ముందున్నది...ఉపద్రవం
నోరుతెరిచి నడిరోడ్డుపైకి పొంగిన నాలా పాదచారికి ప్రాణగండమవుతుంది..
జలదిగ్బంధనంలో నీటమునిగిన పల్లె పగలూరాత్రి తెలియక విలవిల్లాడుతుంది.. ఏటా
కట్ట తెంచుకునే చెరువు ఊరిమీదికి ఉరిమి దూకుతుంది.. లోలెవల్ వంతెనలపై
నుంచి వాగులు సాగిపోతుంటే, రాకపోకలు రోజులు లెక్కిస్తూ నిలిచిపోతాయి.
చినుకు
పడ్డప్పుడల్లా అక్కడ ప్రమాద ఘంటికలు మోగుతుంటాయి. భారీ వర్షం పడితే ఇక
పరిస్థితి భయానకమే. ఏజెన్సీ ఏరియానేకాదు దాదాపు అన్ని డివిజన్లలోనూ అదే
పరిస్థితి. పలు ప్రాంతాల్లో పదే పదే ఉపద్రవాలు ముంచు కొస్తున్నాయి. ఏటా
వర్షాకాలం వచ్చిందంటే తలెత్తే ప్రమాదకర పరిస్థితికి సర్కారు తాత్కాలిక
మరమ్మతులతోనే పరిష్కారాన్ని ముగిస్తోంది. అందుకే జిల్లాయంత్రాంగం ముందు
సవాళ్లుగా నిలుస్తున్న ఈ సీజన్‌లోని ప్రమాదకర ప్రాంతాలపై టీ-
మీడియా ఫోకస్.......మాటేసిన దస్రూమాటు..
ములుగు,
దేవగిరిపట్నం ప్రధాన రహదారిపై గల దస్రూమాటు పొంగితే దేవగిరిప ట్నం అవతలి
గ్రామాలైన 10 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోతాయి. ఇక్కడ హైలెవల్ వంతెన
నిర్మించాలని కొన్నేళ్లుగా ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అదేవిధంగా లక్నవరం ముందు భాగంలోని పెద్ద వాగు పొంగితే అంకన్నగూడెం,
జగ్గన్నగూడెం గ్రామాల జలదిగ్బంధం అవుతాయి. ఇక్కడ ఐటీడీఏ అధికారులు రూ. 35
లక్ష లు ఖర్చు పెట్టి లోలెవల్ బ్రిడ్జి నిర్మించారు. అయితే ఈ బ్రిడ్జి
వర్షాకాలంలో ఎప్పుడూ నీళ్లల్లో మునిగిపోయే ఉంటుంది. ఆ గ్రామాల ప్రజలు
వర్షాకాలంలో రాకపోకల కోసం నాటు పడవలను వాడకతప్పని పరిస్థితి.
కొమ్ములవంచ రిజర్వాయర్‌కూ ఏటా గండ్లే..
నర్సింహులపేట
మండలం కొమ్ములవంచ శివారులో ఆకేరు వాగుపై 1964లో అప్ప టి రెవెన్యూ శాఖా
మంవూతిగా పని చేసిన నూకల రాంచంవూదాడ్డి, పబ్లిక్ వర్క్ శాఖామంత్రి
ఏసీ.సుబ్బాడ్డిలు ఆనకట్టను నిర్మించారు. ఈ ఆనకట్టకు కుడికాల్వ కింద
నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ, జయపురం, రామన్నగూడెం, ముంగిమడుగు
శివారులో 1100 ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ఎడమ కాల్వ ద్వారా నెల్లికుదురు
మండలం మదనతుర్తి, మునిగలవీడు, నర్సింహులపేట మండలంలోని కౌసల్యదేవిపల్లి,
బొజ్జన్నపేట గ్రామాల్లో 500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఆకేరు వాగును ని
ర్మించారు. 2006లో అప్పటి భారీ నీటి పారుదల శాఖా మంత్రి కడియం శ్రీహరి
రూ.1.0కోట్లు కేటాయించి కుడికాల్వ పనులు చేపట్టారు. సిమెంట్ కాల్వకు బుంగ,
ఆనకట్టకు ఉన్న షటర్(తూము)లు తుప్పు పట్టి వచ్చిన నీరంతా నిల్వ ఉండకుండా
వృథాగా పోతున్నప్పటికీ ప్రతీ ఏటా ఐబీ అధికారులు నామమావూతపు పనులు చేసి
చేతులు దులుపుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో
నీరు వృథాగా పోయే పరిస్థితులు ఉన్నాయి.
మారేడు పొంగితే అంతే..
వెంకటాపురం
మండలంలోని లక్ష్మీదేవిపేట, బూర్గుపేట గ్రామాల మధ్య గల మా రేడుగూడెం చెరువు
మత్తడి పొంగిపొర్లితే పెద్దాపురం వైపు గల సుమారు 12 గ్రామా లకు మండల
కేంద్రంతో సంబంధాలు తెగిపోతాయి. ఇక్కడ ఏళ్ల తరబడి లోలెవల్ వంతెన
దర్శనమిస్తోంది. ఇటీవల వెంకటాపురం చెల్పూర్ ప్రధాన రహదారికి సుమారు రూ.
మూడు కోట్లతో నూతన తారు రోడ్డును వేశారు. కానీ ఆర్‌అండ్‌బీ అధికారులు
కాజ్‌వేను నిర్మించడం మరిచారు.
గుండ్లవాగుతో కడగండ్లే..
గోవిందరావుపేట
మండలంలో గుండ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తే అమృతండా, చం ద్రూతండాల గిరిజనులకు
భాహ్య ప్రపంచంతో బంధం తెగిపోతుంది. అలాగే పస్రా సమీ పంలోని దయ్యాల వాగు
ఉధృతంగా ప్రవహిస్తే నార్లాపురం, మేడారం పరిధిలోని 1 గ్రామాలకు ప్రధాన
రహదారి బంద్ అయినట్లే. ప్రతీసారి మేడారం జాతరకు అధికారులందరూ ఇదే లోలెవల్
కాజ్‌వే మీది నుంచి పోతారు... వస్తారు. కానీ ఇక్కడ హై లెవల్ వంతెన
నిర్మించాలనే ఆలోచనే వారికి తట్టదు. జంపన్నవాగు పొంగితే ముత్తాపురం మూలకు
పడుతది.
రేగొండ మండలంలోని భాగిర్థిపేట క్రాస్‌రోడ్డు సమీపంలో
పరకాల-భూపాలపల్లి ప్రధాన రహదారిపై ఉన్న లోలెవల్ కాజ్‌వేతో ప్రతీయేటా
సమస్యలు ఎదురవుతున్నాయి. కాజ్‌వేకు దగ్గర్లోనే చెరువు ఉండడంతో వర్షాకాలంలో
చెరువు నిండడం మూలంగా నీరుబయటకు వచ్చి కాజ్‌వే మీదుగా వెళ్తుంటుంది.
కాజ్‌వేపై నీరు ఉధృతంగా వెళ్లడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
నిత్యం వందలాది లారీలలో బొగ్గు తరలిపోతుండడంతో వర్షాకాలంలో లారీలు
వెళ్లాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుంటాయి. అయితే విధిలేని
పరిస్థితుల్లో అక్కడ ఉన్న వారికి ఎంతో కొంత చెల్లించి ద్విచక్ర వాహనాలను
మాత్రం కాజ్‌వే నుంచి దాటించుకుంటారు.
భయంభయంగా లోతట్టు ప్రాంతాలు
వరంగల్
నగరంలో వర్షం వచ్చిందంటే చాలు, 20 లోతట్టు కాలనీలు వణికిపోతుంటాయి. శాశ్వత
చర్యలు చేపట్టకపోవడంతో ప్రతీ వర్షాకాలంలో ఈ కాలనీలు ముంపునకు గురికావాల్సి
వస్తోంది. కచ్చా డ్రైనేజీలు నిర్మించి తాత్కాలిక పనులు మాత్రమే బల్దియా
చేపడుతోంది.నిధుల కొరత, సాంకేతిక సమస్యలు సాకుగూ చూపుతూ అధికారులు శాశ్వత
పరిష్కారాన్ని పక్కనబెడుతున్నారనేది ప్రధాన విమర్శ.
ఆకేరు పొంగితే రాకపోకలు ఆగుడే..
లోలెవల్
బ్రిడ్జి మూలాన వర్షాకాలంలో వాగు ఉప్పొంగడంతో అనేక గ్రామాలకు కొన్ని రోజుల
పాటు రాకపోకలు స్తంభిస్తాయి. తొర్రూరు కేంద్రం నుండి నెల్లికుదురు,
మహబూబాబాద్, కేసముద్రం, నెక్కొండ ప్రాంతాలకు ఈ రహదారి మీదుగా రాకపోకలు
నిలిచిపోయే పరిస్థితి. దశాబ్దాలకాలంగా ఈ సమస్య ప్రతీ వర్షాకాలంలో
తలెత్తుతున్నా హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం కోసం పట్టించుకునే నాథుడే
కరువయ్యారు. అలాగే నెల్లికుదురు మండలం మదనతుర్తి శివారులోని మొండివాగు సైతం
రోడ్డుపైనే ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. దీని కారణంగా నెల్లికు దురు నుండి
మహబూబాబాద్ వైపు ఎవరు వెళ్లలేని పరిస్థితి. ఇటీవల నూతనంగా బీటి రోడ్డు
విస్తరణ పనులు చేపట్టినప్పటికీ హైలెవల్ బ్రిడ్జిని మాత్రం నిర్మించలేదు.
దీంతో ఈ రెండు రహదారులపై నెలకొన్న సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న
చందంగా మారింది.
Take By: T News
0 comments:
Post a Comment