బిల్లు పెట్టండి
న్యూఢిల్లీ, మేజర్‌న్యూస్: తెలంగాణపై బయట మాట్లాడ టమే తప్ప సాధికార చట్టసభ అయిన లోక్‌సభలో ఏనాడూ ప్రస్తావించని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చిట్టచివరకు గళమెత్తారు. పార్ల మెంటు ప్రస్తుత సమావేశాలలో బిల్లు ప్రవేశ పెట్టాలని కోరుతూ కేసీఆర్ మంగళవారం లో్ సభలో వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కేసీఆర్ కోరినప్పుడు 2జీ స్పెక్ట్రమ్ వ్యవహారంపై ప్రభు త్వం సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని ఏర్పాటు చేస్తు న్నట్టు ప్రకటించనున్నందువల్ల జీరో అవర్‌లో అవకాశం ఇస్తానని స్పీకర్ మీరా కుమార్ చెప్పారు. అయితే ఇది కేవలం ప్రస్తావించి ముగించే అంశం కాదనికచ్చితంగా చర్చ జరగాల్సి ఉన్నందున తాను ఆ అవకాశం వాడుకోదలచలేదని కేసీఆర్ ఆ తర్వా త లోక్‌సభ వెలుపల పత్రికల వారికి చెప్పారు. బైఠాయింపు నేడు...
బుధవారం మరోసారి తెలంగాణ అంశంపై వాయిదా తీర్మానం ఇస్తామని, చర్చకు అనుమతించ కపోతే పోడియం ముందు బైఠా యింపు జరిపేందుకు వీలుగా నిర్ణయాన్ని వాయి దా వేసుకున్నామన్నారు. ఈ లోగా తెలంగాణపట్ల సానుకూలంగా ఉన్న రాజకీయ పార్టీలన్నిటితోనూ చర్చిస్తామన్నారు. డిసెంబర్ తొమ్మిదిన కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఏదో ఒక సమాధానం రాబట్టటానికి తెలంగాణ అంశాన్ని సభలో ప్రస్తావించామని, బుధవారం ఈ విషయమే పట్టు పడతామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో 48 గంటల బంద్ ప్రారంభమై విజయవంతంగా సాగు తున్నా, ఇక్కడ కేంద్రానికి కానీ, అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చీమ కుట్టినట్టయినా లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే తెలంగాణ బిడ్డలు 600 మందికి పైగా ఆత్మహ త్యలు చేసుకున్నారని, ఇంతటి దారుణ పరిస్థితి నెలకొని ఉన్నప్పటికీ, అదేదో కేంద్రమే చూసుకుంటుంది లెమ్మని ముఖ్యమంత్రి ప్రేక్షక పాత్ర పోషించటం మంచిది కాదన్నారు. ఆయనే చొరవ తీసుకుని కేంద్రంతో సంప్రదింపు లు జరపాలని డిమాండ్ చేశారు.
గొంతెమ్మ కోరిక కాదు...
తెలంగాణ ఏర్పాటు అనేది గొంతెమ్మకోరిక కాదని, అది కోట్లాది ప్రజల ఆకాంక్ష అని స్పష్టం చేశారు.ఆ ఆకాంక్షను గుర్తించినందుకే కేంద్రం శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఆ కమిటీ నివేదిక సమర్పించి రెండు నెలలు అయిపోయిన దృష్ట్యా ప్రధాని వెంటనే ఏదో ఒకటి తేల్చాలని, సోనియా గాంధీ మాట నిలబెట్టుకోవాలని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇప్పటికే అగ్నిగోళంగా మారిందని, న్యాయ, శాసన వ్యవస్థలు స్తంభించిపోయాయ న్నారు.
ఈ నేపథ్యంలో ఫలానా సమయంలోగా తెలంగాణ ఏర్పాటు దిశగా ఫలానా చర్యలు చేపడతామని చెబితే ప్రస్తుత పరిస్థితి కాస్త అయినా చల్లబడుతుందన్నారు. బుధవారం కేంద్రం షరా మామూలుగా చూస్తాం... చేస్తాం...అని తప్పించు కునే ప్రయత్నం చేస్తే, ఆ తర్వాత జరిగే జేఏసీ సమావేశంలో ఏమి చేయా లో నిర్ణయించు కుంటామని కేసీఆర్ తేల్చి చెప్పా రు. ఆయన వెంట మెదక్ ఎంపీ విజయశాంతి, మాజీ ఎంపీ ఎ.పి.జితేందర్‌రెడ్డి తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
![Validate my RSS feed [Valid RSS]](valid-rss-rogers.png)

























0 comments:
Post a Comment