వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కష్టకాలమే
-ఈ విషయం పార్టీ పెద్దలే అనుకుంటున్నారు
- శ్రేణుల్లో సమన్వయం లోపించింది
- కొందరు నేతల వల్లే తిరుపతిలో ఓటమి
- కాంగ్రెస్‌లో పీఆర్పీ శ్రేణులకు గుర్తింపేది?
- ఎంపీ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్,
జూన్ 22 ():వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కష్టకాలమేనని,
అధికారంలోకి రావడం కష్టమేనని పార్టీ పెద్దలు అనుకుంటున్నట్లు ఎంపీ, పీసీసీ
సమన్వయ కమిటీ సభ్యుడు చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ శ్రేణులు
సమన్వయంతో పనిచేయకపోవడం, కొందరు నేతలు సహకరించకపోవడం.. తిరుపతిలో కాంగ్రెస్
అభ్యర్థి వెంకటరమణ ఓటమికి కారణమన్నారు. తిరుపతితో పాటు మిగతా
నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణులు పూర్తి స్థాయిలో పూర్వపు పీఆర్పీ
నాయకుల్ని, శ్రేణుల్ని కలుపుకొని పనిచేయలేకపోయాయని చెప్పారు. అందుకే
ఆశించిన ఫలితాలు రాలేదని ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో
పీఆర్పీ నేతలకు సరైన గుర్తింపు లభించడంలేదని, వివక్షకు గురవుతున్నారన్నారు.
అయినప్పటికీ పీఆర్పీ మాజీ నేతలందరూ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం
పనిచేశారని తెలిపారు. సమన్వయంతో, ఐకమత్యంగా కృషి చేస్తే 2014లో కాంగ్రెస్
తిరిగి అధికారంలో రావడానికి ఎదురే ఉండదన్నారు. ఉప ఎన్నికల్లో తూర్పుగోదావరి
జిల్లా రామచంవూదాపురం అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన
తోట త్రిమూర్తులు శుక్రవారం స్పీకర్ వద్ద ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన
అనంతరం నియోజకవర్గానికి చెందిన కొందరు నేతలతో చిరంజీవిని ఆయన నివాసంలో
కలిశారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సమన్వయ లోపం ఉన్నా తన
అభిమానులు, ఆత్మబంధువులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినట్లు క్షేత్ర
స్థాయి పరిశీలనలో తేలిందన్నారు. కానీ కొందరు కావాలని పనిగట్టుకొని
దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో పీఆర్పీ
విలీనం తర్వాత ఆ ప్రయోజనాలు పొందడానికి కాంగ్రెస్ పార్టీ చొరవ
తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పూర్వపు పీఆర్పీ శ్రేణులకు
పార్టీలో సముచిత భాగస్వామ్యం కల్పించడం, అర్హులైన వారికి నామినేటెడ్ పదవులు
ఇవ్వడం ద్వారా పార్టీ శక్తిమంతమవుతుందని అభివూపాయపడ్డారు. పార్టీలో కొత్త
రక్తాన్ని ఎక్కించినట్లయితే పార్టీకి నూతన శక్తి లభిస్తుందని, తేజోవంతం
అవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలని సూచించారు. కేంద్రంలో
యూపీఏ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపడుతున్న అనేక మంచి
కార్యక్షికమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లగలిగే పార్టీ యంత్రాంగాన్ని అందరూ
భాగస్వామ్యంతో పటిష్టంగా రూపొందించుకోవాలని చెప్పడమే తన ఉద్దేశమన్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానం ఈ అంశాలపై దృష్టి పెట్టిందని, ఒకవూటెండు నెలల్లోనే
పార్టీ బలోపేతం కావడానికి క్షేత్రస్థాయి నుంచి తగిన చర్యలు తీసుకుంటుందని
ఆశాభావం వ్యక్తం చేశారు.
జగన్ సెంటిమెంట్ పనిచేయలేదు
జగన్
అరెస్టు, విజయమ్మ కన్నీళ్లతో ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ పెల్లుబుకిందని
చాలా మంది విశ్లేషణలు చేసినా రామచంవూదాపురం, నర్సాపురంలో అవేమీ పనిచేయలేదని
చిరంజీవి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఇక్కడ సమన్వయంతో
పనిచేయడమే కాంగ్రెస్ గెలుపునకు ప్రధాన కారణమని చెప్పారు. పూర్వపు పీఆర్పీ
అభ్యర్థులైన ఇక్కడి అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు,
కార్యకర్తలతో చక్కటి సమన్వయం సాధించి పనిచేయడం వల్లే అనుకూల ఫలితాలు
వచ్చాయన్నారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ తరఫున రామచంవూదాపురం నుంచి పోటీ
చేసిన తోట త్రిమూర్తులు స్వల్ప తేడాతో ఓడిపోవడం తనకు ఎంతో బాధ కలిగించిందని
చెప్పారు. అయితే మూడేళ్లు తిరిగేసరికి అతని గెలుపునకే ఉప ఎన్నికలు
వచ్చినట్లుగా వచ్చాయని, మంచి మెజారిటీతో త్రిమూర్తులు గెలువడం
సంతోషదాయకమన్నారు.
సమావేశం తర్వాత మీడియాతో చిరంజీవి కాసేపు
ముచ్చటించారు. కాంగ్రెస్ ఓటమికి పార్టీ నేతల అనైక్యతే కారణమా? అని అడిగిన
ప్రశ్నకు... కాంగ్రెస్ తన పూర్తి బలాన్ని సద్వినియోగం చేసుకొని ఉంటే
ఫలితాలు మెరుగ్గా వచ్చేవని అభివూపాయపడ్డారు. తిరుపతిలో కాంగ్రెస్ అభ్యర్ధి
ఎం వెంకటరమణ బహిరంగంగానే తనకు కొందరు నాయకులు సహకరించలేదంటూ కన్నీళ్ల
పర్యంతమైన ఘటనను చిరంజీవి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ విషయాన్ని హైకమాండ్
దృష్టికి తీసుకెళ్తారా? అని అడిగిన ప్రశ్నకు.. పార్టీని బలోపేతం చేయడానికి
సమన్వయ కమిటీ సభ్యుడిగా తన సూచనలు, సలహాలు ఇవ్వడం తన బాధ్యతని ఆయన స్పష్టం
చేశారు. కాగా, రామంచవూదాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాట్లాడుతూ తన
నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జరిగిన విధానానికి భిన్నంగా ఈ సారి తన
విజయానికి కుల, మత, వర్గాలకు, చివరకు పార్టీలకు అతీతంగా అందరూ కృషి చేశారని
పేర్కొన్నారు. తనపై నియోజకవర్గ ప్రజలు చూపించిన నమ్మకం, విశ్వాసాన్ని
నిలబెట్టుకుంటానన్నారు.
Take By: T News
0 comments:
Post a Comment