బంద్ సంపూర్ణం
సంగారెడ్డి, మేజర్‌న్యూస్ ప్రతినిధి : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టాలని కోరుతూ తెలం గాణ జాయింట్‌యాక్షన్ కమిటీ ఇచ్చిన 48 గంటల బంద్‌లో భాగంగా మొదటి రోజైన మంగళవారం మెదక్ జిల్లాలో సంపూర్ణంగా జరిగింది. అక్కడక్కడ బస్సుల ధ్వంసం, మరో రెండు బస్సులకు నిప్పంటించడం లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆందో ళన కారులు ఉదయం 6 గంటల నుంచే బైక్ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ రోడ్లెక్కడంతో వ్యాపారస్తులు, దుకాణాల వారు స్వచ్చందంగా మద్దతు పలికారు. ఈ సంద ర్భంగా సంగారెడ్డి మండల పరిధిలోని పసల్ వాది గ్రామం వద్ద కూకట్‌పల్లి ప్రాంతంలోని శ్రీచైతన్య కళాశాలకు చెందిన రెండు బస్సు లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించగా పూర్తిగా దహనమయ్యాయి.
ఈ సంఘటన తెల్లవారు జామున 4.30 గంటలకు జరిగి నట్లు సమాచారం. పోలీసులకు సమాచారం అందేపాటికే ఆ బస్సులు పూర్తిగా దహనమైపోగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సుందర్ కుమార్ దాస్ తెలిపారు. ఇదిలా ఉండగా పటాన్‌చెరు ప్రాంతంలో ప్రైవేటు కర్మాగారా లకు చెందిన రెండు బస్సుల అద్దాలను ఆందోళన కారులు పగులగొట్టారు. సంగారెడ్డి మండల పరిధిలోని ఇస్మాయిల్‌ఖాన్‌పేట వద్ద ఒక ప్రైవేటు బస్సు అద్దాలను పగులగొట్టి ధ్వంసం చేశారు. నర్సాపూర్ మండల పరిధి లోని రెడ్డిపల్లి గ్రామం వద్ద ఆందోళన కారులు రెండు బైక్‌లకు నిప్పంటించినట్లు సమాచారం అందింది.
అదేవిధంగా జిల్లాలోని తూప్రాన్ మండలం మాసాయిపేటలో ఆందోళన కారులు రైల్‌రోకో కార్యక్రమాన్ని చేపట్టారు. సిద్దిపేటలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమాకారులు మోకాళ్లపై నడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి సమీకృత కలెక్టరేట్ కార్యాల యంలో పని చేస్తున్న ఉద్యోగులు అక్కడి నుండి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్దకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించగా ఆర్టీసీ, బీఎస్‌ఎన్‌ఎల్ తదితర శాఖల ఉద్యోగులు పాల్గొని వారికి మద్దతు పలికారు. బంద్ సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా సినిమాహాళ్లు, పెట్రోల్ బంక్‌లు, వ్యాపార సంస్థలు, వాణిజ్య బ్యాంకులు, విద్యా సంస్థ లు, హోటళ్లు పూర్తిగా మూతపడ్డాయి.
అందరు కూడా తెలంగాణకు స్వచ్చంధంగా మద్దతు పలుకుతూ నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ బంద్ సంద ర్భంగా జిల్లాలోని అన్ని పట్టణాలు, మండ లాల్లో కూడా నిరసన ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు జరుగగా టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, ఎబీవీపీల తో పాటు కుల సంఘాలు, స్వచ్చంధ సంస్థలు కూడా పాల్గొన్నాయి. సంగారెడ్డిలో కేసీఆర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు.ఉద యం నుండి సాయంత్రం వరకు కూడా జిల్లాలోని ఆయా డిపోల నుండి ఆర్టీసీ బస్సు లు రోడ్డెక్కలేదు.
300ల మంది అరెస్ట్
బంద్ సందర్భంగా జిల్లాలోని వివిధ పట్టణాలు, వివిధ
ప్రాంతాలలో చెలరేగిపోయి విధ్వాంసాలకు పాల్పడ్డ ఉద్యమ కారులపై అందిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ సుందర్‌కుమార్‌దాస్ తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ రఘునందన్‌రావ్, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణతో పాటు ఆయా ప్రాంతాలలో మొత్తం 300ల మందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్పీ వివరించారు. సంగా రెడ్డి మండల పరిధిలోని ఫసల్‌వాది గ్రామంలో శ్రీచైతన్య విద్యా సంస్థకు చెందిన రెండు బస్సులకు నిప్పంటించగా ఆ బస్సులు దగ్ధ్దమైన సంఘటన విషయమై ఎస్పీని ప్రశ్నించగా కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. దోషులెవరో గుర్తించి తప్పకుండా అరెస్టు చేస్తామని వెళ్లడించారు.
ఆర్టీసీకి రూ. 34 లక్షల నష్టం
బంద్ సందర్భంగా మొదటి రోజైన మంగళవారం నాడు జిల్లాలో ఆర్టీసీ బస్సులను నడపని కారణంగా రూ.34 లక్షలు ఆదాయానికి గండి పడినట్లు రాష్ట్ర రోడ్డు రావాణా సంస్థ మెదక్ జిల్లా రీజినల్ మేనేజర్ వెంకటేశ్వర్‌రావ్ తెలిపారు. జిల్లాలోని మెదక్ డిపోలో 102 బస్సులు, నారాయణఖేడ్‌లో 67, సంగారెడ్డిలో 110, సిద్దిపేటలో 103, జహీరాబాద్‌లో 97, గజ్వేల్- ప్రజ్ఞాపూర్‌లో 52, దుబ్బాక డిపోలో 24 బస్సులు ఉన్నట్లు ఆయన వివరించారు. జిల్లా మొత్తంలో ఆర్టీసీ లీజుకు తీసుకున్న 135 ప్రైవేటు బస్సులతోపాటు మొత్తం 555 బస్సు సర్వీసులను మంగళవారం నిలిపి వేసిన సందర్బంగా ఆర్టీసీ ఆదాయానికి రూ. 34 లక్షల ఆదాయం తగ్గినట్లేనని వివరించారు. రెండవ రోజైన బుధవారం నాడు కూడా జెఎసి ఇచ్చిన పిలుపులో భాగంగా బంద్ కొనసాగనున్నందున ఆరోజైన బస్సు సర్వీసులను కొనసాగిస్తారా ఆని ప్రశ్నించగా ప్రభుత్వం ఆదేశిస్తే పోలీసు రక్షణతో నడిపించే ప్రయత్నం చేస్తామని ఆర్‌ఎం వెంకటేశ్వర్‌రావ్ వెల్లడించారు.
0 comments:
Post a Comment