సీతయ్యపై వేటు.. సింహాకు.. సీటు
-‘సింహాద్రి’ దూకుడుకు చిన్నబాబుతో కళ్లెం
-నారావారి కొత్త సినిమా షురూ!
-బాలయ్య, లోకేష్‌కు టీడీపీలో రెండోస్థానం
-త్వరలో ప్రధాన కార్యదర్శి పదవులు
-ఉప ఎన్నికల్లో పోయిన పరువు నిలబెట్టుకునే ప్రయత్నం
-హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌కు చెక్ పెట్టే యోచన
ఓ
వైపు రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణలో కోలుకోలేని దెబ్బ.. మరో వైపు ఉప
ఎన్నికల పుణ్యమాని సీమాంవూధలో తిరగబడ్డ సీను.. ఏం చేయాలో తోచని చంద్రబాబు
ఇప్పుడు పార్టీని కాపాడుకునే పనిలో పడ్డారు..! రీళ్లు తిరిగేస్తున్నారు..!
రెండో శ్రేణి నాయకత్వాన్ని తెరపైకి తెచ్చేందుకు స్క్రిప్ట్ సిద్ధం
చేసుకుంటున్నారు..!! ‘సింహా’తో ఊకొట్టించి.. ‘సీతయ్య’ను ఉలిక్కిపడేలా
చేద్దామనుకుంటున్నారు. పనిలో పనిగా ‘సింహాద్రి’ దూకుడుకు చిన్నబాబుతో
కళ్లెం వేయించేందుకు సన్నద్ధమవుతున్నారు. టీడీపీలో రెండు ప్రధాన కార్యదర్శి
పదవులు సృష్టించి, వాటిలో బావమరిది బాలకృష్ణ, కుమారుడు లోకేష్‌బాబును
కూర్చోబె కసరత్తు చేస్తున్నారు. మామాఅల్లుళ్లు బాలయ్య, లోకేష్‌కు పార్టీ
రెండో శ్రేణి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే తన అధ్యక్ష పీఠానికి ఢోకా
ఉండదని.. ఇదే దెబ్బకు తండ్రీకొడుకులు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ జోరుకు
బ్రేక్ పడుతుందని, వారిని దూరంగా జరపొచ్చని చంద్రబాబు భావిస్తున్నారు..!
బాలయ్య, లోకేష్‌కు దాదాపుగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులు ఖరారైన ప్రకటన
వెలువడటమే తరువాయి అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నారా వారి నయా
చిత్రానికి మామ ఎన్టీఆరే ఆదర్శమని తెలుస్తోంది..! నాడు ఎన్టీఆర్ తన
అల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటి వెంక పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులు
అప్పగించి.. తాను అప్పుడప్పుడు మాత్రమే పార్టీని చూసుకునేవారు. అదే తరహాలో
ఇప్పుడు బాబు ముందుకు వెళ్తున్నారు..!!
హైదరాబాద్,
జూన్ 24 ():టీడీపీలో రెండో శ్రేణి నాయకత్వం మళ్లీ తెరపైకి
రానుంది..! రెండు ప్రధాన కార్యదర్శి పదవులకు రంగం సిద్ధమవుతోంది..!! ఈ
స్థానాల్లో తన బావమరిది, సినీ హీరో బాలకృష్ణను, కుమారుడు లోకేష్‌ను
కూర్చోబె చంద్రబాబు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇటు తెలంగాణలో.. అటు
సీమాంవూధలో పార్టీ కోలుకోలేని స్థాయికి దిగజారింది. శ్రేణులు తీవ్ర నిరాశలో
ఉన్నాయి. రెండో శ్రేణి నాయకత్వం లేకపోవడమే పార్టీకి ప్రధాన దెబ్బ అని ఆ
శ్రేణులు భావిస్తున్నాయని, అందరినీ మెప్పించేందుకే బాలయ్య, లోకేష్‌ను
ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు
టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ఇద్దరికీ పార్టీలో ప్రధాన కార్యదర్శి
పదవులు దాదాపు ఖరారైనట్లు పేర్కొంటున్నాయి. బాలయ్య, లోకేష్ రాకతో ఓ వైపు తన
అధ్యక్ష పీఠం బీటలు వారకుండా ఉంటుందని.. మరోవైపు హరికృష్ణ, జూనియర్
ఎన్టీఆర్ దూకుడుకు కళ్లెం వేయొచ్చని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎనిమిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న తమ పార్టీ ఇప్పుడు పుంజుకొని 2014లో
తిరిగి అధికారంలోకి వస్తుందన్న భరోసా టీడీపీ శ్రేణుల్లో కనిపించడం లేదు.
పార్టీలో ద్వితీయక్షిశేణి(నంబర్ 2) నాయకత్వం లేకపోవడంతో నానాటికి పరిస్థితి
దిగజారుతున్నదని తెలుగుతమ్ముళ్లు కలవరపడుతున్నారు. తమ్ముళ్లలో ఉత్సాహాన్ని
నింపేందుకు, ఉప ఎన్నికల్లో పోయిన పరువును నిలబెట్టుకునేందుకు చంద్రబాబు
పార్టీకి కొత్త హంగులు అద్దే పనిలో పడ్డారు. ఇప్పటికే బాలకృష్ణ పలుమార్లు
మీడియాతో మాట్లాడుతూ పార్టీ తనకు ఏ బాధ్యతలు ఇచ్చినా పని చేస్తానని
ప్రకటించారు.
మామ తరహాలోనే..: టీడీపీ అధ్యక్షుడిగా ఎన్టీఆర్ ఉన్న
కాలంలో ఇంటి అల్లుళ్లయిన చంద్రబాబు, దగ్గుబాటి వెంక సెకండరీ నాయకులుగా
వెలుగు వెలిగారు. వీరిద్దరూ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులు నిర్వహించారు.
కుటుంబ సభ్యులే ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఉండటంతో అప్పట్లో ఎన్టీఆర్
దాదాపుగా పార్టీ రోజువారీ కార్యకలాపాలన్నీ అల్లుళ్లకే అప్పగించారు. కీలకమైన
వాటిల్లో మాత్రమే ఎన్టీఆర్ జోక్యం చేసుకునేవారు. తాజాగా చంద్రబాబు కూడా తన
మామ ఎన్టీఆర్‌ను అనుసరించేందుకు సిద్ధమయ్యారు. మామ పాలసీలోనే పార్టీని
ముందుకు నడిపించాలని ప్రయత్నిస్తున్నారు. తన కొడుకు లోకేష్‌కు ఇప్పటికే
రాజకీయాలపై తర్ఫీదు ఇప్పించినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల సమయంలో
లోకేష్‌తో కలిసి ఒక మానిటరింగ్ కమిటీని వేసి రోజు వారీగా రాజకీయ పరిణామాలపై
చంద్రబాబు సమీక్షించే వారు. లోకేష్ అప్పుడప్పుడు తనకు సహాయం చేస్తున్నాడని
ఇటీవల చంద్రబాబు మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలన్నీ
గమనిస్తే లోకేష్, బాలయ్య ప్రత్యక్ష రాజకీయ తెరంగేట్రం దాదాపుగా ఖరారైన
విశ్లేషకులు అంటున్నారు.
పోయిన పరువు దక్కేనా..?
ఎనిమిదేళ్లుగా
ప్రతిపక్షంలో ఉంటూ వస్తున్న టీడీపీపై శ్రేణుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి.
2014లో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే చరిష్మా బాబుకు లేదన్న చర్చ
జరుగుతోంది. దీనికితోడు ద్వితీయ శ్రేణి నాయకత్వం లేకపోవడంతో పార్టీ
కార్యక్షికమాల పర్యవేక్షణ చంద్రబాబు ఒక్కడికి ఇబ్బందికరంగా మారిందని ఆ
పార్టీకి చెందిన ఓ నేత అన్నారు. జనంలో బాబు పలుచపడిపోయారని
అభివూపాయపడ్డారు. ముఖ్యంగా ఈ ఉప ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో..
ఉన్న క్రెడిబులిటీ కూడా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా
ఎన్నికలంటే భయపడే పరిస్థితి వచ్చిందని సదరు నేత అన్నారు. పైగా కొన్ని
స్థానాల్లో కాంగ్రెస్ కంటే చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. కొన్నింట్లో
డిపాజిట్లు కూడా దక్కలేదు.
ఈ పరిణామాలు తమ అధినేతను తీవ్రంగా
కుంగదీశాయని సదరు నేత తెలిపారు. దానికి తోడు ఉప ఎన్నికల్లో రెండు స్థానాలు
కాంగ్రెస్ గెలుచుకోవడం కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో టీడీపీ తమ్ముళ్లు
ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలో 30ఏళ్ల
క్రితం ఆవిర్భవించిన టీడీపీ.. ఇప్పుడు ఆ కాంగ్రెస్‌కే మద్దతు ఇచ్చిందన్న
ప్రచార ప్రభావం తీవ్రంగా దెబ్బతీసిందని వాపోయారు. కాంక్షిగెస్ గెలిచిన
రెండు స్థానాల్లోనూ టీడీపీ ఓట్లు బదిలీ అయ్యాయని, ఇది ప్రజల్లోకి తప్పుడు
సంకేతాలను పంపిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడొకరు ఆవేదన వ్యక్తం
చేశారు. ఇదిలా ఉండగా ద్వితీయ శ్రేణి నాయకులు లేకపోవడంతో పాటు ఉన్న వాళ్లలో
సీనియర్లను నమ్మి రెండో స్థానం అప్పగించే పరిస్థితి కనిపించడం లేదన్నారు.
చంద్రబాబు ఎవరినీ నమ్మరని, ఆయననూ ఎవరూ నమ్మరని మరో నాయకుడు
అభివూపాయపడ్డారు.
సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఇద్దరు
నేతలు విడివిడిగా మాట్లాడుతూ.. పార్టీలో తాము ఎంతలో ఉండాలో అంతలోనే
ఉండాలని భావిస్తున్నామని చెప్పారు. రెండో స్థానంలోకి వెళ్లే అవకాశం ఉన్నా
వెళ్లలేని పరిస్థితి అని పేర్కొన్నారు. దూరం దూరంగా ఉంటేనే బాబు
నమ్ముతారని, అందుకే తాము ఎడం పాటిస్తున్నామని చెప్పుకొచ్చారు. పార్టీలోని
సీనియర్లపై బాబుకు నమ్మకం లేకపోవడం.. బాబుపై సీనియర్లకు నమ్మకం లేకపోవడంతో
ద్వితీయ శ్రేణి నాయకత్వం లోటు కనిపిస్తోంది. ఈ లోటును తీర్చేందుకు బాబు..
తన బావమర్ది బాలయ్య, కుమారుడు లోకేష్‌ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి
తెస్తున్నట్లు సమాచారం. బాలయ్య కూతుర్నే లోకేష్ మనువాడిన విషయం తెలిసిందే. ఈ
రకంగా తన కుటుంబానికే పెద్దపీట వేయాలన్న యోచనలో బాబు ఉన్నట్లు పార్టీ
వర్గాలు అంటున్నాయి. బాబు ప్రయత్నం.. పోయిన పార్టీ ప్రతిష్టను ఏ మేరకు
నిలబెట్టగలుగుతుందన్న చర్చ ఆ వర్గాలో సాగుతోంది.
హరికృష్ణ, జూ.ఎన్టీఆర్‌కు కళ్లెం!
బాబు
వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్లున్నట్లు తెలుస్తోంది. పార్టీకి కొత్త
హంగులు అద్దే పేరిట బాలయ్య, లోకేష్‌ను తెరపైకి తెచ్చేందుకు
ప్రయత్నిస్తుండగానే.. ఇదే తరుణంలో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌కు
చెక్‌పెట్టే విధంగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం. కొన్నాళ్లుగా బాబుపై
హరికృష్ణ గుర్రుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ కుమారుడైన
బాలకృష్ణను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావడంతో ఎన్టీఆర్ మరో కుమారుడైన
హరికృష్ణను దూరం పెట్టొచ్చని బాబు భావిస్తున్నారు. ఇదే తరుణంలో తన కుమారుడు
లోకేష్‌ను తెరపైకి తీసుకురావడంతో జూనియర్ ఎన్టీఆర్ దూకుడుకు కూడా కళ్లెం
వేయొచ్చని ఆయన యోచిస్తున్నట్లు ఓ నేత అన్నారు. బాలయ్య, లోకేష్‌ను ప్రత్యక్ష
రాజకీయాల్లోకి తీసుకురావడంతో తనపై ఎలాంటి అంతఃపుర కుట్ర కూడా జరగదని,
ఉన్నంతకాలం పార్టీ అధ్యక్షపదవితో పాటు.. అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి
పీఠం కదలకుండా ఉంటుందన్న ధీమాతో చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు సమాచారం.
Take By : T News
0 comments:
Post a Comment