి రాజకీయ స్వార్థ ప్రయోజనాలే తప్ప మరో కారణం లేదనే విషయం స్పష్టమవుతోంది. కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజలు ఏనాడైనా రాయల తెలంగాణ కోరుకున్నారా? ఆ దిశగా ఉద్యమాలు, ఆందోళనలు చేశారా? .. అలాంటి దాఖలాలే కనిపించవు. ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం రాయల తెలంగాణ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి ఇలాంటప్పుడు రాయల తెలంగాణ ఎందుకు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. తాము రాయల తెలంగాణకు అంగీకరించే ప్రసక్తే ఉండదని తెలంగాణవాదులు కుండబద్దలు కొడుతున్నారు. తెలంగాణ రాజకీయ జేఏసీ నిరసన కార్యక్షికమాలకు కూడా పిలుపునిచ్చింది. పది జిల్లాల తెలంగాణ తప్ప మరేదీ తమకు సమ్మతం కాదని మరోమారు స్పష్టం చేసింది.
ఆ ముగ్గురి వల్లే..
రాయల తెలంగాణ ప్రస్తావన రావడానికి ఆ ముగ్గురే కారణం అనేది ప్రధానంగా కనిపిస్తుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును మజ్లిస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నది. తెలంగాణ వస్తే బీజేపీ బలపడుతుందని, భవిష్యత్తులో తమ ఉనికితోపాటు ముస్లింలకు ప్రమాదకరంగా మారుతుందనే ఆందోళన మజ్లిస్ పార్టీని వెంటాడుతున్నది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ముస్లింలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అక్కడ బీజేపీ ప్రభావం అంతగా లేదని, తెలంగాణలోని 10 జిల్లాలతో ఆ రెండు జిల్లాలను కలుపుకుని రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ఆధిపత్యానికి అడ్డుకట్టవేయవచ్చని మజ్లిస్ భావిస్తోంది. మజ్లిస్ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆ కోణంలోనే రాయల తెలంగాణ వైపు మొగ్గుచూపినట్లు పార్టీ వర్గాల సమాచారం. రాష్ట్ర విభజన అనివార్యమైన పక్షంలో రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ఒవైసీ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. కాగా తొలుత సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించిన మంత్రి టీజీ వెంక మాజీ మంత్రి జేసీ దివాకర్‌డ్డి ఇప్పుడు పదే పదే రాయల తెలంగాణ ప్రస్తావన తీసుకొస్తున్నారు.
వ్యాపార సంబంధాలను దృష్టిలో పెట్టుకుని టీజీ వెంక రాయల తెలంగాణకు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇక అనంతపురం, కర్నూలు జిల్లాలతో కలుపుకుని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే తనకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, ప్రధానంగా చిత్తూరు జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, కడప జిల్లాకు చెందిన జగన్ లాంటి నేతలతో తన రాజకీయ ఎదుగుదల, పదవులకు ఎలాంటి ఆటంకం ఉండబోదని, భవిష్యత్తులో తాను కూడా బలమైన రాజకీయ నేతగా ఎదిగేందుకు వీలుకలుగుతుందని జేసీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఆయన కూడా ఈ మధ్య గట్టిగా వాదిస్తూ చీటికి మాటికి రాయల తెలంగాణ ప్రతిపాదన తెరమీదకు తీసుకొస్తున్నారు. ఈ ముగ్గురు తప్ప ఇటు తెలంగాణలో, అటు సీమలోని ఆ రెండు జిల్లాల్లో రాజకీయ నేతలు ఎవరు కూడారాయల తెలంగాణ కావాలని డిమాండ్ చేయడం లేదు.
సంస్కృతి వేరు.. సమస్యలు జోరు
తెలంగాణ ప్రాంత ప్రజల, సీమలోని రెండు జిల్లాల ప్రజల సంస్కృతి, ఆచార వ్యవహారాలు, చరిత్ర వేర్వేరు. రెండు ప్రాంతాల ప్రజల మధ్య నీటి సమస్యలు కూడా తీవ్రంగానే ఉన్నాయి. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) నీటి వినియోగంపై మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లా ప్రజల మధ్య వివాదం నడుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఏ రకంగానూ సబబు కాదని మేధావులు, రాజకీయ విశ్లేషకులు అభివూపాయపడుతున్నారు. రాయల తెలంగాణ ఏర్పాటు వెనుక కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది మాత్రం స్పష్టమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి 42 మంది ఎంపీలు, 294 మంది ఎమ్మెల్యేలు ఉండగా, రాయల తెలంగాణ ఏర్పాటుతో ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్యాబలం అందులో సరిగ్గా సగమవుతుంది. అంటే రాయల తెలంగాణ, ఆంధ్రాలో 21 మంది చొప్పున ఎంపీలు, 147 మంది చొప్పున ఎమ్మెల్యేలు ఉండేందుకు వీలు కలుగుతుందే తప్ప తెలంగాణ ప్రాంతానికి, ఇక్కడి ప్రజలకు పెద్దగా ప్రయోజనం ఉండదని తెలంగాణవాదులు అభివూపాయపడుతున్నారు.
జనం వ్యతిరేకిస్తారు: పయ్యావుల కేశవ్
రాయల తెలంగాణ అనేది బాధ్యత లేని నేతల ప్రతిపాదన అని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఈ ప్రతిపాదనను సామాన్య జనం వ్యతిరేకిస్తారని ఆయన అన్నారు. తెలంగాణలోని పది జిల్లాలతోపాటు అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తున్న తరుణంలో పయ్యావుల ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు.
గండ్రకేమన్న హైకమాండ్ చెప్పిందా: సారయ్య
వరంగల్ సిటీ, జూన్ 28 (టీ మీడియా): ‘రాయల తెలంగాణ ఇస్తామని హైకమాండ్ ఏమన్న గండ్ర వెంకటరమణాడ్డితో చెప్పిందా? ఆయన ఏమన్న హైకమాండ్‌తో మాట్లాడారా’ అని మంత్రి బస్వరాజు సారయ్య ప్రశ్నించారు. గురువారం వరంగల్‌లో ఆయన మాట్లాడారు. రాయల తెలంగాణ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, ఈ విషయాన్ని గండ్ర చెప్పారని విలేకరులు సారయ్య దృష్టిగాతేగా ఆయన పై విధంగా స్పందించారు. నేను తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోరం కన్వీనర్‌ను, ఏ తెలంగాణ అన్నది కాదు తెలంగాణ మాత్రం వస్తుందని వివరించారు. నేను రాయల, ఆంధ్రా అని చెప్పడం లేదు, తెలంగాణ మాత్రం వస్తుందని వ్యాఖ్యానించారు.
రాయల తెలంగాణకు కేంద్రం ఓకే: గండ్ర
-సాయంవూతానికి మాటమార్చిన చీఫ్‌విప్
-విలీనమైన తెలంగాణే కోరుతున్నామని వివరణ
వరంగల్, ప్రతినిధి: అనంతపురం, కర్నూలు జిల్లాలను కలుపుకొని రాయలతెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణాడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలతెలంగాణ ఏర్పడినా హైదరాబాదే రాజధానిగా ఉంటుందని, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని వస్త్తున్న ప్రతిపాదనలను తాము వ్యతిరేకిస్తామన్నారు. రాష్ట్రపతి ఎన్నికకు, తెలంగాణ అంశానికి సంబంధం లేదన్నారు. గురువారం వరంగల్‌లో ఆయన మాట్లాడారు. అనంతపురం, కర్నూలుతో కలుపుకొని రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు తమకు సమచారం ఉందన్నారు. కృష్ణాజలాల విషయంలో, అసెంబ్లీలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం ఆమోదం పొందాలంటే కచ్చితంగా సంఖ్యాబలం కావాలని అన్నారు. బహుశా ఆ కారణంగా కేంద్రం ఆ రెండు జిల్లాలను కలుపుకొని రాయల తెలంగాణ ప్రతిపాదనకు వస్తోందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్ మండిపడటంతో సాయంవూతానికి గండ్ర మాటమార్చారు. గతంలోనే ఎంపీలు ఒవైసీ, కేసీఆర్ రాయల తెలంగాణను కేంద్రం ప్రతిపాదించిందని చెప్పారని గుర్తు చేశారు. తాను సైతం అదే ప్రతిపాదన ఉందని మాత్రమే చెప్పానని వివరించారు. తమకు పాత హైదరాబాద్ రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు.
Take BY: T News
0 comments:
Post a Comment