సోనియాతో నేడు చిరు భేటీ
-కాంగ్రెస్ నేతలే కొంప ముంచారు
-పార్టీలో ఐక్యత లోపించింది
-పీఆర్పీకి ద్వితీయ శ్రేణి గుర్తింపే!
-ఓటమికి ఇవే కారణాలు
-ఉప ఫలితాలపై నివేదిక!
హైదరాబాద్,
():కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో చిరంజీవి సోమవారం ఢిల్లీలో
భేటీ కానున్నారు. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి
కిరణ్‌కుమార్‌డ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలు భేటి అయిన రెండోరోజే
చిరంజీవి సోనియాతో సమావేశమై ఉప ఎన్నికల ఫలితాలను వివరించనున్నారు.
కాంగ్రెస్ నేతల వైఖరివల్లే ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందిందని తన
నివేదికను ఆయన సోనియాకు సమర్పించే అవకాశాలున్నట్లు పూర్వ పీఆర్పీ వర్గాల
నుంచి అందుతున్న సమాచారం. రామచంవూదాపురం, నర్సాపురం రెండు స్థానాల్లో
కాంగ్రెస్ తనవల్లే గెలిచిందని, మిగతాచోట్ల పీఆర్పీ శ్రేణులకు కాంగ్రెస్
సహకరించలేదని అధిష్ఠానానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. పార్టీలో
ఐకమత్యం లోపించిందని, విలీనమైనా కూడా పీఆర్పీ శ్రేణులను ఇప్పటికీ
ద్వితీయక్షిశేణి నేతలుగానే పరిగణిస్తున్నారని, నామినేటెడ్ పదవులు
భర్తీచేయకపోవడం వంటి పరిణామాలతో పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉన్నట్లు ఆయన
అధినేత్రి దృష్టికి తీసుకెళుతారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇదే
సమయంలో ఆయన తన కేంద్ర మంత్రి పదవి విషయం కూడా తేల్చుకోనున్నట్లు సమాచారం.
రాజ్యసభ సభ్యుడిగానియమించినప్పటికీ ఇంకా మంత్రి పదవి విషయంలో అధిష్ఠానం
నాన్చుతుండటం చిరులో అసంతృప్తికి కారణమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో
వినిపిస్తోంది.
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అన్ని స్థానాల్లో
గెలిపిస్తే చిరంజీవికి మంత్రి పదవి కచ్చితంగా వచ్చేదని, ఇప్పుడు పార్టీ
ఓటమితో ప్రస్తుతానికి ఆ పదవి కూడా డౌటేనని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.
పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు చిరుకు రాజ్యసభ, పీసీసీ సమన్వయ
కమిటీ సభ్యుడు, కేంద్ర మంత్రి పదవితోపాటు రాష్ట్రంలో ఆ పార్టీ నేతలకు
రెండు మంత్రి పదవులు, ప్రభుత్వ విప్ పదవి ఇచ్చేందుకుగతంలో ఢిల్లీ పెద్దలతో
ఒప్పందం కుదిరినట్లు సమాచారం. వీటిలో కేంద్ర మంత్రి పదవి తప్ప మిగతావన్నీ
చిరు సాధించుకున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం పునరాలోచనలో పడినట్లు
పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు
అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలిచింది. చిరు ప్రభావం ఎంతమాత్రం
కనిపించలేదని ఫలితాలు స్పష్టం చేశాయి. చిరు ప్రాతినిధ్యం వహించి రాజీనామా
చేసిన తిరుపతి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోలేకపోగా అక్కడ
ఓటమికి కాంగ్రెస్ వారే కారణమని చిరు నిందలు వేయడం పార్టీ వర్గాలకు విస్మయం
కలిగించింది. ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి, ఆ తరువాత ఆయన కాంగ్రెస్ నేతలపై
చేసిన వ్యాఖ్యలు వంటి పరిణామాలు చిరుకు కేంద్ర మంత్రి పదవి విషయంలో మైనస్
కానున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
0 comments:
Post a Comment