Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Friday, June 29, 2012

సెక్రటేరియట్..వలసల ఎస్టేట్



SECRETAR-సచివాలయంలో తెలంగాణ ఫెయిర్ షేర్ మాయం-ఉద్యోగాల్లో సీమాంవూధుల తిష్ఠ
-అగ్రక్షిశేణి ఉద్యోగాల్లో అందరూవాళ్లే
-తెలంగాణోళ్లు నాలుగో తరగతి ఉద్యోగులే
-ఏళ్లు గడుస్తున్నా తొలగని వ్యత్యాసాలు
-అడగడుగునా ఒప్పందాల ఉల్లంఘన
-సరిచేస్తామంటూ కుప్పలుగా కమిషన్లు
-అతీగతీ లేకుండాపోయిన నివేదికలు
-తాజాగా రంగంలోకి రాయ్‌కోటి కమిషన్
-జ్యుడీషియల్ అధికారాల్లేని ‘ఏకసభ్య’

graffహైదరాబాద్, జూన్ 24 ():సచివాలయం! రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువు. ఇక్కడ వేల మంది ఉద్యోగులు పరిపాలనలో భాగస్వాములై రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తున్నారు. సెక్రెటెరియట్ లో ప్రధానంగా ఎనిమిది బ్లాకులలో 40 ప్రధాన శాఖలు పని చేస్తున్నాయి. వీటికి అనుబంధంగా మహానగరంలో 180 హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్లు పనిచేస్తున్నాయి. సెక్రెటెరియట్ లో జరిగిన అన్ని నియామకాలలో ఉల్లంఘనలు జరిగాయి. ఉల్లంఘనలన్నీ యదార్థమేనని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన గిర్‌గ్లానీ కమిటీ సోదాహరణంగా వివరించింది. ప్రధానంగా సెక్రెటెరియట్ లో ఉద్యోగులకు చెందాల్సిన ఫెయిర్‌షేర్ 42 శాతం వాటా ఎప్పుడూ కూడా తెలంగాణ ప్రాంతానికి దక్కలేదు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుండి అడిషనర్ సెక్రటరీ స్థాయి వరకు ఏ హోదాలో కూడా తెలంగాణకు దక్కాల్సిన 42% వాటా దక్కలేదు. ఈ అసంతృప్తుల నుండే తెలంగాణ ఉద్యమం పెల్లుబుకుతున్నది. పెద్దమనుషుల ఒప్పందం నుండి 2011 అక్టోబర్ 24న జరిగిన సకల జనుల సమ్మె విరామ ఒప్పందం వరకు అన్ని నిబంధనలను, అంగీకారాలను ఉల్లంఘించారు. వ్యతిరేకించారు. ప్రధానంగా సెక్రెటెరియట్ లో నియామకాలలో దిగువ స్థాయి నుండి అన్యాయానికి పాల్పడ్డారు.14.8.1956లో జరిగిన పెద్దమనుషుల ఒప్పందాలలో 14 అంశాలను చేర్చారు. వీటన్నింటిలో ప్రధానమైనదే ఉద్యోగుల నియామకం. ఉద్యోగుల నియామకాలలో తప్పకుండా హైదరాబాద్ స్టేట్‌లో అమలులో ఉన్న ముల్కీ నిబంధనలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఒప్పందాలను
ఉల్లంఘించి వందల సంఖ్యలో సీమాంధ్ర నుండి యువకులను తీసుకొచ్చి సెక్రెటెరియట్ లో నియమించారు. ఉర్దూ మీడియంలో చదువుకున్న యువకులకు తెలుగులో పరీక్షపెట్టి అనుత్తీర్ణులను చేశారు.

హైదరాబాద్ స్టేట్‌లో ఉద్యోగులకు ఆంధ్ర ఉద్యోగులకన్నా వేతనాలు ఎక్కువగా ఉండేవి. సెక్రెటెరియట్ లో సీనియర్ అసిస్టెంట్‌కు హైదరాబాద్ స్టేట్‌లో 135-200 జీతం స్కేల్ ఉండేది. ఇదే క్యాడర్‌లోని సీమాంధ్ర
ఉద్యోగికి 90-170 వేతనం ఉండేది. ఈ వ్యత్యాసాలను క్రమబద్ధీకరించే పేరుతో తెలంగాణ ఉద్యోగులకు 35 శాతం వేతనాన్ని కత్తిరించారు. 100- 200 దగ్గర స్థిరీకరించారు. ఈ సందర్భంలోనే టీఎన్జీవో
నాయకత్వంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వ్యత్యాసాలను పరిశీలిస్తామని తెలంగాణ ఉద్యోగులకు న్యాయం చేస్తామని పాలకులు హామీ ఇచ్చారు. పెద్దమనుషుల ఒప్పందంలో అంగీకరించిన 14 అంశాలను తుంగలో తొక్కారు. 1969లో 369 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకొని ఆరు సూత్రాలను ప్రకటించారు. ఈ సూత్రాలలో ప్రధానంగా ఉద్యోగుల నియామకాలకే ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఈ ఆరుసూవూతాలను కూడా పాతర పెట్టారు. ఈ క్రమంలోనే 610 జీవోను, గిర్‌గ్లానీ సిఫారసులను, గిర్‌గ్లానీ సిఫారసుల అమలు కోసం వచ్చిన జీవోలను, మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులను, శాసనసభా సంఘం సిఫారసులను ఉల్లంఘించారు.

మార్చి 4-2011 న జరిగిన ఒప్పందాలలో ఉల్లంఘనలన్నింటినీ చర్చించేందుకు పరిష్కరించేందుకు జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేస్తామని, జ్యుడిషియల్ కమిటీకి అన్నీ సమస్యలను తెలియపరచవచ్చునని ఒప్పందాలలో పేర్కొన్నారు. ఒప్పందాల ప్రకారం రాయ్‌కోటి కమిటీని ఏర్పరిచినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించడానికి వీలుగా జ్యుడిషియల్ అధికారాలు లేని ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఒప్పందాలన్నింటినీ పాతర పెట్టారని చెప్పడానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ.

sachivalayamచిన్న స్థాయి ఉద్యోగాల్లోనూ వివక్షే
పెద్ద ఉద్యోగాలే కాదు.. చిన్న స్థాయి ఉద్యోగాలలో కూడా పాలకులు తెలంగాణపట్ల వివక్షను కొనసాగిస్తున్నారు. ఇందుకు డ్రైవర్ల నియామకమే ఒక నిదర్శనం. 1985 నాటికి ఒక్క సెక్రెటెరియట్ లో మొత్తం 310 మంది డ్రైవర్లు పనిచేసేవారు. 2012 జూన్ వచ్చేసరికి వీరి సంఖ్య 75కు చేరుకున్నది. ఈ అంశంపై సెక్రెటెరియట్ లో డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షుడు యాసిన్‌ను టీ మీడియా సంప్రతించినప్పుడు ఆయన చాలా విషయాలు ప్రస్తావించారు. తెలంగాణ ప్రాంతం నుండి నిరుద్యోగులు ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చి కనీసం డైవ్రర్లుగానైనా సెటిల్ అవుదామని 1986, 1987లలో ఎక్కువ సంఖ్యలో వచ్చారని, అయితే
డ్రైవర్ల ఉద్యోగాల కోసం తెలంగాణ జిల్లాల నుండి ఎక్కువ సంఖ్యలో వస్తుండటంతో మొత్తం పోస్టులనే అబాలిష్ చేస్తూ వచ్చారని ఆయన చెప్పారు. మూడు వందల వాహనాలను సెక్రెటెరియట్ లో అధికారులు
ఉపయోగించుకుంటున్నారని, వీరందరూ ఔట్‌సోర్సింగ్ నుండి వచ్చినవారేనని, వాహనాలన్నీ కూడా ఆంధ్ర ట్రావెల్స్‌కు చెందిన యజమానులవేనని యాసిన్ చెప్పారు. సెక్రెటెరియట్ లో తెలంగాణ నిరుద్యోగులకు
జరుగుతున్న అన్యాయాలకు ఇదో ప్రత్యక్ష ఉదాహరణ. నిబంధనల ప్రకారం జాయింట్ సెక్రటరీ హోదా నుండి మాత్రమే కారు సౌకర్యం ఉన్నప్పటికీ డిప్యూటీ సెక్రటరీ హోదా నుండి కారు
ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా రాష్ట్ర ఖజానాపైన భారం వేస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల ఆరోపణ. సెక్రెటెరియట్ లో 2012 జూన్‌నాటికి దాదాపు 104మంది ఐఏఎస్
అధికారులు వివిధ హోదాలలో పనిచేస్తున్నారు.

ఒక్కొక్క అధికారి సగటున మూడు కార్లను ఉపయోగించుకుంటున్నారని అధికారిక అంచనా. ఒక్కొక్క ఐఏఎస్ అధికారి అల డ్రైవర్లు, అటెండర్ల జీతాలు అన్నీ వసతులతో కలిపి నెలకు లక్షరూపాయల వరకు బిల్లులు చేస్తున్నారని అధికారిక నివేదికలే తెలియచేస్తున్నాయి. ఒకవైపు సాక్షాత్తు ఆర్థికమంత్రే ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిందిగా ఖర్చులు తగ్గించుకోవాలని ఉత్తర్వులు జారీ చేస్తున్నప్పటికీ, సాధారణ ఉద్యోగులకు మెడికల్ బిల్లులు కూడా చెల్లించడానికి కూడా మీనమేషాలు లెక్కిస్తున్నప్పటికీ, అధికారులు తమ విలాసాల విషయంలో మాత్రం ఎప్పుడు ఆలోచించరని అధికారిక ఖర్చుల పట్టికలే తెలియచేస్తున్నాయి. ఐఏఎస్‌లు, మంత్రుల విలాసాల ఖర్చులలో మార్పులు ఉండడం లేదనేది చాలాకాలంగా ఉన్న విమర్శ.

సెక్రెటెరియట్ లో లిఫ్ట్ ఆపరేటర్ నుండి అడిషనల్ సెక్రటరీ స్థాయి వరకు మొత్తం 14 క్యాడర్లు ఉన్నాయి. ఈ 14 విభాగాలలో ఏ విభాగంలో కూడా తెలంగాణవారికి ఫెయిర్‌షేర్ లభించలేదు. మరో చిత్రమేమిటంటే లిఫ్ట్ ఆపరేటర్ వంటి దిగువస్థాయిలో 68శాతం ఉద్యోగులు తెలంగాణ వారు పనిచేస్తుండగా అడిషనల్ సెక్రటరీ వంటి ఉన్నతస్థాయిలో 7శాతం మాత్రమే అధికారులు తెలంగాణ వారు ఉన్నారు.

ఉద్యమపథంలో టీఎన్జీవోలు
సెక్రెటెరియట్ లో తెలంగాణ ఎన్‌జీవో యూనియన్ చాలా బలమైన సంఘం. మొత్తం 2760 మంది ఉద్యోగులలో 659 మంది మాత్రమే తెలంగాణ ఉద్యోగులు. సంఖ్యాబలంలో తెలంగాణ ఎన్జీవో అసోసియేషన్
తక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణవాదాన్ని ఝంఝామారుతం మాదిరిగా వినిపించడంలో మహోన్నత భూమిక పోషిస్తున్నది. ప్రస్తుత అధ్యక్షులు నరేందర్‌రావు, ప్రధానకార్యదర్శి సురేశ్‌కుమార్‌ల సారధ్యంలో సహాయ నిరాకరణ, సకల జనుల సమ్మె ఉద్యమాలలో వెలుపల ఎంత బలమైన ఉద్యమాలు నిర్మించారో అంతేబలంగా సెక్రెటెరియట్ లో తెలంగాణ ఎన్జీవో యూనియన్ నాయకత్వంలో మంత్రుల కుర్చీలను కూడా గడగడలాడించి తెలంగాణ ఖ్యాతిని నిలబెట్టింది. సకల జనుల సమ్మె సందర్భంలో తెలంగాణ మంత్రులు సెక్రెటెరియట్ లో రావాలం భయపడిపోయారు. 1956 నవంబర్ 1 నుండి కూడా సెక్రెటెరియట్ లో తెలంగాణ ఎన్జీవో యూనియన్ తెలంగాణ వాదాన్ని ఖండితంగా, నిక్కచ్చిగా, నిజాయితీగా, నిబద్ధతతో, సైద్ధాంతిక పునాదితో, సగర్వంగా వినిపిస్తునే ఉన్నది. స్వామినాధం వంటి నాయకులు ఈ సంస్థకు కొత్త ఊపిర్లు ఊదారు. ఈ క్రమంలోనే 17.5.2010లో ఆనాటి అధ్యక్షులు గంధం సురేశ్‌కుమార్, ప్రధానకార్యదర్శి బీ శ్రవణ్‌కుమార్‌డ్డిల సారధ్యంలో శ్రీకృష్ణకమిటీకి సెక్రెటెరియట్ లో తెలంగాణ వివక్షను సోదాహరణంగా వివరిస్తూ ఒక పూర్తిస్థాయి నివేదికను సమర్పించారు. 1956 పెద్ద మనుషుల ఒప్పందం నుండి సకల జనుల సమ్మె వరకు పాలకులు చేసిన ఉల్లంఘనలన్నింటినీ శ్రీకృష్ణకమిటీకి ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు.

సెక్రెటెరియట్ లో ఉద్యోగుల సంఖ్యలు వివరించి ఫెయిర్‌షేర్‌కు జరిగిన అన్యాయాన్ని వివరించారు. అదే విధంగా ఈ సంస్థ గతంలో జైభారత్‌డ్డి కమిషన్, గిర్‌గ్లానీ కమిషన్, శాసనసభాసంఘం, మంత్రివర్గ ఉపసంఘం, తదితర అన్నీ సంఘాలకు, సంస్థలకు తెలంగాణకు సెక్రెటెరియట్ లో జరిగిన విద్రోహాన్ని సోదాహరణంగా వివరిస్తూ నివేదికలను అందించింది. హన్మంతడ్డి సారధ్యంలో సీమాంధ్ర ఉద్యోగుల సంఘం కూడా చాలా బలంగా పనిచేస్తున్నది. సెక్రెటెరియట్ లో వరకు ఉద్యోగుల మధ్య వ్యత్యాసాలు చాలా వరకు కనిపించవు. సకల జనుల సమ్మె సందర్భంలో తెలంగాణ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేస్తే ఆంధ్ర ఉద్యోగులు విడిపించుకొచ్చారు. తెలంగాణవాదంలో నిజాయితీ, న్యాయం ఉన్నాయని ఆంధ్ర ఉద్యోగుల సంఘాలు నమ్ముతున్నాయి. తెలంగాణ అధ్యక్ష కార్యదర్శులు, సీమాంధ్ర అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు చాలా స్నేహపూరితంగా సమస్యలను పరిష్కరించుకోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

మహిళా ఉద్యోగులూ తక్కువే
మొత్తం సెక్రెటెరియట్ లో 678 మంది మహిళలు వివిధ హోదాలలో పనిచేస్తున్నారు. వీరిలో 102 మంది మాత్రమే తెలంగాణ ఉద్యోగులు. షెడ్డూల్డ్ కులాలకు చెందిన ఉద్యోగులు 443 మంది ఇక్కడ
పనిచేస్తున్నారు. వీరిలో 115 మంది తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగహక్కులు ఉన్నప్పటికీ ఇక్కడ వాటిని కూడా పాతర పెట్టారని తెలంగాణ ఎస్సీ ఉద్యోగుల ఆరోపణ.

నియామకాలన్నీ నేరుగానే
సెక్రెటెరియట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుండి నియామకాలు జరుగుతూ ఉంటాయి. 1985 వరకు టైపిస్ట్, అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి పోస్టులకు డైరక్ట్ పద్ధతిలోనే నియామకాలు జరుగుతూ
ఉండేవి. సెక్రెటెరియట్ లో నియామకం పొందిన వారికి సెక్రెటెరియట్ లో వెలుపల పదోన్నతులకు అవకాశాలు లేకపోవడంతో సెక్రెటెరియట్ లో ఉద్యోగులు ఆందోళనలు వ్యక్తం చేశారు. ఆ క్రమంలో టైపిస్ట్, అసిస్టెంట్ పోస్టులు రద్దు చేశారు. ప్రస్తుతం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుండే నియామకాలు చేస్తున్నారు. హెచ్‌వోడీల నుండి పన్నెండున్నరశాతం మంది ఉద్యోగులను ఏఎస్‌వోలుగా నియమిస్తున్నారు. సెక్షన్ ఆఫీసర్ నుండి పదోన్నతుల ద్వారానే నియమిస్తున్నారు. గతంలో ఏఎస్‌వోలకు ఏసీటీవో, లేబర్ ఆఫీసర్, తదితర హోదాలలో నియామకాలు పొందేందుకు అవకాశాలు ఉండేవి. ఈ అవకాశాలన్నీ రద్దు కావడంతో
88 శాతం నియామకాలు డైరక్ట్ పద్ధతిలోనే ఏపీపీఎస్సీ ద్వారా జరుగుతున్నాయి.


ఏ బ్లాకుల్లో ఏముంది?
బ్లాక్ ‘ఏ’A_BLOCkహోంశాఖకు కేంద్ర స్థానం. మూడు, నాలుగు అంతస్తులలో ఉంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన శాంతిభవూదతలను పర్యవేక్షిస్తారు. హోంశాఖకు సంబంధించిన 28 విభాగాలను ఇక్కడి నుండి పరిపాలిస్తుంటారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పోలీస్‌శాఖ నుండి వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ, రోడ్ సేఫ్టీ అథారిటీ, స్పెషల్ సెక్రటరీలు ఇలా మొత్తం 28 విభాగాలు ఈ భవనంలో పనిచేస్తుంటాయి. వీఐపీల రక్షణకు సంబంధించిన వ్యూహరచనలు, వీఐపీలల కదలికలు, వారిపట్ల ఉండాల్సిన జాగ్రత్తలతో పాటు, ఎవరిపైన నిఘాలను కట్టుదిట్టం చేయాలన్న అంశాల్లో కూడా ఏ బ్లాక్‌నుండే
మంత్రరచన చేస్తుంటారు. స్టేట్ ఇంటెలిజెన్స్, స్టేట్ విజిపూన్స్ అధికారులకు ఇక్కడి నుండే అదేశాలు వెళుతుంటాయి. లీగల్ సర్వీసెస్ సెక్రటరీ, లీగల్ పరిపాలనావిభాగం ‘ఏ’ బ్లాక్‌లో పనిచేస్తున్నది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన సాంకేతిక అధికారులు, మైనారిటీ సంక్షేమశాఖ ఈ భవననంలో ఉన్నాయి.

బ్లాక్ ‘బీ,సీ’B-BLOCKఈ రెండు బ్లాక్‌లలో నార్త్ హెచ్, సౌత్ హెచ్ విభాగాలలో సాధారణ పరిపాలనాశాఖ (జీఏడీ) విభాగాలు పని చేస్తుంటాయి. సాధారణ పరిపాలనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, అసిస్టెంట్ సెక్రటరీలు ఈ భవనం నుండి పరిపాలనను కొనసాగిస్తుంటారు. సాధారణ పరిపాలనాశాఖలుగా వ్యవహరించే ఈ భవనాలలో చాలా సున్నితమైన పరిపాలనాంశాలపైన చర్చలు జరుగుతుంటాయి. ఒక్క బీ బ్లాక్‌లోనే 37 విభాగాలు ఉన్నాయి. ఇక్కడ 19 మంది అసిస్టెంట్ సెక్రటరీ హోదాగల అధికారులు పనిచేస్తున్నారు. ఉద్యోగుల జీతభత్యాలు, పీఆర్సీలు, ఎనామలీస్ కమిటీలు, మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులు, ముఖ్యమంత్రి ఒప్పందాలలో అంగీకరించిన అంశాలు తదితర ముఖ్యమైన అంశాలన్నింటికీ ‘బీ’, ‘సీ’ విభాగాలలోని సాధారణ పరిపాలనాశాఖ అధికారులు బాధ్యత వహిస్తుంటారు.


బ్లాక్ ‘సీ’C-BLOCKఇది ఆంధ్రవూపదేశ్ అధికారానికి రాజదండం. ముఖ్యమంత్రి అధికార సింహాసనం, చీఫ్ మినిస్టర్ ఆఫీస్, చీఫ్ సెక్రటరీ ఆఫీస్, మంత్రివర్గ సమావేశ మందిరం సీ బ్లాక్ ప్రత్యేకతలు. ఇందులోని ఆరవ అంతస్తులో ముఖ్యమంత్రి కొలువుతీరి ఉంటారు. ఐదవ అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం, నాలుగవ అంతస్తులో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీలు, మంత్రివర్గ సమావేశం హాలు ఉన్నాయి. మూడవ అంతస్తులో చీఫ్‌సెక్షికటరీ, చీఫ్ సెక్రటరీ ఆఫీస్, ఇతర ముఖ్యఅధికారులు కొలువు తీరి ఉంటారు. ఒకటి రెండు ఫ్లోర్‌లలో సాధారణ పరిపాలనా అధికారులు ఉంటారు. సాధారణా పరిపాలనకు సంబంధించిన 28 ప్రాముఖ్యమైన విభాగాలు ‘సీ’ బ్లాక్‌లో ఉన్నాయి.

బ్లాక్ ‘డీ’d-blockసాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం వంటి వివిధ సంక్షేమశాఖలు ఇక్కడే ఉన్నాయి. మూడవ అంతస్తులో రాష్ట్ర ఆర్థిక రంగాన్ని చక్కబెట్టే ఆర్థికమంవూతిత్వశాఖ నుండి ఆర్థికశాఖకు సంబంధించిన చాలా విశిష్టమైన శాఖలు ఉన్నాయి. రాష్ట్రంలోని పేద ప్రజలకోసం రచించిన సంక్షేమ పథకాలకు ఇక్కడి నుండే నిధులు మంజురవుతుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసాకు ఇక్కడి నుండి జీవోలు వెలువడాల్సిందే. అదీ లెక్క. యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం, కల్చర్, సాంఘికసంక్షేమం, గిరిజనసంక్షేమం వంటి వివిధ సంక్షేమ కార్యాలయాలు మొత్తం వివిధ విభాగాలకు చెందిన 84 సెక్షన్లు ఈ భవనంలో ఉన్నాయి. ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టూరిజం శాఖ ముఖ్యకార్యదర్శి, పరిక్షిశమలు, వాణిజ్య శాఖలకు చెందిన ఐఏఎస్ అధికారులు, డిప్యూటీ సెక్రటరీలు, అసిస్టెంట్ సెక్రటరీలు ఈ భవనంలో ఉంటారు. వ్యవసాయం, సహకారశాఖ, ఫైనాన్స్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, పర్యావరణ, అటవీ, సైన్స్ టెక్నాలజీ, ఇంధనశాఖలు ఇక్కడ నుండి పనిచేస్తుంటాయి. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, కార్యదర్శులు, ఆర్థిక సలహాదారులు, ప్రొక్యూర్‌మెంట్ మానిటరింగ్ ఆఫీసర్, అడిషనల్ ప్రొక్యూర్‌మెంట్ తదితర అధికారులు డీ బ్లాక్‌లో ఉంటారు. కాగా.. ‘ఈ’, ‘ఎఫ్’, ‘జీ’ బ్లాకులు నిర్మాణంలో ఉన్నాయి.

బ్లాక్ ‘జే’J_BLOCKఇక్కడ ఉన్నతవిద్య, ఇంటర్మీడియట్, పాఠశాల విద్య వంటి చాలా ప్రాధాన్యమైన శాఖలు ఉన్నాయి. న్యాయశాఖ, రవాణా- రోడ్డుల విభాగం, నీటిపారుదల విభాగం, తదితర శాఖలు ఇక్కడ ఉన్నాయి. విద్యాశాఖకు సంబంధించిన 11 మంది సీనియర్ అధికారులు ఈ భవనంలో ఉన్నారు. నీటిపారుదల రంగంలోని నిపుణులు, ఇంజినీర్లు, ముఖ్యకార్యదర్శులు, సీనియర్ అధికారులు ఈ భవనం నుండి పరిపాలనలను చక్కదిద్దుతున్నారు. భారీ నీటిపారుదల ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వ్యవహారాలు, భూసేకరణ విభాగం ఇక్కడ నుండే పనిచేస్తున్నాయి. విజిపూన్స్ -1, విజిపూన్స్-2 సెక్షన్లు ఇక్కడ ఉన్నాయి.

బ్లాక్ ‘హెచ్’H,BLOCKఇందులో విజిపూన్స్ కమిషన్‌కు సంబంధించిన 24 సెక్షన్లు పని చేస్తున్నాయి. ‘హెచ్’ బ్లాక్ ఉత్తరవిభాగంలో విజిపూన్స్ కార్యాలయం ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇదే విభాగంలో సాధారణ పరిపాలనాశాఖకు సంబంధించిన కొన్ని విభాగాలు ఉన్నాయి. ఈ భవనం దక్షిణ విభాగంలో రాష్ట్ర ఎన్నికల అధికారి, ఆయన కార్యాలయం ఉన్నాయి. సువిశాలమైన, అందమైన సెక్రెటెరియట్ లో లైబ్రరీ ఈ భవనంలో ఉద్యోగులకు స్వాగతం పలుకుతున్నది. డిప్యూటీ చీఫ్ మినిష్టర్ రాజనరసింహ ఈ భవనం నుండే అధికారిక కార్యక్షికమాలు నిర్వహిస్తున్నారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్,విజిలిన్స్ కమిషన్, విజిపూన్స్‌కు సంబంధించిన ముఖ్యమైన విభాగాలు, రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, రికార్డులను భద్రపరిచే విభాగం తదితర పరిపాలనా విభాగాలు ఈ భవనంలో ఉన్నాయి

బ్లాక్ ‘కే’K.BLOCKఇందులో తెలంగాణ ఎన్జీవో యూనియన్ చాలా ప్రాముఖ్యం సంతరించుకున్నది. రెయిన్‌షాడో డెవలప్ డిపార్ట్‌మెంట్, టెక్నికల్ ఎగ్జామినర్ విభాగానికి చెందిన 8 మంది అధికారులు ఇక్కడి నుండి పనిచేస్తుంటారు. ఇదే భవనంలోని గ్రౌండ్ ప్లోర్‌లో ఆర్కైవ్స్‌కు సంబంధించిన అద్భుతమైన విభాగం పనిచేస్తున్నది. ఉద్యోగుల క్రెడిట్ సొసైటీలు ఇక్కడ ఉన్నాయి.

బ్లాక్ ‘ఎల్’L-blockఇందులో పంచాయతీరాజ్, రెవెన్యూ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్, కార్మికశాఖ, ప్లానింగ్, మెడికల్ అండ్ హెల్త్, పౌరసరఫరాల శాఖ, రెవెన్యూకు సంబంధించిన 24 విభాగాలు, పంచాయతీరాజ్‌కు అనుబంధంగా ఉండే 18 శాఖలు ఈ భవనంలో ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగులు వందల సంఖ్యలో ఉన్నారు. దాదాపు నూరుకు పై చిలుకు విభాగాలు ఈ భవనంలో ఉన్నాయి.

Take By: T News

0 comments:

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP