ఉద్యోగుల సహాయ నిరాకరణకు మద్దతుగా ర్యాలీ
సిద్దిపేట,: పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ జేఏసీ ఆద్వర్యంలో చేస్తున్న సహాయ నిరాకరణకు మద్దతుగా శుక్రవారం నాడు రాజకీయ జేఏసీ మద్దతుగా సంఘీభావ ర్యాలీ నిర్వహించింది. పట్టణ వీధుల గుండా ర్యాలీ నిర్వ హించి ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో బైటాయించిన ఉద్యోగులకు మద్దతును ప్రకటించారు. ఈ సందర్బంగా మున్సిపల్ మాజీ ఛైర్మన్ రాజనర్సు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంఎల్‌ఏలు ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షలకు అనుగు ణంగా ఉద్యమానికి మద్దతు పలకాలన్నారు. పదవులు శాశ్వతం కాదని ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తున్న వారందరిని ప్రజలు పూవుల్లో పెట్టుకుని మరీ అందలం ఎక్కిస్తారన్నారు. ఇందుకు నిదర్శనంగానే ఉపఎన్నికల్లో రాజీనామాలు చేసిన అభ్యర్థులను తెలంగాణవాదులు భారీ మెజార్టీతో గెలిపిం చారన్నారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు సాకారం అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవని ఇలాంటి సమయంలో రాజకీయాలు మంచిది కాదన్నారు. జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీలకు అతీతంగా ఎజండాలు పక్కనపెట్టి తెలంగాణ రాష్ర్ట సాధన కోసం ఉద్యమిం చాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమం లో పాల్గొనని ప్రజాప్రతినిధులు తెలంగాణ ప్రజల చేతిలో భంగపాటుకు గురికాక తప్పద న్నారు. ఉద్యోగుల సహాయ నిరాకరణకు జడ్పీటీసీ బాలం రంగం, ఎంపీపీ ఉపాద్యక్షులు మారెడ్డి రవీందర్‌రెడ్డి, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కూర బా ్‌రెడ్డి, ఎంపీటీసీలు కొండం సంపత్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, సర్పంచ్ ర్రె రాజు, జీడిపల్లి కమలాకర్‌రావు, బాలకిషన్, నరేష్, వెంకట్‌గౌడ్, డాల్పిన్ మురళీ, పాల సాయిరాం, చిప్ప ప్రభాకర్, బూర విజయ, నందాదేవి, మంతూరి పద్మ, సుశీల, టైగర్ నర్సమ్మలు సంఘీభావం ప్రకటించారు.అదే విధంగా ఐసీడీఎస్ ఉద్యోగులు, రేషన్‌డీలర్ల సంఘం ఆధ్వర్యంలో సహాయ నిరాకరణకు సంఘీభావం ప్రకటిం చారు. అంతకు ముందు ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోనే మిహ ళలు బతుకమ్మ, ఉద్యోగులు కబడ్డీ ఆటలను ఆడారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు విక్రం, శ్రీహరి, వేణు గోపాల్‌రెడ్డి, బిక్షపతి, గురువారెడ్డి, బిక్షపతి, పరమేశ్వర్, కమాల్, రాజు, మజీద్, చంద్రశేఖర్‌రెడ్డి, రాజశేఖరవర్మ, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
నంగునూరులో...
తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మండల ఉద్యోగ జేఏసీ ఆద్వర్యంలో నంగునూరులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా తహిసీల్దార్ కార్యాలయం ఎదుట బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ వీధుల గుండా విద్యార్థులు, రాజకీయ జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా జేఏసీ నాయకులు నరేందర్ మాట్లాడుతూ మార్చి 5వ తేదీ వరకు నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో ఉద్యోగులు తప్పనిసరిగా పాలుపంచు కోవాలన్నారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పడే వరకు కలిసికట్టుగా పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ నాయకులు ప్రభాకర్, సుగుణ, ప్రభాకర ్‌రావు, హరికిషన్, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు జయ పాల్‌రెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి, రాజయ్య, సుభాష్‌చందర్, రాజ కీయ జేఏసీ నాయకులు సారయ్య, జాప శ్రీకాంత్‌రెడ్డి, రమేష్‌గౌడ్, సోమిరెడ్డి, సత్యనారాయణ, యాదమల్లు, పురేందర్, వేణుచక్రవర్తి, సతీష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నా
![Validate my RSS feed [Valid RSS]](valid-rss-rogers.png)


హైదరాబాద్, తెలంగాణలో ఉత్తరాం ధ్రకు చెందిన మూడు జిల్లాలు కలిపి హైదరాబాద్ స్టేట్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ తాజాగా తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం ఉన్న భౌగోళిక స్వరూపంతో కూడిన తెలంగాణ ప్రాంతంతో ప్రత్యేక రాష్ట్రం తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, సముద్ర తీర ప్రాంతంతో కూడిన రాష్ట్రం ఉంటేనే సత్వరంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందనే ప్రతిపాదనలను అధికార పక్షానికి చెందిన సభ్యులే తెరమీదికి తీసుకొస్తున్నారు.
హైదరాబాద్,మేజర్‌న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇస్తామని టీఆర్‌ఎస్ అధినేత కే.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తెలంగాణ వచ్చేదాకా పోరాటం కొనసాగిద్దామని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. మార్చి10న ‘మిలియన్ మార్చ్ టు హైదరాబాద్’ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. 10 లక్షల మందితో హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. రోడ్ల ద్వారా హైదరాబాద్‌లోకి ఒక్క చీమను కూడా దూరనిచ్చేది లేదన్నారు. రోడ్లపైనే వంటావార్పు ఉంటుందని చెప్పారు. శనివారం ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో లెక్చరర్లు చేస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని కేసీఆర్ సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఇప్పటిదాకా అన్ని పార్టీలపై ఒత్తిడి పెంచుతున్న టీఆర్‌ఎస్ ఇకపై తానే ఒత్తిడి ఎదుర్కోనుంది. తెలం గాణ రాష్ట్ర ఏర్పాటు వ్యవహారం ఇప్పుడు టీఆర్‌ఎస్ కోర్టుకే చేరింది. టీఆర్‌ఎస్ తన పార్టీలో విలీనం అయితేనే రాష్ట్ర విభజనకు అంగీకరిస్తామని కాం గ్రెస్ నాయకత్వం తనను కలుస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులకు స్పష్టం చేయ డంతో.. ఇకపై టీఆర్‌ఎస్‌పై ఒత్తిడి పెంచాలని కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించుకున్నట్లు సమా చారం. తెలంగాణ ఉద్యమం ఉధృతమవుతున్న నేపథ్యంలో తమపై పెరుగుతున్న ఒత్తిళ్ల నుంచి రక్షించాలంటూ ఇటీవల కొందరు ఎంపీలు ప్రణబ్‌ముఖర్జీ, అహ్మద్‌పటేల్ వద్దకు వెళ్లారు.
దీనితో.. తెలంగాణ రావాలంటే టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం కావాలన్న నినాదంతో ఒత్తిడి చేయాలని కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆ మేరకు ఒత్తిడి పెంచితే ప్రజల నుంచి కూడా టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయాలన్న డిమాండ్ వస్తుందని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్ విలీనం అయితే, తెలంగాణ త్వరగా వస్తుందన్న ప్రచారం ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సర్వే సత్యనారాయణ వంటి ఎంపీలు టీఆర్‌ఎస్ వెంటనే కాంగ్రెస్‌లో విలీనం చేస్తే అమ్మగారు (సోనియా) వెంటనే తెలంగాణ ఇచ్చేస్తుందని, ఇక తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్ ఎందుకని కేసీఆర్ సమక్షంలోనే సర్వే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరో సందర్భంలో సర్వేనే ‘టీఆర్‌ఎస్ విలీనం కాకుండా కాంగ్రెస్ తెలంగాణ ఎలా ఇస్తుంది.


















































