ఢిల్లీ నోట... ఉల్టామాట!
- సమస్యను మొదటికి తెచ్చిన ప్రధాని
- ఏకాభివూపాయంతోనే తెలంగాణ సాధ్యం
- అది జాతీయ స్థాయిలో ఇప్పటికీ రాలేదు
- పెనం నుంచి పొయ్యిలో పడకూడదు
- రాష్ట్రం ఇస్తే దేశంలో మరిన్ని సమస్యలు
- మన్మోహన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- భగ్గుమన్న తెలంగాణవాదులు
- కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తాం
- తెలంగాణ కోపాగ్ని చవిచూడక తప్పదు
- నిప్పులు చెరిగిన టీఆర్‌ఎస్ అధినేత
- ప్రధాని హోదాకు తగని వ్యాఖ్యలు:
జేఏసీ చైర్మన్ కోదండరాం విమర్శ
- ఉద్యమం తీవ్రం చేస్తాం: ఎర్రబెల్లి
- ఇంత జరిగాక తిరకాసు మాటలేంటి?
- టీ కాంగ్రెస్ నేతల సమాధానమేంటి?
- నిలదీస్తున్న తెలంగాణ సమాజం
న్యూఢిల్లీ, హైదరాబాద్, నవంబర్ 12 (
తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ ఏడాదిపాటు కాలం గడిపేసింది. దాని సిఫారసులు సాధ్యం కావంటూ కేంద్రమే వాటిని పక్కనపె అమ్మ రావాలన్నారు. సోనియా విదేశాల నుంచి వచ్చేశారు. ఈలోపు ఆజాద్ సంప్రతింపుల ప్రక్రియ నడిచింది. కోర్‌కమిటీలన్నారు. పండుగల తర్వాత నిర్ణయమన్నారు. యూపీఏ అభివూపాయమే పార్టీ అభివూపాయమన్నారు. జాతీయ స్థాయిలో అభివూపాయ సేకరణ అవసరం లేదన్నారు. దీపావళి, బక్రీద్ వెళ్లిపోయాయి. రాష్ట్ర విభజనపై ఇదిగో నిర్ణయం అతి త్వరలో.. అందరికీ ఆమోదయోగ్యంగా శాశ్వత పరిష్కారం.. అంటూ నేతల నోటి నుంచి మాటలు వచ్చాయి. కొద్ది రోజుల్లో చిదంబరం ప్రకటన అంటూ లీకులు వదిలారు. మధ్యలో ఆర్థిక మండళ్లంటూ ఫీలర్లు ఇచ్చారు. ఎస్సార్సీయే సర్వరోగ నివారణి అంటూ తన ప్రతినిధులతో కొత్త పల్లవి పాడించారు. వ్యతిరేకత రావడంతో అబ్బే అది యూపీకేనంటూ వివరణ ఇచ్చారు. ప్యాకేజీల ప్రస్తావనలు తెచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు మరో అడుగు ముందుకేశారు. సాక్షాత్తూ ప్రధాని మన్మోహనే తెలంగాణ ఇప్పట్లో ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు. విషయం మళ్లీ మొదటికి వచ్చే రీతిలో పెను వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకాభివూపాయంతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని సమస్యను మళ్లీ మొదటికి తెచ్చారు. తెలంగాణ ఇచ్చి మరిన్ని సమస్యలు కొనితెచ్చుకోవాలని అనుకోవ అసలు సంగతి బయటపెట్టారు. ప్రధాని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం యావత్తూ భగ్గుమన్నది. ఇంత ప్రక్రియ నడిపి, త్వరలో నిర్ణయం అని చెప్పి, మళ్లీ ఈ తిరకాసు మాటలేంటని మండిపడింది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించి, ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేసింది. ప్రధాని వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ నాయకత్వం ఏం సమాధానం చెబుతుందని నిలదీసింది. పూటకో మాట మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తిని కళ్లుండి చూడలేని కబోది అంటూ ప్రధానిపై ధ్వజమెత్తారు.
మాల్దీవుల్లో జరిగిన సార్క్ సమావేశాల నుంచి తిరిగి వస్తూ విమానంలో విలేకరులతో జరిపిన ఇష్టాగోష్ఠిలో తెలంగాణ అంశంపై ప్రశ్నలకు సమాధానాలిచ్చిన ప్రధాని మన్మోహన్... ఏకాభివూపాయంతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని స్పష్టం చేశారు. ‘‘తెలంగాణ సంక్లిష్టమైన సమస్య. అందరికీ అమోదయోగ్యమైన నిర్ణయం కోసం ఏకాభివూపాయం రావాలని కోరుకుంటున్నాం. ప్రశాంత పరిస్థితుల్లోనే సమస్యకు పరిష్కారం లభించగలదు. ఈ విషయంలో ఆచితూచి అడుగేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఓ జాతీయ సమస్యపై పెనంలోంచి పొయ్యిలో పడటం సరైన పరిష్కారం కాదు’’ అని ప్రధాని అన్నారు. తెలంగాణ అంశంపై అన్ని వర్గాల్లో ఏకాభివూపాయానికి అన్నివిధాలా ప్రయత్నిస్తున్నామన్నారు. తెలంగాణ సమస్యపై జాతీయ స్థాయిలో ఏకాభివూపాయం వచ్చిందని చెప్పలేమని ప్రధాని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. తెలంగాణేతర ప్రాంతాల్లో అశాంతి, గందరగోళం నెలకొన్నందున ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతోనే తెలంగాణ సమస్య పరిష్కారం కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గురించి అడిగినపుడు, ‘‘భా స్వాములందరూ అమోదించే విధంగా సరైన పరిష్కార మార్గం కోసం కృషి చేస్తున్నాం’’ అని ప్రధాని సమాధానమిచ్చారు.
ప్రధాని కళ్లున్నకబోది: కేసీఆర్ ఫైర్
తెలంగాణపై ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తిని కళ్లుండి చూడలేని కబోది అంటూ ప్రధానిపై ధ్వజమెత్తారు. ప్రధానికి ప్రజా ఉద్యమాల మీద గానీ, ప్రజాస్వామిక విలువల మీద గానీ ఏమాత్రం గౌరవం లేదని కేసీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల కోపాగ్నికి కాంగ్రెస్ పార్టీ ఖతం అవుతుందని ఆయన శాపనార్థాలు పెట్టారు. తెలంగాణపై ఏకాభివూపాయం తర్వాతే నిర్ణయమన్న ప్రధాని వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. శనివారం టీఆర్‌ఎస్ అధినేత మీడియాతో మాట్లాడుతూ ప్రధానిపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా, అధికార కాంగ్రెస్‌పైనా నిప్పులు చెరిగారు. ‘‘తెలంగాణ ప్రజలారా బాధపడకండి, భయపడకండి. మీతో నేనున్నాను. అన్ని రకాలుగా ఉద్యమాలు చేసి తెలంగాణ సాధిద్దాం’’ అంటూ ె లంగాణ ప్రజలకు కేసీఆర్ ధైర్యం చెప్పారు. ప్రజా పోరాటలకు ఎవరైనా తల వంచక తప్పదని ఆయన హెచ్చరించారు. తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీని, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను భూ స్థాపితం చేస్తారని ఆయన ఘాటుగా స్పందించారు. ఇది తన శాపమని అన్నారు. తెలంగాణ ప్రజల కోపాగ్నిని కాంగ్రెస్ పార్టీ రుచి చూస్తుందని హెచ్చరించారు. తెలంగాణ సాధించే వరకు ఉద్యమాన్ని అపేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.
ప్రధాని హోదాకు తగినట్టుగా మాట్లాడాలి: కోదండరాం
ప్రధాని వ్యాఖ్యలపై జేఏసీ చైర్మన్ కోదండరాం మండిపడ్డారు. ప్రధాని వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకపోతే ‘కాంక్షిగెస్ కో ఖతం కరో’ అనే నినాదాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మన్మోహన్‌సింగ్ ఆయన హోదాకు తగ్గట్టు మాట్లాడాలని హితవుపలికారు. ఢిల్లీ పెద్దల తీరు చూస్తుంటే తెలంగాణ అంశాన్ని కోల్డు స్టోరేజీలోకి నెట్టే పరిస్థితి దాపురించిందన్నారు.
రెండు రకాలుగా మాట్లాడొద్దు: మల్లెపల్లి లక్ష్మయ్య
ఎన్ని సార్లు ఏకాభివూపాయం తీసుకుంటారని జేఏసీ కో చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య ప్రశ్నించారు. ఇంకెన్ని సార్లు అఖిలపక్ష భేటీలు జరుపుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రధానికి దమ్మూ, ధైర్యం ఉంటే తెలంగాణ ప్రక్రియ షురూ చేయాలి. లేదా ఇచ్చేది లేదని సూటిగా చెప్పాలి. కానీ రెండురకాలుగా మాట్లాడి ప్రజల్ని మోసం చేయవద్దు’’ అని సూచించారు. కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్య విలువలపై నమ్మకముంటే వెంటనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి: విఠల్
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని, ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లుపెట్టి ప్రత్యేక తెలంగాణపై రోడ్డు మ్యాప్ ప్రకటించాలని ఉద్యోగ సంఘం నేత విఠల్ డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.
కాంగ్రెస్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నది : వీ ప్రకాశ్
కాంగ్రెస్ తన గొయ్యిని తానే తవ్వుకుంటుందని రాజకీయ విశ్లేషకులు వీ ప్రకాశ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి బయటపడినందున తెలంగాణ కాంగ్రెస్ నాయకులు యూపీఏ, కాంగ్రెస్ నుంచి బయటకు రావాలని హితవుపలికారు. మరోసారి చర్చలు జరపడమంటే తెలంగాణ ప్రజల్ని మోసం చేయడమేనని ఆయన తెలిపారు.
ప్రజల సహనాన్ని పరీక్షించొద్దు: దేవీవూపసాద్
తెలంగాణ సమస్యను పరిష్కరిస్తేనే తెలంగాణలో శాంతి నెలకొంటుందని టీఎన్జీవో నేత దేవీవూపసాద్ అన్నారు. తెలంగాణపై ఇప్పటికే ఎన్నో మార్లు ఏకాభివూపాయం కుదిరిందన్నారు. మరోసారి ఏకాభివూపాయం కావాలనడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. ఇది తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షించడమే అవుతుందని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ మరోసారి ద్రోహం: గోవర్ధన్
తెలంగా ప్రజల ఆకాంక్షలకు కాంగ్రెస్ మరోసారి ద్రోహం చేస్తోందని న్యూ డెమొక్షికసీ నేత గోవర్ధన్ మండిపడ్డారు. ఏకాభివూపాయం అంటూ ప్రధాని పాతపాటతో కాంగ్రెస్ తెలంగాణకు వ్యతిరేకం అనే భావన స్పష్టమైందన్నారు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తే తప్ప తెలంగాణ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ కోరుకునే పార్టీలు, ఉద్యమ సంఘాలు, ఉద్యోగులు, ప్రజలు అంతా విభేదాలు మాని పార్టీలకు అతీతంగా పోరాడి తెలంగా సాధించుకోవాలని గోవర్థన్ పిలుపిచ్చారు.
ఉద్యమం తీవ్ర రూపం: ఎర్రబెల్లి
తెలంగాణ ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతమౌతుందని టీడీపీ టీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. తెలంగాణవాదులంతా పరస్పర విమర్శలు మాని కాంగ్రెస్‌పై ఒత్తిడి తెచ్చి తెలంగాణ సాధించుకుందామని పిలుపునిచ్చారు.
Take By: T News
Tags: Telangana News, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, Telangana agitation, statehood demand,
0 comments:
Post a Comment