సమన్వయం లేదు అందుకే ఓడాం - చిరంజీవి
సోనియాకు నివేదించిన చిరంజీవి మీరూ కారణమేనన్న అధినేత్రి
‘ఉప’ ఓటమిపై పోస్ట్‌మార్టం
- పార్టీ బలోపేతంపై చర్చించాం
- పరిస్థితులను చక్కదిద్దేందుకు త్వరలో మేడమ్ కార్యాచరణ
- నాయకత్వ మార్పు ఉండదు
- నావల్లే గెలిచామని నేననలేదు మీడియానే వక్రీకరించింది
- సోనియాతో భేటీ అనంతరం చిరంజీవి
- రాష్ట్రంపై అధినేత్రి ప్రత్యేక దృష్టి
- అందుకే అడిగినవారికల్లా అపాయింట్‌మెంట్లు
- నాయకత్వ మార్పు అక్కర్లేదు: రఘువీరా
- అధిష్ఠానం ఆదేశిస్తే చిరును సమర్థిస్తాం
న్యూఢిల్లీ, జూన్ 27 ():కాంగ్రెస్‌లో పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు సమన్వయం లోపించడంవల్లే ఉప ఎన్నికల్లో ఓటమి పాలయినట్లు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అధినేత్రి సోనియాగాంధీ కూడా అంగీకరించినట్లు ఆయన చెప్పారు. పరిస్థితిని సరిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆమె దృష్టి సారించినట్లు తెలిపారు. దానిపై ఆమె రూపొందించే కార్యాచరణ ప్రణాళికను తామంతా అనుసరించి పార్టీని బలోపేతం చేస్త్తామని చెప్పుకొచ్చారు. కిందిస్థాయి నాయకులకు పార్టీ, నామినే పదవులు ఇచ్చి పని కల్పించాలని మేడమ్‌ను లేదు సమన్వయం.. అందుకే ఓడాం
కోరినట్లు తెలిపారు. ఆయన బుధవారం రాష్ట్ర మంత్రులు సీ రామచంవూదయ్య, గంటా శ్రీనివాసరావులతో కలిసి సోనియాతో 20 నిమిషాలపాటు సమావేశమయ్యారు. పార్టీ ఓటమి చెందడానికి కారణాలపై తనదైన నివేదికను ఆమెకు అందజేశారు.
ఆంధ్రవూపదేశ్‌లో ఇటీవలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం అనంతరం పార్టీ అగ్ర నేతలు పలువురు అధిష్ఠానాన్ని కలిసి తమ వివరణలను, అభివూపాయాలను నివేదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం చిరంజీవి కాంగ్రెస్ అధ్యక్షురాలితో భేటీ అయ్యారు. అగ్ర నాయకత్వం నుంచి, క్షేత్రస్థాయి వరకు అన్నిచోట్లా సమన్వయ లోపం కారణంగానే పార్టీకి దారుణ అనుభవం ఎదురైందని ఆయన విశ్లేషించినట్లు సమాచారం. తిరుపతిలాంటిచోట్ల కూడా నాయకుల మధ్య సఖ్యత కొరవడటం, అంతర్గత గ్రూపు తగాదాలవల్లే పార్టీ నష్టపోయిందని వివరించినట్లు తెలిసింది. రాజంపేట, రాయచోటి లాంటిచోట్ల సరైన అభ్యర్థులను నిలుపలేదని ఆయన అసంతృప్తి వ్యక్తపరిచినట్లు సమాచారం. కాంగ్రెస్‌కు దన్నుగా నిలుస్తున్న రెడ్డి సామాజికవర్గంతో పోలిస్తే తన సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తగా పార్టీకి పడ్డాయని ఆయన నియోజకవర్గాలవారీగా సమాచారాన్ని సోనియాకు అందించినట్లు తెలిసింది.
దాంతోపాటు నామినేటెడ్ పదవుల భర్తీ జరగకపోవడంవల్ల క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పనిచేయలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో తన పార్టీ పీఆర్పీ విలీనం సందర్భంగా ఇచ్చిన హామీలను పట్టించుకోలేదని, తన వర్గానికి ప్రాధాన్యం లభించలేదని చిరంజీవి ప్రస్తావించినట్లు సమాచారం. అయితే సోనియా సైతం చిరంజీవి పనితీరుపై అసంతృప్తిని వ్యక్తపరిచినట్లు తెలిసింది. ప్రతిసారి కాంగ్రెస్ నాయకత్వం సహకరించటం లేదని ఫిర్యాదు చేస్తున్న మీరు సమన్వయం కోసం ఏం ప్రయత్నాలు చేశారని ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ విలీనమై ఏడాది గడుస్తున్నా సొంత వర్గీయులైన గంటా, రామచంవూదయ్యలను వెంట తిప్పుకోవడం తప్ప కాంగ్రెస్ సీనియర్లతో, నాయకులతో సఖ్యత యత్నాలు ఆశాజనకంగా లేవని అన్నట్లు తెలిసింది. పార్టీ కష్టకాలంలో ఉన్నందున అహంభావాలకు పోకుండా పనిచేయాలని సూచించినట్లు సమాచారం.
అందుకే కేంద్ర పదవి అడుగుదామనుకున్న చిరంజీవి ఆ పనిచేయకుండానే వెనుదిరిగినట్లు తెలిసింది. సోనియాతో సమావేశమైన అనంతరం చిరంజీవి విలేకరులతో మాట్లాడారు. ఆ సందర్భంలోనూ తాను కేంద్ర పదవిని ఆశించలేదంటూ నిట్టూర్చారు. ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమిపై సోనియాతో ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. సానుభూతే జగన్ విజయానికి కారణమని, అదే కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారిందన్న అంశం తమ చర్చలో ప్రస్తావనకు వచ్చినట్లు చెప్పారు. రెండుస్థానాల్లో పార్టీ విజయానికి కారణాలపై సైతం చర్చించినట్లు చెప్పారు. అన్ని విషయాలపై మేడమ్‌కు అవగాహన ఉందని, భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు వెళ్లాలి? పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి? అన్న అంశాలపై ప్రధానంగా చర్చ జరిగిందన్నారు. రామచంవూదాపురం, నరసాపురంలో పార్టీ తనవల్లే గెలిచిందని తానెప్పుడూ అనలేదని వివరణ ఇచ్చారు. అదంతా మీడియా వక్రీకరణ అంటూ కొట్టిపారేశారు.
‘‘కలిసికట్టుగా పనిచేయడంవల్లే ఆయా స్థానాల్లో విజయం సాధించాం. ఇదే రకంగా కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలని చెప్పా. నావల్లే అక్కడ గెలిచారని నేనన్నట్లు మీడియా పదే పదే ప్రచారం చేయడం భావ్యం కాదు’’ అని సూచించారు. అందరం కలిసి ఏకాభివూపాయానికి వచ్చిన తర్వాతే తిరుపతి అభ్యర్థిని ఎంపిక చేశామని, వెంకటరమణ ఎంపిక సమిష్టి నిర్ణయమని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 2014 ఎన్నికల తర్వాత చిరంజీవే సీఎం అన్న పెడన ఎమ్మెల్యే జోగు రమేష్ వ్యాఖ్యలపై స్పందిస్తూ- అది ఆయన అభిమానంగా చూస్తున్నాను తప్ప ఆయన పదాల్లోని అర్థాన్ని తాను చూడటం లేదని అన్నారు. పార్టీలో తననెవ్వరు టార్గెట్ చేయడం లేదన్న ఆయన, దాన్ని మీడియానే ఎక్కువచేసి చూపుతోందన్నారు. తెలంగాణ అంశంగానీ, తనకు కేంద్ర మంత్రి పదవి అంశంగానీ చర్చకు రాలేదన్నారు. ‘‘సామాన్య కార్యకర్తగా పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను.
నా బాధ్యత ఏమిటన్నది అధిష్ఠానమే నిర్ణయిస్తుంది తప్ప నేను ఫలానా పదవి కావాలని ఏనాడూ అడగలేదు. కేంద్ర పదవి ఇవ్వకపోయినా, సంతృప్తిగా పనిచేస్తా. ప్రజలకు ఏం చేయాలన్నదే నాకు ముఖ్యం తప్ప నాకేం కావాలన్నది ముఖ్యం కాదు. ఎంపీగా అవకాశం ఇచ్చారు. నన్ను నిరూపించుకోనీయండి’’ అని స్పందించారు. ప్రభుత్వ పెద్దల పనితీరుపై అధ్యక్షురాలి వద్ద అసంతృప్తి వ్యక్తంచేయలేదని చెప్పారు. కేవలం భవిష్యత్తు ఎలా ఉండాలన్న దానిపైనే సలహాలిచ్చినట్లు చెప్పుకొచ్చారు. నాయకత్వ మార్పుల అంశం తమ చర్చలో ప్రస్తావనకు రాలేదని తెలిపారు. నాయకత్వ మార్పుంటుందని తాననుకోవడంలేదని చెప్పారు. మనుషులను సోనియా మారుస్తారని అనుకోనన్నారు. సీఎం మార్పుపై చర్చే లేనప్పుడు మీడియా వారికి నాయకత్వ మార్పుపై అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీగా అవినీతి జరిగిందన్నది కేవలం అభియోగమే తప్ప అది నిర్ధారణ కాలేదని గుర్తు చేశారు.
అవినీతి నిర్ధారణ అయితే తాను ఖచ్చితంగా స్పందిస్తానని బదులిచ్చారు. కాపులు గంపగుత్తగా కాంగ్రెస్‌కు ఓట్లేశారా అన్న ప్రశ్నకు తానేం మాట్లాడనని సమాధానమిచ్చారు. ఓట్లు ఎవ్వరు వేసినా వేయకపోయినా కాంగ్రెస్‌కు స్థిరమైన ఓటు బ్యాంకు ఉందన్న ఆయన అది ఎప్పటికీ చెక్కు చెదరదని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇతరుల ఓట్లు ఎంత మేర సాధించుకుంటామన్నదే తమకు ముఖ్యమని చెప్పుకొచ్చారు. పీఆర్పీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య సమన్వయలోపం కొనసాగుతోందని అంగీకరించారు. దాన్ని అధిగమించేలా పార్టీ కార్యాచరణ చేపట్టాలని కోరిన ఆయన అధిష్ఠానం చేపడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ఆగస్టులోపు పార్టీ, నామినేటెడ్ పదవులను కట్టబెట్టడానికి పార్టీ పెద్దలు దృష్టిసారిస్తున్నారని తెలిపారు. ఉప ఎన్నికలవల్లే పదవుల భర్తీ జరగలేదని తెలిపారు. నాయకులు కలిసికట్టుగా పనిచేస్తే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
దాంట్లో అనుమానాలకు తావులేదని తేల్చిచెప్పారు. అంతకుముందు ఆయన రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ప్రణబ్‌ముఖర్జీని కలిసి అభినందనలు తెలియచేశారు. రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో ఇక్కడి పార్టీ పరిస్థితులపై అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే అడిగినవారికల్లా అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారని పార్టీ వర్గాలు అభివూపాయపడుతున్నాయి.
నాయకత్వ మార్పుపై అధిష్ఠానానిదే నిర్ణయం: మంత్రి రఘువీరాడ్డి
కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పరిస్థితులను గాడిలో పెట్టడానికి నాయకత్వ మార్పు అవసరం లేదని రాష్ట్రమంత్రి రఘువీరాడ్డి అభివూపాయపడ్డారు. తనతో సహ అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తే సరిపోతుందన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్న ఆయన పార్టీని బలోపేతం చేయడమే తమ బాధ్యతని చెప్పారు. రాష్ట్రపతిగా ప్రణబ్ అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి ఢిల్లీ వచ్చిన రఘువీరాతో ఎంపీ చిరంజీవి బుధవారం కొద్దిసేపు మంతనాలు జరిపారు. అనంతరం రఘువీరా విలేకరులతో మాట్లాడారు. పార్టీలో సమన్వయం లోపించిందన్న చిరు వ్యాఖ్యలపై స్పందిస్తూ అధికార పార్టీలో ఇలాంటివి సహజమని అన్నారు. దానికి అనేక కారణాలున్నాయని చెప్పుకొచ్చారు. ఉప ఓటమికి కారణాలు వెతకడానికే పరిమితం కాకుండా ఓటమిని అధిగమించే విధంగా కార్యాచరణ రూపొందించుకుని నాయకులు ఐక్యంగా పనిచేయాలని కోరారు.
ప్రత్యేక తెలంగాణ అంశంపై అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఇకపై దానిపై మాట్లాడబోమని తెలిపారు. పదే పదే నాయకులు అభివూపాయాలను వ్యక్తంచేయడం భావ్యం కాదన్నారు. అధిష్ఠానం చిరంజీవి నాయకత్వంలో పనిచేయాలని ఆదేశిస్తే దాన్ని తాము ధిక్కరించబోమని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు. అధిష్ఠానం చెబితే చిరుతో సహా ఎవరి నాయకత్వాన్నైనా అంగీకరిస్తామని తెలిపారు.
Take By: T News
0 comments:
Post a Comment